Haindavam Logo - Lord Ganesha
Haindavam
📍
Font Size:

శ్రీ సూక్త విధాన పూర్వక షోడశోపచార పూజా

సూచనలు:
1. ముందుగా, పూర్వాంగం చేయండి ।
2. తరువాత, విఘ్నేశ్వర పూజ చేయండి ।
3. ఆ తర్వాత, కింద ఇచ్చిన వివరణాత్మక పూజా విధానాన్ని అనుసరించండి ।
పునః సంకల్పం –
(పుష్పాక్షతలు, ఒక చుక్క నీరు కుడి చేతిలోకి తీసుకొని కింద ఉన్న సంకల్పం చదవండి)
పూర్వోక్త ఏవం గుణవిశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీ______ముద్దిశ్య శ్రీ______ప్రీత్యర్థం శ్రీసూక్త విధానేన యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే ॥
(అని చదివి పుష్పాక్షతలు పళ్ళెములో విడిచి, చేతిని శుభ్రం చేసుకోండి)
ధ్యానం –
(మీరు పూజ చేయాలనుకుంటున్న దేవి యొక్క ధ్యాన శ్లోకం చదవండి)
ఓం శ్రీ ______ నమః ధ్యాయామి ।
(కొద్దిగా పుష్పాక్షతలు అమ్మవారు పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
ఆవాహనం –
హిర॑ణ్యవర్ణాం॒ హరి॑ణీం సు॒వర్ణ॑రజ॒తస్ర॑జాం ।
చం॒ద్రాం హి॒రణ్మ॑యీం ల॒క్ష్మీం జాత॑వేదో మ॒ ఆవ॑హ ॥
ఓం శ్రీ ______ నమః ఆవాహయామి ।
(కొద్దిగా పుష్పాక్షతలు అమ్మవారు పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
ఆసనం-
తాం మ॒ ఆవ॑హ॒ జాత॑వేదో ల॒క్ష్మీమన॑పగా॒మినీం᳚ ।
యస్యాం॒ హిర॑ణ్యం విం॒దేయం॒ గామశ్వం॒ పురు॑షాన॒హం ॥
ఓం శ్రీ ______ నమః నవరత్నఖచిత సువర్ణ సింహాసనం సమర్పయామి ।
(అమ్మవారికి సింహాసనం సమర్పిస్తున్నట్లు భావన చేస్తూ, కొద్దిగా పుష్పాక్షతలు అమ్మవారు పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
పాద్యం-
అ॒శ్వ॒పూ॒ర్వాం ర॑థమ॒ధ్యాం హ॒స్తినా॑దప్ర॒బోధి॑నీం ।
శ్రియం॑ దే॒వీముప॑హ్వయే॒ శ్రీర్మా॑దే॒వీర్జు॑షతాం ॥
ఓం శ్రీ ______ నమః పాదయో పాద్యం సమర్పయామి ।
(అమ్మవారి పాదాలు కడిగినట్లు భావన చేస్తూ, దేవుని పంచపాత్రలోని నీరు ఉద్ధరిణితో అమ్మవారికి చూపి, వేరొక పాత్రలో విడిచిపెట్టండి)
అర్ఘ్యం-
కాం॒ సో᳚స్మి॒తాం హిర॑ణ్యప్రా॒కారా॑మా॒ర్ద్రాం జ్వలం॑తీం తృ॒ప్తాం త॒ర్పయం॑తీం ।
ప॒ద్మే॒ స్థి॒తాం ప॒ద్మవ॑ర్ణాం॒ తామి॒హోప॑హ్వయే॒ శ్రియం ॥
ఓం శ్రీ ______ నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ।
(అమ్మవారి చేతులు కడిగినట్లు భావన చేస్తూ, దేవుని పంచపాత్రలోని నీరు ఉద్ధరిణితో అమ్మవారికి చూపి, వేరొక పాత్రలో విడిచిపెట్టండి)
ఆచమనీయం-
చం॒ద్రాం ప్ర॑భా॒సాం య॒శసా॒ జ్వలం॑తీం॒ శ్రియం॑ లో॒కే దే॒వజు॑ష్టాముదా॒రాం ।
తాం ప॒ద్మినీ॑మీం॒ శర॑ణమ॒హం ప్రప॑ద్యేఽల॒క్ష్మీర్మే॑ నశ్యతాం॒ త్వాం వృ॑ణే ॥
ఓం శ్రీ ______ నమః ముఖే ఆచమనీయం సమర్పయామి ।
(దేవుని పంచపాత్రలోని నీరు ఉద్దరిణెతో అమ్మవారికి చూపి, వేరొక పాత్ర లో విడిచిపెట్టి, అమ్మవారు ముఖం కడుక్కుని నీరు తాగినట్లు భావన చేయండి)
పంచామృత స్నానం-
ఆప్యా॑యస్వ॒ సమే॑తు తే వి॒శ్వత॑స్సోమ॒ వృష్ణి॑యం ।
భవా॒ వాజ॑స్య సంగ॒థే ॥
ఓం శ్రీ ______ నమః క్షీరేణ స్నపయామి ।
(ఆవు పాలతో అభిషేకం చేసి, నూనె లేదా నెయ్యి దీపంతో హారతి ఇవ్వండి)
(నీటితో అభిషేకం చేసి, ప్రతిమను శుభ్రం చేయండి)
ద॒ధి॒క్రావ్ణో॑అకారిషం జి॒ష్ణోరశ్వ॑స్య వా॒జిన॑: ।
సు॒ర॒భి నో॒ ముఖా॑ కర॒త్ప్రాణ॒ ఆయూగ్ం॑హి తారిషత్ ॥
ఓం శ్రీ ______ నమః దధ్నా స్నపయామి ।
(ఆవు పెరుగుతో అభిషేకం చేసి, నూనె లేదా నెయ్యి దీపంతో హారతి ఇవ్వండి)
(నీటితో అభిషేకం చేసి, ప్రతిమను శుభ్రం చేయండి)
శు॒క్రమ॑సి॒ జ్యోతి॑రసి॒ తేజో॑సి దే॒వోవ॑స్సవి॒తోత్పు॑నా॒తు
అచ్ఛి॑ద్రేణ ప॒విత్రే॑ణ॒ వసో॒స్సూర్య॑స్య ర॒శ్మిభి॑: ।
ఓం శ్రీ ______ నమః ఆజ్యేన స్నపయామి ।
(ఆవు నెయ్యితో అభిషేకం చేసి, నూనె లేదా నెయ్యి దీపంతో హారతి ఇవ్వండి)
(నీటితో అభిషేకం చేసి, ప్రతిమను శుభ్రం చేయండి)
మధు॒వాతా॑ ఋతాయ॒తే మధు॑క్షరంతి॒ సింధ॑వః ।
మాధ్వీ᳚ర్నః సం॒త్వౌష॑ధీః ।
మధు॒ నక్త॑ము॒తోష॑సి॒ మధు॑మ॒త్పార్థి॑వగ్ం రజ॑: ।
మధు॒ద్యౌర॑స్తు నః పి॒తా ।
మధు॑మాన్నో॒ వన॒స్పతి॒ర్మధు॑మాగ్ం అస్తు॒ సూర్య॑: ।
మాధ్వీ॒ర్గావో॑ భవంతు నః ।
ఓం శ్రీ ______ నమః మధునా స్నపయామి ।
(తేనెతో అభిషేకం చేసి, నూనె లేదా నెయ్యి దీపంతో హారతి ఇవ్వండి)
(నీటితో అభిషేకం చేసి, ప్రతిమను శుభ్రం చేయండి)
స్వా॒దుః ప॑వస్వ ది॒వ్యాయ॒ జన్మ॑నే ।
స్వా॒దురింద్రా᳚య సు॒హవీ᳚తు నామ్నే ।
స్వా॒దుర్మి॒త్రాయ॒ వరు॑ణాయ వా॒యవే॒ ।
బృహ॒స్పత॑యే॒ మధు॑మాం॒ అదా᳚భ్యః ।
ఓం శ్రీ ______ నమః శర్కరేణ స్నపయామి ।
(చక్కెరతో అభిషేకం చేసి, నూనె లేదా నెయ్యి దీపంతో హారతి ఇవ్వండి)
(నీటితో అభిషేకం చేసి, ప్రతిమను శుభ్రం చేయండి)
యాః ఫ॒లినీ॒ర్యా అ॑ఫ॒లా అ॑పు॒ష్పాయాశ్చ॑ పు॒ష్పిణీ॑: ।
బృహ॒స్పతి॑ ప్రసూతా॒స్తానో॑ మున్చం॒త్వగ్ం హ॑సః ॥
ఓం శ్రీ ______ నమః ఫలోదకేన స్నపయామి ।
(పండ్ల రసంతో అభిషేకం చేసి, నూనె లేదా నెయ్యి దీపంతో హారతి ఇవ్వండి)
(నీటితో అభిషేకం చేసి, ప్రతిమను శుభ్రం చేయండి)
స్నానం –
ఆ॒ది॒త్యవ॑ర్ణే॒ తప॒సోఽధి॑జా॒తో వన॒స్పతి॒స్తవ॑ వృ॒క్షోఽథ బి॒ల్వః ।
తస్య॒ ఫలా॑ని॒ తప॒సా ను॑దంతు మా॒యాంత॑రా॒యాశ్చ॑ బా॒హ్యా అ॑ల॒క్ష్మీః ॥
ఆపో॒ హిష్ఠా మ॑యో॒భువ॒స్తా న॑ ఊ॒ర్జే ద॑ధాతన ।
మ॒హేరణా॑య॒ చక్ష॑సే ।
యో వ॑: శి॒వత॑మో రస॒స్తస్య॑ భాజయతే॒ హ న॑: ।
ఉ॒శ॒తీరి॑వ మా॒త॑రః ।
తస్మా॒ అరం॑గమామవో॒ యస్య॒ క్షయా॑య॒ జిన్వ॑థ ।
ఆపో॑ జ॒నయ॑థా చ నః ।
ఓం శ్రీ ______ నమః శుద్ధోదక స్నానం సమర్పయామి ।
(పుష్పంతో అమ్మవారిపై కొద్దిగా దేవుని పంచపాత్రలోని నీరు చల్లి, ఆ పుష్పాన్ని అమ్మవారు పాదాల వద్ద విడిచిపెట్టి, అమ్మవారికి స్నానం చేయించినట్లు భావన చేయండి)
స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ।
(దేవుని పంచపాత్రలోని నీరు ఉద్దరిణెతో అమ్మవారికి చూపి, వేరొక పాత్ర లో విడిచిపెట్టి, అమ్మవారు ముఖం కడుక్కుని నీరు తాగినట్లు భావన చేయండి)
వస్త్రం –
ఉపై॑తు॒ మాం దే॑వస॒ఖః కీ॒ర్తిశ్చ॒ మణి॑నా స॒హ ।
ప్రా॒దు॒ర్భూ॒తోఽస్మి॑ రాష్ట్రే॒ఽస్మిన్ కీ॒ర్తిమృ॑ద్ధిం ద॒దాతు॑ మే ॥
ఓం శ్రీ ______ నమః వస్త్రయుగ్మం సమర్పయామి ।
(అమ్మవారికి వస్త్రం సమర్పించినట్లు భావన చేస్తూ, కొద్దిగా పుష్పాక్షతలు అమ్మవారు పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
యజ్ఞోపవీతం –
క్షుత్పి॑పా॒సామ॑లాం జ్యే॒ష్ఠామ॑ల॒క్ష్మీం నా॑శయా॒మ్యహం ।
అభూ॑తి॒మస॑మృద్ధిం॒ చ సర్వాం॒ నిర్ణు॑ద మే॒ గృహా॑త్ ॥
ఓం శ్రీ ______ నమః యజ్ఞోపవీతం సమర్పయామి ।
(అమ్మవారికి యజ్ఞోపవీతం సమర్పిస్తున్నట్లు భావన చేస్తూ, కొద్దిగా అక్షతలు అమ్మవారు పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
గంధం –
గం॒ధ॒ద్వా॒రాం దు॑రాధ॒ర్షాం॒ ని॒త్యపు॑ష్టాం కరీ॒షిణీం᳚ ।
ఈ॒శ్వరీ॑గ్ం సర్వ॑భూతా॒నాం॒ తామి॒హోప॑హ్వయే॒ శ్రియం ॥
ఓం శ్రీ ______ నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి ।
(గంధాన్ని సమర్పిస్తున్నట్లు భావన చేస్తూ, గంధాన్ని నీటితో తడిపి, ఒక పుష్పంతో అమ్మవారి మీద చల్లి, ఆ పుష్పాన్ని అమ్మవారు సమర్పించండి)
ఓం శ్రీ ______ నమః హరిద్రా కుంకుమ కజ్జల కస్తూరీ గోరోచనాది సుగంధ ద్రవ్యాణి సమర్పయామి ।
(హరిద్రా, కుంకుమ, కజ్జల, కస్తూరీ మరియు గోరోజనాది సుగంధ ద్రవ్యాలను అమ్మవారికి సమర్పిస్తున్నట్లు భావన చేస్తూ, కొద్దిగా పుష్పాలు మరియు అక్షతలను అమ్మవారి పాదాల వద్ద సమర్పించండి)
ఆభరణం –
మన॑స॒: కామ॒మాకూ॑తిం వా॒చః స॒త్యమ॑శీమహి ।
ప॒శూ॒నాం రూ॒పమన్న॑స్య॒ మయి॒ శ్రీః శ్ర॑యతాం॒ యశ॑: ॥
ఓం శ్రీ ______ నమః సర్వాభరణాని సమర్పయామి ।
(అమ్మవారికి ఆభరణాలు సమర్పిస్తున్నట్లు భావన చేస్తూ, కొద్దిగా పుష్పాక్షతలు అమ్మవారు సమర్పించండి)
పుష్పాణి –
క॒ర్దమే॑న ప్ర॑జాభూ॒తా॒ మ॒యి॒ సంభ॑వ క॒ర్దమ ।
శ్రియం॑ వా॒సయ॑ మే కు॒లే మా॒తరం॑ పద్మ॒మాలి॑నీం ॥ 11 ॥
ఓం శ్రీ ______ నమః నానావిధ పరిమల పత్ర పుష్పాణి సమర్పయామి ।
(కొద్దిగా పుష్పాలు అమ్మవారు పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
ధూపం –
ఆప॑: సృ॒జంతు॑ స్ని॒గ్ధా॒ని॒ చి॒క్లీ॒త వ॑స మే॒ గృహే ।
ని చ॑ దే॒వీం మా॒తరం॒ శ్రియం॑ వా॒సయ॑ మే కు॒లే ॥
ఓం శ్రీ ______ నమః ధూపం సమర్పయామి ।
(గంటానాధం చేస్తూ అమ్మవారికి వెలిగించిన అగరబత్తి చూపించండి)
దీపం-
ఆ॒ర్ద్రాం పు॒ష్కరి॑ణీం పు॒ష్టిం॒ పిం॒గ॒లాం ప॑ద్మమా॒లినీం।
చం॒ద్రాం హి॒రణ్మ॑యీం ల॒క్ష్మీం జాత॑వేదో మ॒ ఆవ॑హ ॥
ఓం శ్రీ ______ నమః దీపం సమర్పయామి ।
(గంటానాధం చేస్తూ అమ్మవారికి వెలిగించిన దీపాన్ని చూపించండి)
నైవేద్యం –
ఆ॒ర్ద్రాం య॒: కరి॑ణీం య॒ష్టిం॒ సు॒వ॒ర్ణాం హే॑మమా॒లినీం ।
సూ॒ర్యాం హి॒రణ్మ॑యీం ల॒క్ష్మీం॒ జాత॑వేదో మ॒ ఆవహ ॥
ఓం శ్రీ ______ నమః నైవేద్యం సమర్పయామి ।
(గంటానాధం చేస్తూ, క్రింది మంత్రం చెపుతూ పుష్పంతో నీటిని నైవేద్యం చుట్టూ 3సార్లు సవ్య దిశలో చల్లాలి)
ఓం భూర్భువ॑స్సువ॑: । తత్స॑వితు॒ర్వరే᳚ణ్యం॒ । భ॒ర్గో॑ దే॒వస్య॑ ధీ॒మహి ।
ధియో॒ యోన॑: ప్రచో॒దయా᳚త్ ॥
సత్యం త్వా ఋతేన పరిషించామి (పుష్పంతో నైవేద్యంపై నీటిని చల్లండి)
(సాయంకాలే) – ఋతం త్వా సత్యేన పరిషించామి (పుష్పంతో నైవేద్యంపై నీటిని చల్లండి)
అమృతమస్తు । అ॒మృ॒తో॒ప॒స్తర॑ణమసి । (ఆ పుష్పాన్ని అమ్మవారు పాదాల వద్ద విడిచిపెట్టండి)
ఓం ప్రా॒ణాయ॒ స్వాహా᳚ । (అమ్మవారికి నైవేద్యం చూపించండి)
ఓం అ॒పా॒నాయ॒ స్వాహా᳚ । (అమ్మవారికి నైవేద్యం చూపించండి)
ఓం వ్యా॒నాయ॒ స్వాహా᳚ । (అమ్మవారికి నైవేద్యం చూపించండి)
ఓం ఉ॒దా॒నాయ॒ స్వాహా᳚ । (అమ్మవారికి నైవేద్యం చూపించండి)
ఓం స॒మా॒నాయ॒ స్వాహా᳚ । (అమ్మవారికి నైవేద్యం చూపించండి)
(క్రింది మంత్రాలు చెపుతూ పుష్పంతో నీటిని దేవి పైన 5 సార్లు చల్లండి)
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి ।
అ॒మృ॒తా॒పి॒ధా॒నమ॑సి ।
ఉత్తరాపోశనం సమర్పయామి ।
హస్తౌ ప్రక్షాలయామి ।
పాదౌ ప్రక్షాలయామి ।
శుద్ధాచమనీయం సమర్పయామి ।
తాంబూలం –
తాం మ॒ ఆవ॑హ॒ జాత॑వేదో ల॒క్ష్మీమన॑పగా॒మినీం᳚ ।
యస్యాం॒ హి॑రణ్యం॒ ప్రభూ॑తం॒ గావో॑ దా॒స్యోఽశ్వా᳚న్విం॒దేయం॒ పురు॑షాన॒హం ॥
ఓం శ్రీ ______ నమః తాంబూలం సమర్పయామి ।
(అమ్మవారికి తాంబూలం సమర్పిస్తున్నట్లు భావన చేస్తూ, కొద్దిగా పుష్పాక్షతలు అమ్మవారు పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
నీరాజనం –
యః శుచి॒: ప్రయ॑తో భూ॒త్వా జు॒హుయా᳚దాజ్య॒ మన్వ॑హం ।
శ్రియ॑: పం॒చద॑శర్చం॒ చ శ్రీ॒కామ॑: సత॒తం జ॑పేత్ ॥
ఓం శ్రీ ______ నమః కర్పూర నీరాజనం సమర్పయామి ।
నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి । నమస్కరోమి ।
(గంటానాధం చేస్తూ అమ్మవారికి కర్పూర హారతి ఇవ్వండి)
మంత్రపుష్పం –
ఓం శ్రీ ______ నమః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి ।
(కొద్దిగా పుష్పాక్షతలు అమ్మవారు పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ –
యానికాని చ పాపాని జన్మాంతరకృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ।
పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవ ।
త్రాహిమాం కృపయా దేవీ శరణాగతవత్సలే ।
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ ।
తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష సురేశ్వరీ ।
ఓం శ్రీ ______ నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ।
(అక్షతలు, పుష్పం తీసుకొని, ఆత్మ ప్రదక్షిణాన్ని మూడు సార్లు చేసి, అమ్మవారు పాదాల వద్ద విడిచి పెట్టండి)
సాష్టాంగ నమస్కారం –
ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా ।
పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే ॥
ఓం శ్రీ ______ నమః సాష్టాంగ నమస్కారాం సమర్పయామి ।
(పురుషులు సాష్టాంగ, మహిళలు పంచాంగ నమస్కారం చేయండి)
సర్వోపచారాః –
ఓం శ్రీ ______ నమః ఛత్రం ఆచ్ఛాదయామి ।
ఓం శ్రీ ______ నమః చామరైర్వీజయామి ।
ఓం శ్రీ ______ నమః నృత్యం దర్శయామి ।
ఓం శ్రీ ______ నమః గీతం శ్రావయామి ।
ఓం శ్రీ ______ నమః ఆందోలికాన్నారోహయామి ।
ఓం శ్రీ ______ నమః అశ్వానారోహయామి ।
ఓం శ్రీ ______ నమః గజానారోహయామి ।
సమస్త రాజ్ఞీయోపచారాన్ దేవ్యోపచారాన్ సమర్పయామి ।
క్షమా ప్రార్థనా –
అపరాధ సహస్రాణి క్రియంతేఽహర్నిశం మయా ।
దాసోఽయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వరీ ।
ఆవాహనం న జానామి న జానామి విసర్జనం ।
పూజావిధిం న జానామి క్షమస్వ పరమేశ్వరీ ।
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరీ ।
యత్పూజితం మయా దేవీ పరిపూర్ణం తదస్తు తే ।
(పుష్పాక్షతలు, ఒక చుక్క నీరు కుడి చేతిలోకి తీసుకొని పై శ్లోకం చదివి, అమ్మవారు పాదాల వద్ద విడిచిపెట్టండి)
అనయా శ్రీసూక్త విధాన పూర్వక ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవతీ సర్వాత్మికా శ్రీ ______ సుప్రీతా సుప్రసన్నా వరదా భవంతు ॥
(కొద్దిగా పుష్పాక్షతలు అమ్మవారు పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
తీర్థప్రసాద గ్రహణం –
అకాలమృత్యహరణం సర్వవ్యాధినివారణం ॥
సమస్తపాపక్షయకరం శ్రీ ______ పాదోదకం పావనం శుభం ॥
(కుడి చేతిలో నీరు పోసుకొని, పై శ్లోకం చదివి మూడు సార్లు తీర్థం తాగండి)
శ్రీ ______ నమః ప్రసాదం శీరసా గృహ్ణామి ।
(అమ్మవారు పాదాల నుండి ఒక పుష్పాన్ని తీసుకొని మీ రెండు కళ్లకు తాకించండి)
ఓం శాంతిః శాంతిః శాంతిః ।

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits