సూచనలు:
3. ఆ తర్వాత, కింద ఇచ్చిన వివరణాత్మక పూజా విధానాన్ని అనుసరించండి ।
పునః సంకల్పం –
(పుష్పాక్షతలు, ఒక చుక్క నీరు కుడి చేతిలోకి తీసుకొని కింద ఉన్న సంకల్పం చదవండి)
పూర్వోక్త ఏవం గుణవిశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీ______ముద్దిశ్య శ్రీ______ప్రీత్యర్థం పురుషసూక్త విధానేన యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే ॥
(అని చదివి పుష్పాక్షతలు పళ్ళెములో విడిచి, చేతిని శుభ్రం చేసుకోండి)
ధ్యానం –
(మీరు పూజ చేయాలనుకుంటున్న దేవుని యొక్క ధ్యాన శ్లోకం చదవండి)
ఓం శ్రీ ______ నమః ధ్యాయామి ।
(కొద్దిగా పుష్పాక్షతలు స్వామి వారి పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
ఆవాహనం –
స॒హస్ర॑శీర్షా॒ పురు॑షః ।
స॒హ॒స్రా॒క్షః స॒హస్ర॑పాత్ ।
స భూమిం॑ వి॒శ్వతో॑ వృ॒త్వా ।
అత్య॑తిష్ఠద్దశాంగు॒లం ।
ఓం శ్రీ ______ నమః ఆవాహయామి ।
(కొద్దిగా పుష్పాక్షతలు స్వామి వారి పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
ఆసనం –
పురు॑ష ఏ॒వేదగ్ం సర్వం᳚ ।
యద్భూ॒తం యచ్చ॒ భవ్యం᳚ ।
ఉ॒తామృ॑త॒త్వస్యేశా॑నః ।
య॒దన్నే॑నాతి॒రోహ॑తి ।
ఓం శ్రీ ______ నమః నవరత్నఖచిత సువర్ణ సింహాసనం సమర్పయామి ।
(స్వామివారికి సింహాసనం సమర్పిస్తున్నట్లు భావన చేస్తూ, కొద్దిగా పుష్పాక్షతలు స్వామి వారి పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
పాద్యం –
ఏ॒తావా॑నస్య మహి॒మా ।
అతో॒ జ్యాయాగ్॑శ్చ॒ పూరు॑షః ।
పాదో᳚ఽస్య॒ విశ్వా॑ భూ॒తాని॑ ।
త్రి॒పాద॑స్యా॒మృతం॑ ది॒వి ।
ఓం శ్రీ ______ నమః పాదయోః పాద్యం సమర్పయామి ।
(స్వామివారి పాదాలు కడిగినట్లు భావన చేస్తూ, దేవుని పంచపాత్రలోని నీరు ఉద్ధరిణితో స్వామికి చూపి, వేరొక పాత్రలో విడిచిపెట్టండి)
అర్ఘ్యం –
త్రి॒పాదూ॒ర్ధ్వ ఉదై॒త్పురు॑షః ।
పాదో᳚ఽస్యే॒హాఽఽభ॑వా॒త్పున॑: ।
తతో॒ విష్వ॒ఙ్వ్య॑క్రామత్ ।
సా॒శ॒నా॒న॒శ॒నే అ॒భి ।
ఓం శ్రీ ______ నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ।
(స్వామివారి చేతులు కడిగినట్లు భావన చేస్తూ, దేవుని పంచపాత్రలోని నీరు ఉద్ధరిణితో స్వామికి చూపి, వేరొక పాత్రలో విడిచిపెట్టండి)
ఆచమనీయం –
తస్మా᳚ద్వి॒రాడ॑జాయత ।
వి॒రాజో॒ అధి॒ పూరు॑షః ।
స జా॒తో అత్య॑రిచ్యత ।
ప॒శ్చాద్భూమి॒మథో॑ పు॒రః ।
ఓం శ్రీ ______ నమః ముఖే ఆచమనీయం సమర్పయామి ।
(దేవుని పంచపాత్రలోని నీరు ఉద్దరిణెతో స్వామికి చూపి, వేరొక పాత్ర లో విడిచిపెట్టి, స్వామివారు ముఖం కడుక్కుని నీరు తాగినట్లు భావన చేయండి)
పంచామృత స్నానం –
ఆప్యా॑యస్వ॒ సమే॑తు తే వి॒శ్వత॑స్సోమ॒ వృష్ణి॑యం ।
భవా॒ వాజ॑స్య సంగ॒థే ॥
ఓం శ్రీ ______ నమః క్షీరేణ స్నపయామి ।
(ఆవు పాలతో అభిషేకం చేసి, నూనె లేదా నెయ్యి దీపంతో హారతి ఇవ్వండి)
(నీటితో అభిషేకం చేసి, ప్రతిమను శుభ్రం చేయండి)
ద॒ధి॒క్రావ్ణో॑ అకారిషం జి॒ష్ణోరశ్వ॑స్య వా॒జిన॑: ।
సు॒ర॒భి నో॒ ముఖా॑ కర॒త్ప్రాణ॒ ఆయూగ్ం॑షి తారిషత్ ॥
ఓం శ్రీ ______ నమః దధ్నా స్నపయామి ।
(ఆవు పెరుగుతో అభిషేకం చేసి, నూనె లేదా నెయ్యి దీపంతో హారతి ఇవ్వండి)
(నీటితో అభిషేకం చేసి, ప్రతిమను శుభ్రం చేయండి)
శు॒క్రమ॑సి॒ జ్యోతి॑రసి॒ తేజో॑సి దే॒వోవ॑స్సవి॒తోత్పు॑నా॒తు
అచ్ఛి॑ద్రేణ ప॒విత్రే॑ణ॒ వసో॒స్సూర్య॑స్య ర॒శ్మిభి॑: ।
ఓం శ్రీ ______ నమః ఆజ్యేన స్నపయామి ।
(ఆవు నెయ్యితో అభిషేకం చేసి, నూనె లేదా నెయ్యి దీపంతో హారతి ఇవ్వండి)
(నీటితో అభిషేకం చేసి, ప్రతిమను శుభ్రం చేయండి)
మధు॒వాతా॑ ఋతాయ॒తే మధు॑క్షరంతి॒ సింధ॑వః ।
మాధ్వీ᳚ర్నః సం॒త్వౌష॑ధీః ।
మధు॒నక్త॑ము॒తోష॑సి॒ మధు॑మ॒త్ పార్థి॑వ॒గ్ం॒రజ॑: ।
మధు॒ద్యౌర॑స్తు నః పి॒తా ।
మధు॑మాన్నో॒ వన॒స్పతి॒ర్మధు॑మాగ్ం అస్తు॒ సూర్య॑: ।
మాధ్వీ॒ర్గావో॑ భవంతు నః ।
ఓం శ్రీ ______ నమః మధునా స్నపయామి ।
(తేనెతో అభిషేకం చేసి, నూనె లేదా నెయ్యి దీపంతో హారతి ఇవ్వండి)
(నీటితో అభిషేకం చేసి, ప్రతిమను శుభ్రం చేయండి)
స్వా॒దుః ప॑వస్వ ది॒వ్యాయ॒ జన్మ॑నే ।
స్వా॒దురింద్రా᳚య సు॒హవీ᳚తు నామ్నే ।
స్వా॒దుర్మి॒త్రాయ॒ వరు॑ణాయ వా॒యవే॒ ।
బృహ॒స్పత॑యే॒ మధు॑మాం॒ అదా᳚భ్యః ।
ఓం శ్రీ ______ నమః శర్కరేణ స్నపయామి ।
(చక్కెరతో అభిషేకం చేసి, నూనె లేదా నెయ్యి దీపంతో హారతి ఇవ్వండి)
(నీటితో అభిషేకం చేసి, ప్రతిమను శుభ్రం చేయండి)
యాః ఫ॒లినీ॒ర్యా అ॑ఫ॒లా అ॑పు॒ష్పాయాశ్చ॑ పు॒ష్పిణీ॑: ।
బృహ॒స్పతి॑ ప్రసూతా॒స్తానో॑ మున్చం॒త్వగ్ం హ॑సః ॥
ఓం శ్రీ ______ నమః ఫలోదకేన స్నపయామి ।
(పండ్ల రసంతో అభిషేకం చేసి, నూనె లేదా నెయ్యి దీపంతో హారతి ఇవ్వండి)
(నీటితో అభిషేకం చేసి, ప్రతిమను శుభ్రం చేయండి)
స్నానం –
యత్పురు॑షేణ హ॒విషా᳚ ।
దే॒వా య॒జ్ఞమత॑న్వత ।
వ॒సం॒తో అ॑స్యాసీ॒దాజ్యం᳚ ।
గ్రీ॒ష్మ ఇ॒ధ్మశ్శ॒రద్ధ॒విః ।
ఆపో॒ హిష్ఠా మ॑యో॒భువ॒స్తా న॑ ఊ॒ర్జే ద॑ధాతన ।
మ॒హేరణా॑య॒ చక్ష॑సే ।
యో వ॑: శి॒వత॑మో రస॒స్తస్య॑ భాజయతే॒ హ న॑: ।
ఉ॒శ॒తీరి॑వ మా॒త॑రః ।
తస్మా॒ అరం॑గమామవో॒ యస్య॒ క్షయా॑య॒ జిన్వ॑థ ।
ఆపో॑ జ॒నయ॑థా చ నః ।
ఓం శ్రీ ______ నమః శుద్ధోదక స్నానం సమర్పయామి ।
(పుష్పంతో స్వామి వారిపై కొద్దిగా దేవుని పంచపాత్రలోని నీరు చల్లి, ఆ పుష్పాన్ని స్వామి వారి పాదాల వద్ద విడిచిపెట్టి, స్వామివారికి స్నానం చేయించినట్లు భావన చేయండి)
స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ।
(దేవుని పంచపాత్రలోని నీరు ఉద్దరిణెతో స్వామికి చూపి, వేరొక పాత్ర లో విడిచిపెట్టి, స్వామివారు ముఖం కడుక్కుని నీరు తాగినట్లు భావన చేయండి)
వస్త్రం –
స॒ప్తాస్యా॑సన్పరి॒ధయ॑: ।
త్రిః స॒ప్త స॒మిధ॑: కృ॒తాః ।
దే॒వా యద్య॒జ్ఞం త॑న్వా॒నాః ।
అబ॑ధ్న॒న్పురు॑షం ప॒శుం ।
ఓం శ్రీ ______ నమః వస్త్రయుగ్మం సమర్పయామి ।
(స్వామివారికి వస్త్రం సమర్పించినట్లు భావన చేస్తూ, కొద్దిగా పుష్పాక్షతలు స్వామి వారి పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
యజ్ఞోపవీతం –
తం య॒జ్ఞం బ॒ర్హిషి॒ ప్రౌక్షన్॑ ।
పురు॑షం జా॒తమ॑గ్ర॒తః ।
తేన॑ దే॒వా అయ॑జంత ।
సా॒ధ్యా ఋష॑యశ్చ॒ యే ।
ఓం శ్రీ ______ నమః యజ్ఞోపవీతం సమర్పయామి ।
(స్వామివారికి యజ్ఞోపవీతం సమర్పిస్తున్నట్లు భావన చేస్తూ, కొద్దిగా అక్షతలు స్వామి వారి పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
గంధం –
తస్మా᳚ద్య॒జ్ఞాత్స॑ర్వ॒హుత॑: ।
సంభృ॑తం పృషదా॒జ్యం ।
ప॒శూగ్స్తాగ్శ్చ॑క్రే వాయ॒వ్యాన్॑ ।
ఆ॒ర॒ణ్యాన్గ్రా॒మ్యాశ్చ॒ యే ।
ఓం శ్రీ ______ నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి ।
(గంధాన్ని సమర్పిస్తున్నట్లు భావన చేస్తూ, గంధాన్ని నీటితో తడిపి, ఒక పుష్పంతో స్వామివారి మీద చల్లి, ఆ పుష్పాన్ని స్వామి వారి సమర్పించండి)
ఆభరణం –
తస్మా᳚ద్య॒జ్ఞాత్స॑ర్వ॒హుత॑: ।
ఋచ॒: సామా॑ని జజ్ఞిరే ।
ఛందాగ్ం॑సి జజ్ఞిరే॒ తస్మా᳚త్ ।
యజు॒స్తస్మా॑దజాయత ।
ఓం శ్రీ ______ నమః సర్వాభరణాని సమర్పయామి ।
(స్వామివారికి ఆభరణాలు సమర్పిస్తున్నట్లు భావన చేస్తూ, కొద్దిగా పుష్పాక్షతలు స్వామి వారి సమర్పించండి)
పుష్పాణి –
తస్మా॒దశ్వా॑ అజాయంత ।
యే కే చో॑భ॒యాద॑తః ।
గావో॑ హ జజ్ఞిరే॒ తస్మా᳚త్ ।
తస్మా᳚జ్జా॒తా అ॑జా॒వయ॑: ।
ఓం శ్రీ ______ నమః నానావిధ పరిమల పత్ర పుష్పాణి సమర్పయామి ।
(కొద్దిగా పుష్పాలు స్వామి వారి పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
ధూపం –
యత్పురు॑షం॒ వ్య॑దధుః ।
క॒తి॒ధా వ్య॑కల్పయన్ ।
ముఖం॒ కిమ॑స్య॒ కౌ బా॒హూ ।
కావూ॒రూ పాదా॑వుచ్యేతే ।
ఓం శ్రీ ______ నమః ధూపం సమర్పయామి ।
(గంటానాధం చేస్తూ స్వామివారికి వెలిగించిన అగరబత్తి చూపించండి)
దీపం –
బ్రా॒హ్మ॒ణో᳚ఽస్య॒ ముఖ॑మాసీత్ ।
బా॒హూ రా॑జ॒న్య॑: కృ॒తః ।
ఊ॒రూ తద॑స్య॒ యద్వైశ్య॑: ।
ప॒ద్భ్యాగ్ం శూ॒ద్రో అ॑జాయత ।
ఓం శ్రీ ______ నమః దీపం సమర్పయామి ।
(గంటానాధం చేస్తూ స్వామివారికి వెలిగించిన దీపాన్ని చూపించండి)
ధూప దీపానంతరం ఆచమనీయం సమర్పయామి ।
(దేవుని పంచపాత్రలోని నీరు ఉద్దరిణెతో స్వామికి చూపి, వేరొక పాత్ర లో విడిచిపెట్టి, స్వామివారు ముఖం కడుక్కుని నీరు తాగినట్లు భావన చేయండి)
నైవేద్యం –
చం॒ద్రమా॒ మన॑సో జా॒తః ।
చక్షో॒: సూర్యో॑ అజాయత ।
ముఖా॒దింద్ర॑శ్చా॒గ్నిశ్చ॑ ।
ప్రా॒ణాద్వా॒యుర॑జాయత ।
ఓం శ్రీ ______ నమః నైవేద్యం సమర్పయామి ।
(గంటానాధం చేస్తూ, క్రింది మంత్రం చెపుతూ పుష్పంతో నీటిని నైవేద్యం చుట్టూ 3సార్లు సవ్య దిశలో చల్లాలి)
ఓం భూర్భువ॑స్సువ॑: । తత్స॑వితు॒ర్వరే᳚ణ్యం॒ । భ॒ర్గో॑ దే॒వస్య॑ ధీ॒మహి ।
ధియో॒ యోన॑: ప్రచో॒దయా᳚త్ ॥
సత్యం త్వా ఋతేన పరిషించామి (పుష్పంతో నైవేద్యంపై నీటిని చల్లండి)
(సాయంకాలే) – ఋతం త్వా సత్యేన పరిషించామి (పుష్పంతో నైవేద్యంపై నీటిని చల్లండి)
అమృతమస్తు । అమృతోపస్తరణమసి । (ఆ పుష్పాన్ని స్వామి వారి పాదాల వద్ద విడిచిపెట్టండి)
ఓం ప్రాణాయ స్వాహా । (స్వామివారికి నైవేద్యం చూపించండి)
ఓం అపానాయ స్వాహా । (స్వామివారికి నైవేద్యం చూపించండి)
ఓం వ్యానాయ స్వాహా । (స్వామివారికి నైవేద్యం చూపించండి)
ఓం ఉదానాయ స్వాహా । (స్వామివారికి నైవేద్యం చూపించండి)
ఓం సమానాయ స్వాహా । (స్వామివారికి నైవేద్యం చూపించండి)
(క్రింది మంత్రాలు చెపుతూ పుష్పంతో నీటిని దేవుడి పైన 5 సార్లు చల్లండి)
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి ।
అ॒మృ॒తా॒పి॒ధా॒నమ॑సి ।
ఉత్తరాపోశనం సమర్పయామి ।
హస్తౌ ప్రక్షాలయామి ।
పాదౌ ప్రక్షాలయామి ।
శుద్ధాచమనీయం సమర్పయామి ।
తాంబూలం –
నాభ్యా॑ ఆసీదం॒తరి॑క్షం ।
శీ॒ర్ష్ణో ద్యౌః సమ॑వర్తత ।
ప॒ద్భ్యాం భూమి॒ర్దిశ॒: శ్రోత్రా᳚త్ ।
తథా॑ లో॒కాగ్ం అ॑కల్పయన్ ।
ఓం శ్రీ ______ నమః తాంబూలం సమర్పయామి ।
(స్వామివారికి తాంబూలం సమర్పిస్తున్నట్లు భావన చేస్తూ, కొద్దిగా పుష్పాక్షతలు స్వామి వారి పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
నీరాజనం –
వేదా॒హమే॒తం పురు॑షం మ॒హాంతం᳚ ।
ఆ॒ది॒త్యవ॑ర్ణం॒ తమ॑స॒స్తు పా॒రే ।
సర్వా॑ణి రూ॒పాణి॑ వి॒చిత్య॒ ధీర॑: ।
నామా॑ని కృ॒త్వాఽభి॒వద॒న్॒ యదాస్తే᳚ ।
ఓం శ్రీ ______ నమః కర్పూర నీరాజనం సమర్పయామి ।
(గంటానాధం చేస్తూ స్వామివారికి కర్పూర హారతి ఇవ్వండి)
నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి । నమస్కరోమి ।
(దేవుని పంచపాత్రలోని నీరు ఉద్దరిణెతో స్వామికి చూపి, వేరొక పాత్ర లో విడిచిపెట్టి, స్వామివారు ముఖం కడుక్కుని నీరు తాగినట్లు భావన చేయండి)
మంత్రపుష్పం –
ధా॒తా పు॒రస్తా॒ద్యము॑దాజ॒హార॑ ।
శ॒క్రః ప్రవి॒ద్వాన్ప్ర॒దిశ॒శ్చత॑స్రః ।
తమే॒వం వి॒ద్వాన॒మృత॑ ఇ॒హ భ॑వతి ।
నాన్యః పంథా॒ అయ॑నాయ విద్యతే ।
ఓం శ్రీ ______ నమః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి ।
(కొద్దిగా పుష్పాక్షతలు స్వామి వారి పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
ఆత్మప్రదక్షిణ –
యానికాని చ పాపాని జన్మాంతరకృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ।
పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవ ।
త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సలా ।
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ ।
తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దనా ।
ఓం శ్రీ ______ నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ।
(అక్షతలు, పుష్పం తీసుకొని, ఆత్మ ప్రదక్షిణాన్ని మూడు సార్లు చేసి, స్వామి వారి పాదాల వద్ద విడిచి పెట్టండి)
సాష్టాంగ నమస్కారం –
ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా ।
పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే ॥
ఓం శ్రీ ______ నమః సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి ।
(పురుషులు సాష్టాంగ, మహిళలు పంచాంగ నమస్కారం చేయండి)
సర్వోపచారాః –
ఓం శ్రీ ______ నమః ఛత్రం ఆచ్ఛాదయామి ।
ఓం శ్రీ ______ నమః చామరైర్వీజయామి ।
ఓం శ్రీ ______ నమః నృత్యం దర్శయామి ।
ఓం శ్రీ ______ నమః గీతం శ్రావయామి ।
ఓం శ్రీ ______ నమః ఆందోలికాన్నారోహయామి ।
ఓం శ్రీ ______ నమః అశ్వానారోహయామి ।
ఓం శ్రీ ______ నమః గజానారోహయామి ।
సమస్త రాజోపచారాన్ దేవోపచారాన్ సమర్పయామి ।
క్షమాప్రార్థనా –
అపరాధ సహస్రాణి క్రియంతేఽహర్నిశం మయా ।
దాసోఽయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వర ।
ఆవాహనం న జానామి న జానామి విసర్జనం ।
పూజావిధిం న జానామి క్షమస్వ పరమేశ్వర ।
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన ।
యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే ।
(పుష్పాక్షతలు, ఒక చుక్క నీరు కుడి చేతిలోకి తీసుకొని పై శ్లోకం చదివి, స్వామి వారి పాదాల వద్ద విడిచిపెట్టండి)
అనయా పురుషసూక్త విధాన పూర్వక ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః శ్రీ ______ సుప్రీతా సుప్రసన్నా వరదా భవంతు ॥
(కొద్దిగా పుష్పాక్షతలు స్వామి వారి పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
తీర్థప్రసాద స్వీకరణ –
అకాలమృత్యహరణం సర్వవ్యాధినివారణం ॥
సమస్తపాపక్షయకరం శ్రీ ______ పాదోదకం పావనం శుభం ॥
శ్రీ ______ నమః ప్రసాదం శీరసా గృహ్ణామి ।
(కుడి చేతిలో నీరు పోసుకొని, పై శ్లోకం చదివి మూడు సార్లు తీర్థం తాగండి)
ఓం శాంతిః శాంతిః శాంతిః ।