Haindavam Logo - Lord Ganesha
Haindavam
📍
Font Size:

వారాహీ నిగ్రహాష్టకం

దేవి క్రోడముఖి త్వదంఘ్రికమలద్వంద్వానురక్తాత్మనే
మహ్యం ద్రుహ్యతి యో మహేశి మనసా కాయేన వాచా నరః ।
తస్యాశు త్వదయోగ్రనిష్ఠురహలాఘాతప్రభూతవ్యథా-
-పర్యస్యన్మనసో భవంతు వపుషః ప్రాణాః ప్రయాణోన్ముఖాః ॥ 1 ॥
దేవి త్వత్పదపద్మభక్తివిభవప్రక్షీణదుష్కర్మణి
ప్రాదుర్భూతనృశంసభావమలినాం వృత్తిం విధత్తే మయి ।
యో దేహీ భువనే తదీయహృదయాన్నిర్గత్వరైర్లోహితైః
సద్యః పూరయసే కరాబ్జచషకం వాంఛాఫలైర్మామపి ॥ 2 ॥
చండోత్తుండవిదీర్ణదంష్ట్రహృదయప్రోద్భిన్నరక్తచ్ఛటా
హాలాపానమదాట్టహాసనినదాటోపప్రతాపోత్కటం ।
మాతర్మత్పరిపంథినామపహృతైః ప్రాణైస్త్వదంఘ్రిద్వయం
ధ్యానోద్దామరవైర్భవోదయవశాత్సంతర్పయామి క్షణాత్ ॥ 3 ॥
శ్యామాం తామరసాననాంఘ్రినయనాం సోమార్ధచూడాం జగ-
-త్త్రాణవ్యగ్రహలాయుధాగ్రముసలాం సంత్రాసముద్రావతీం ।
యే త్వాం రక్తకపాలినీం హరవరారోహే వరాహాననాం
భావైః సందధతే కథం క్షణమపి ప్రాణంతి తేషాం ద్విషః ॥ 4 ॥
విశ్వాధీశ్వరవల్లభే విజయసే యా త్వం నియంత్ర్యాత్మికా
భూతాంతా పురుషాయుషావధికరీ పాకప్రదాకర్మణాం ।
త్వాం యాచే భవతీం కిమప్యవితథం యో మద్విరోధీజన-
-స్తస్యాయుర్మమ వాంఛితావధిభవేన్మాతస్తవైవాజ్ఞయా ॥ 5 ॥
మాతః సమ్యగుపాసితుం జడమతిస్త్వాం నైవ శక్నోమ్యహం
యద్యప్యన్వితదైశికాంఘ్రికమలానుక్రోశపాత్రస్య మే ।
జంతుః కశ్చన చింతయత్యకుశలం యస్తస్య తద్వైశసం
భూయాద్దేవి విరోధినో మమ చ తే శ్రేయః పదాసంగినః ॥ 6 ॥
వారాహీ వ్యథమానమానసగలత్సౌఖ్యం తదాశాబలిం
సీదంతం యమపాకృతాధ్యవసితం ప్రాప్తాఖిలోత్పాదితం ।
క్రందద్బంధుజనైః కలంకితతులం కంఠవ్రణోద్యత్కృమి
పశ్యామి ప్రతిపక్షమాశు పతితం భ్రాంతం లుఠంతం ముహుః ॥ 7 ॥
వారాహీ త్వమశేషజంతుషు పునః ప్రాణాత్మికా స్పందసే
శక్తివ్యాప్తచరాచరా ఖలు యతస్త్వామేతదభ్యర్థయే ।
త్వత్పాదాంబుజసంగినో మమ సకృత్పాపం చికీర్షంతి యే
తేషాం మా కురు శంకరప్రియతమే దేహాంతరావస్థితిం ॥ 8 ॥
ఇతి శ్రీవారాహీనిగ్రహాష్టకం ।

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits