శ్రీకాలీ బగలాముఖీ చ లలితా ధూమావతీ భైరవీ
మాతంగీ భువనేశ్వరీ చ కమలా శ్రీర్వజ్రవైరోచనీ ।
తారా పూర్వమహాపదేన కథితా విద్యా స్వయం శంభునా
లీలారూపమయీ చ దేశదశధా బాలా తు మాం పాతు సా ॥ 1 ॥
శ్యామాం శ్యామఘనావభాసరుచిరాం నీలాలకాలంకృతాం
బింబోష్ఠీం బలిశత్రువందితపదాం బాలార్కకోటిప్రభాం ।
త్రాసత్రాసకృపాణముండదధతీం భక్తాయ దానోద్యతాం
వందే సంకటనాశినీం భగవతీం బాలాం స్వయం కాలికాం ॥ 2 ॥
బ్రహ్మాస్త్రాం సుముఖీం బకారవిభవాం బాలాం బలాకీనిభాం
హస్తన్యస్తసమస్తవైరిరసనామన్యే దధానాం గదాం ।
పీతాం భూషణగంధమాల్యరుచిరాం పీతాంబరాంగాం వరాం
వందే సంకటనాశినీం భగవతీం బాలాం బగలాముఖీం ॥ 3 ॥
బాలార్కద్యుతిభస్కరాం త్రినయనాం మందస్మితాం సన్ముఖీం
వామే పాశధనుర్ధరాం సువిభవాం బాణం తథా దక్షిణే ।
పారావారవిహారిణీం పరమయీం పద్మాసనే సంస్థితాం
వందే సంకటనాశినీం భగవతీం బాలాం స్వయం షోడశీం ॥ 4 ॥
దీర్ఘాం దీర్ఘకుచాముదగ్రదశనాం దుష్టచ్ఛిదాం దేవతాం
క్రవ్యాదాం కుటిలేక్షణాం చ కుటిలాం కాకధ్వజాం క్షుత్కృశాం ।
దేవీం శూర్పకరాం మలీనవసనాం తాం పిప్పలాదార్చితాం ।
బాలాం సంకటనాశినీం భగవతీం ధ్యాయామి ధూమావతీం ॥ 5 ॥
ఉద్యత్కోటిదివాకరప్రతిభటాం బాలార్కభాకర్పటాం
మాలాపుస్తకపాశమంకుశవరాన్ దైత్యేంద్రముండస్రజాం ।
పీనోత్తుంగపయోధరాం త్రినయనాం బ్రహ్మాదిభిః సంస్తుతాం
బాలాం సంకటనాశినీం భగవతీం శ్రీభైరవీం ధీమహి ॥ 6 ॥
వీణావాదనతత్పరాం త్రినయనాం మందస్మితాం సన్ముఖీం
వామే పాశధనుర్ధరాం తు నికరే బాణం తథా దక్షిణే ।
పారావారవిహారిణీం పరమయీం బ్రహ్మాసనే సంస్థితాం
వందే సంకటనాశినీం భగవతీం మాతంగినీం బాలికాం ॥ 7 ॥
ఉద్యత్సూర్యనిభాం చ ఇందుముకుటామిందీవరే సంస్థితాం
హస్తే చారువరాభయం చ దధతీం పాశం తథా చాంకుశం ।
చిత్రాలంకృతమస్తకాం త్రినయనాం బ్రహ్మాదిభిః సేవితాం
వందే సంకటనాశినీం చ భువనేశీమాదిబాలాం భజే ॥ 8 ॥
దేవీం కాంచనసన్నిభాం త్రినయనాం ఫుల్లారవిందస్థితాం
బిభ్రాణాం వరమబ్జయుగ్మమభయం హస్తైః కిరీటోజ్జ్వలాం ।
ప్రాలేయాచలసన్నిభైశ్చ కరిభిరాసించ్యమానాం సదా
బాలాం సంకటనాశినీం భగవతీం లక్ష్మీం భజే చేందిరాం ॥ 9 ॥
సంఛిన్నం స్వశిరో వికీర్ణకుటిలం వామే కరే బిభ్రతీం
తృప్తాస్యాం స్వశరీరజైశ్చ రుధిరైః సంతర్పయంతీం సఖీం ।
సద్భక్తాయ వరప్రదాననిరతాం ప్రేతాసనాధ్యాసినీం
బాలాం సంకటనాశినీం భగవతీం శ్రీఛిన్నమస్తాం భజే ॥ 10 ॥
ఉగ్రామేకజటామనంతసుఖదాం దూర్వాదలాభామజాం
కర్త్రీఖడ్గకపాలనీలకమలాన్ హస్తైర్వహంతీం శివాం ।
కంఠే ముండస్రజాం కరాలవదనాం కంజాసనే సంస్థితాం
వందే సంకటనాశినీం భగవతీం బాలాం స్వయం తారిణీం ॥ 11 ॥
ముఖే శ్రీ మాతంగీ తదను కిల తారా చ నయనే
తదంతంగా కాలీ భృకుటిసదనే భైరవి పరా ।
కటౌ ఛిన్నా ధూమావతీ జయ కుచే శ్రీకమలజా
పదాంశే బ్రహ్మాస్త్రా జయతి కిల బాలా దశమయీ ॥ 12 ॥
విరాజన్మందారద్రుమకుసుమహారస్తనతటీ
పరిత్రాసత్రాణ స్ఫటికగుటికా పుస్తకవరా ।
గలే రేఖాస్తిస్రో గమకగతిగీతైకనిపుణా
సదా పీతా హాలా జయతి కిల బాలా దశమయీ ॥ 13 ॥
ఇతి శ్రీమేరుతంత్రే శ్రీ దశవిద్యామయీ బాలా స్తోత్రం ।