శ్రీ గణేశాయ నమః ।
శ్రీ గురుభ్యో నమః ।
హరిః ఓం ।
శుచిః –
(ఉద్ధరిణితో పంచపాత్రలోని నీరు తీసుకోండి)
అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోఽపి వా । (బొటనవేలితో ఉద్ధరిణిలోని నీరు తల మీద చల్లుకోండి)
యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరః శుచిః ॥ (బొటనవేలితో ఉద్ధరిణిలోని నీరు తల మీద చల్లుకోండి)
పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః ॥ (బొటనవేలితో ఉద్ధరిణిలోని నీరు తల మీద చల్లుకోండి)
ప్రార్థనా –
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ।
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ॥
అగజానన పద్మార్కం గజాననమహర్నిశం ।
అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే ॥
యః శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగలా ।
తయోః సంస్మరణాన్నిత్యం సర్వదా జయ మంగలం ॥
తదేవ లగ్నం సుదినం తదేవ
తారాబలం చంద్రబలం తదేవ ।
విద్యాబలం దైవబలం తదేవ
లక్ష్మీపతే తేఽఙ్ఘ్రియుగం స్మరామి ॥
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః ।
గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః ॥
లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ।
ఏషామిందీవరశ్యామో హృదయస్థో జనార్దనః ॥
సర్వమంగల మాంగల్యే శివే సర్వార్థసాధికే ।
శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోఽస్తు తే ॥
శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః ।
ఉమామహేశ్వరాభ్యాం నమః ।
వాణీహిరణ్యగర్భాభ్యాం నమః ।
శచీపురందరాభ్యాం నమః ।
అరుంధతీవసిష్ఠాభ్యాం నమః ।
శ్రీసీతారామాభ్యాం నమః ।
మాతాపితృభ్యో నమః ।
సర్వేభ్యో మహాజనేభ్యో నమః ।
ఓం కేశవాయ స్వాహా ।
ఓం నారాయణాయ స్వాహా ।
ఓం మాధవాయ స్వాహా ।
ఓం గోవిందాయ నమః ।
ఓం విష్ణవే నమః ।
ఓం మధుసూదనాయ నమః ।
ఓం త్రివిక్రమాయ నమః ।
ఓం వామనాయ నమః ।
ఓం శ్రీధరాయ నమః ।
ఓం హృషీకేశాయ నమః ।
ఓం పద్మనాభాయ నమః ।
ఓం దామోదరాయ నమః ।
ఓం సంకర్షణాయ నమః ।
ఓం వాసుదేవాయ నమః ।
ఓం ప్రద్యుమ్నాయ నమః ।
ఓం అనిరుద్ధాయ నమః ।
ఓం పురుషోత్తమాయ నమః ।
ఓం అధోక్షజాయ నమః ।
ఓం నారసింహాయ నమః ।
ఓం అచ్యుతాయ నమః ।
ఓం జనార్దనాయ నమః ।
ఓం ఉపేంద్రాయ నమః ।
ఓం హరయే నమః ।
ఓం శ్రీకృష్ణాయ నమః ।
దీపారాధనం –
దీపస్త్వం బ్రహ్మరూపోఽసి జ్యోతిషాం ప్రభురవ్యయః ।
సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్కామాంశ్చ దేహి మే ॥
శుభం కరోతి కల్యాణమారోగ్యం ధనసంపదా ।
శత్రుబుద్ధివినాశాయ దీపజ్యోతిర్నమోఽస్తుతే ॥
(దీపపు కుందులకు పసుపు, కుంకుమతో మూడు బొట్లు పెట్టి, పై శ్లోకం
చదువుతూ అగరబత్తీతో దీపాలను వెలిగించి,
కొద్దిగా పుష్పాక్షతలు దీపాల వద్ద వేసి నమస్కారం చేసుకోండి)
భూతోచ్చాటనం –
ఉత్తిష్ఠంతు భూతపిశాచాః య ఏతే భూమి భారకాః ।
ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ॥
అపసర్పంతు తే భూతా యే భూతా భూమిసంస్థితాః ।
యే భూతా విఘ్నకర్తారస్తే గచ్ఛంతు శివాఽజ్ఞయా ॥
(కుడి చేతిలో అక్షతలు తీసుకొని పై శ్లోకం చదువుతూ వాసన చూసి మీ ఎడమ వైపు నుండి వెనకకు వేయండి)
ప్రాణాయామం –
ఓం భూః ఓం భువ॑: ఓగ్ం సువ॑: ఓం మహ॑: ఓం జన॑: ఓం తప॑: ఓగ్ం సత్యం ।
ఓం తత్స॑వితు॒ర్వరే᳚ణ్యం॒ భ॒ర్గో॑ దే॒వస్య॑ ధీ॒మహి ।
ధియో॒ యో న॑: ప్రచో॒దయా᳚త్ ।
ఓమాపో॒ జ్యోతీ॒ రసో॒ఽమృతం॒ బ్రహ్మ॒ భూర్భువ॒స్సువ॒రోం ॥
(3సార్లు ప్రాణాయామము చేయవలెను)
సంకల్పం –
(పుష్పాక్షతలు, ఒక చుక్క నీరు కుడి చేతిలోకి తీసుకొని కింద ఉన్న సంకల్పం చెప్పండి)
మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీపరమేశ్వరముద్దిశ్య శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీమహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ___ ప్రదేశే ___, ___ నద్యోః మధ్యప్రదేశే లక్ష్మీనివాసగృహే సమస్త దేవతా బ్రాహ్మణ ఆచార్య హరి హర గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమనే వ్యావహరిక చాంద్రమానేన శ్రీ ____ (*1) నామ సంవత్సరే ___ అయనే (*2) ___ ఋతౌ (*3) ___ మాసే(*4) ___ పక్షే (*5) ___ తిథౌ (*6) ___ వాసరే (*7) ___ నక్షత్రే (*8) ___ యోగే (*9) ___ కరణ (*10)
ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ ___ గోత్రోద్భవస్య ___ నామధేయస్య (మమ ధర్మపత్నీ శ్రీమతః ___ గోత్రస్య ___ నామధేయః సమేతస్య) మమ/అస్మాకం సహకుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం ధన కనక వస్తు వాహన సమృద్ధ్యర్థం సర్వాభీష్ట సిద్ధ్యర్థం శ్రీ _____ ఉద్దిశ్య శ్రీ _____ ప్రీత్యర్థం సంభవద్భిః ద్రవ్యైః సంభవద్భిః ఉపచారైశ్చ సంభవతా నియమేన సంభవితా ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే ॥
(నిర్విఘ్న పూజా పరిసమాప్త్యర్థం ఆదౌ శ్రీమహాగణపతి పూజాం కరిష్యే)
(అని చదివి పుష్పాక్షతలు పళ్ళెములో విడిచి, చేతిని శుభ్రం చేసుకోండి)
తదంగ కలశారాధనం కరిష్యే ॥
(మనము ఆచమనము చేసినటువంటి పంచపాత్రలోని నీళ్ళు దేవుని పూజకు వినియోగించరాదు.
పూజకు విడిగా ఒక పంచపాత్రని గాని, చెంబుని గాని తీసుకుని దానిలో శుద్ధ జలమును పోసి
ఆ చెంబునకు కలశారాధన చేసి ఆ నీళ్ళు మాత్రమే దేవుని పూజకు ఉపయోగించవలెను)
(కుడి చేతితో కలశంను మూసి పెట్టి, ఈ క్రింది మంత్రాలను చెప్పవలెను)
కలశారాధనం –
కలశే గంధ పుష్పాక్షతైరభ్యర్చ్య । (దేవుని పంచపాత్రమునకు గంధం, కుంకుమ బొట్లు పెట్టి, కలశంలో పుష్పాక్షతలు వేయండి)
కలశే ఉదకం పూరయిత్వా । (దేవుని పంచపాత్రలో నీరు పోయండి)
కలశస్యోపరి హస్తం నిధాయ । (కుడి చేతితో పంచపాత్రని మూసి పెట్టి, ఈ క్రింది శ్లోకం చెప్పవలెను)
కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రః సమాశ్రితః ।
మూలే త్వస్య స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణాః స్మృతా ॥
కుక్షౌ తు సాగరాః సర్వే సప్తద్వీపా వసుంధరా ।
ఋగ్వేదోఽథ యజుర్వేదో సామవేదో హ్యథర్వణః ॥
అంగైశ్చ సహితాః సర్వే కలశాంబు సమాశ్రితాః ।
గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ ।
నర్మదే సింధు కావేరీ జలేఽస్మిన్ సన్నిధిం కురు ॥
కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీ ।
భాగీరథీతి విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః ॥
ఆయాంతు శ్రీ ____ పూజార్థం మమ దురితక్షయకారకాః ।
ఓం ఓం ఓం కలశోదకేన పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య । (దేవుని పంచపాత్రలోని నీరు పూజా ద్రవ్యాలపై చల్లండి)
దేవం సంప్రోక్ష్య, (దేవునిపై చల్లండి)
ఆత్మానం చ సంప్రోక్ష్య (మీ పై చల్లుకోండి) ॥
శంఖపూజా –
(మీ పూజా మందిరంలో శంఖం ఉన్నట్లయితే శంఖ పూజ చేయండి లేకుంటే గంటాపూజ చేయండి)
కలశోదకేన శంఖం పూరయిత్వా ॥ (దేవుని పంచపాత్రలోని నీరు శంఖంలో లో నింపండి)
శంఖే గంధకుంకుమపుష్పతులసీపత్రైరలంకృత్య ॥ (శంఖానికి గంధం, కుంకుమతో బొట్టు పెట్టి పుష్పం, తులసి పత్రంతో అలంకరించండి)
శంఖం చంద్రార్క దైవతం మధ్యే వరుణ దేవతాం ।
పృష్ఠే ప్రజాపతిం వింద్యాదగ్రే గంగా సరస్వతీం ॥
త్రైలోక్యేయాని తీర్థాని వాసుదేవస్యదద్రయా ।
శంఖే తిష్ఠంతు విప్రేంద్రా తస్మాత్ శంఖం ప్రపూజయేత్ ॥
త్వం పురా సాగరోత్పన్నో విష్ణునా విధృతః కరే ।
పూజితః సర్వదేవైశ్చ పాంచజన్య నమోఽస్తు తే ॥
గర్భాదేవారినారీణాం విశీర్యంతే సహస్రధా ।
నవనాదేనపాతాలే పాంచజన్య నమోఽస్తు తే ॥
ఓం శంఖాయ నమః ।
ఓం ధవలాయ నమః ।
ఓం పాంచజన్యాయ నమః ।
ఓం శంఖదేవతాభ్యో నమః ।
సకలపూజార్థే అక్షతాన్ సమర్పయామి ॥
(కొద్దిగా పుష్పాక్షతలు శంఖం వద్ద వేసి నమస్కారం చేసుకోండి)
ఘంటపూజా –
ఓం జయధ్వని మంత్రమాతః స్వాహా ।
ఘంటదేవతాభ్యో నమః ।
సకలోపచార పూజార్థే అక్షతాన్ సమర్పయామి ।
(కొద్దిగా పుష్పాక్షతలు ఘంట వద్ద వేసి నమస్కారం చేసుకోండి)
ఘంటానాదం –
ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రాక్షసాం ।
ఘంటారవం కరోమ్యాదౌ దేవతాహ్వాన లాంఛనం ॥
ఇతి ఘంటానాదం కృత్వా ॥
(పై శ్లోకం చదివి గంట కొట్టండి)