Haindavam Logo - Lord Ganesha

హైందవం

📍
Font Size:

కామాసికాష్టకం

శ్రుతీనాముత్తరం భాగం వేగవత్యాశ్చ దక్షిణం కామాదధివసన్ జీయాత్ కశ్చిదద్భుత కేసరీ 1 తపనేంద్వగ్నినయనః తాపానపచినోతు నః తాపనీయరహస్యానాం సారః కామాసికా హరిః 2 ఆకంఠమాదిపురుషం కంఠీరవముపరి కుంఠితారాతిం వేగోపకంఠసంగాత్ విముక్తవైకుంఠబహుమతిముపాసే 3 బంధుమఖిలస్య జంతోః బంధురపర్యంకబంధరమణీయం విషమవిలోచనమీడే వేగవతీపులినకేలినరసింహం 4 స్వస్థానేషు మరుద్గణాన్ నియమయన్ స్వాధీనసర్వేంద్రియః పర్యంకస్థిరధారణా ప్రకటితప్రత్యఙ్ముఖావస్థితిః ప్రాయేణ ప్రణిపేదుషః ప్రభురసౌ యోగం నిజం శిక్షయన్ కామానాతనుతాదశేషజగతాం కామాసికా కేసరీ 5 వికస్వరనఖస్వరుక్షతహిరణ్యవక్షఃస్థలీ- -నిరర్గలవినిర్గలద్రుధిరసింధుసంధ్యాయితాః అవంతు మదనాసికామనుజపంచవక్త్రస్య మాం అహంప్రథమికామిథః ప్రకటితాహవా బాహవః 6 సటాపటలభీషణే సరభసాట్టహాసోద్భటే స్ఫురత్ క్రుధిపరిస్ఫుట భ్రుకుటికేఽపి వక్త్రే కృతే కృపాకపటకేసరిన్ దనుజడింభదత్తస్తనా సరోజసదృశా దృశా వ్యతివిషజ్య తే వ్యజ్యతే 7 త్వయి రక్షతి రక్షకైః కిమన్యై- -స్త్వయి చారక్షతి రక్షకైః కిమన్యైః ఇతి నిశ్చితధీః శ్రయామి నిత్యం నృహరే వేగవతీతటాశ్రయం త్వాం 8 ఇత్థం స్తుతః సకృదిహాష్టభిరేష పద్యైః శ్రీవేంకటేశరచితైస్త్రిదశేంద్రవంద్యః దుర్దాంతఘోరదురితద్విరదేంద్రభేదీ కామాసికానరహరిర్వితనోతు కామాన్ 9 ఇతి శ్రీవేదాంతదేశికకృతం కామాసికాష్టకం

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits