Haindavam Logo - Lord Ganesha

హైందవం

📍
Font Size:

దేవీ అశ్వధాటీ

(కాలిదాస కృతం) చేటీ భవన్నిఖిల ఖేటీ కదంబవన వాటీషు నాకి పటలీ కోటీర చారుతర కోటీ మణీకిరణ కోటీ కరంబిత పదా పాటీరగంధి కుచశాటీ కవిత్వ పరిపాటీమగాధిప సుతా ఘోటీఖురాదధిక ధాటీముదార ముఖ వీటీరసేన తనుతాం 1 శా ద్వైపాయన ప్రభృతి శాపాయుధ త్రిదివ సోపాన ధూలి చరణా పాపాపహ స్వమను జాపానులీన జన తాపాపనోద నిపుణా నీపాలయా సురభి ధూపాలకా దురితకూపాదుదన్చయతుమాం రూపాధికా శిఖరి భూపాల వంశమణి దీపాయితా భగవతీ 2 శా యాలీభి రాత్మతనుతాలీనకృత్ప్రియక పాలీషు ఖేలతి భవా వ్యాలీ నకుల్యసిత చూలీ భరా చరణ ధూలీ లసన్మణిగణా యాలీ భృతి శ్రవసి తాలీ దలం వహతి యాలీక శోభి తిలకా సాలీ కరోతు మమ కాలీ మనః స్వపద నాలీక సేవన విధౌ 3 శా బాలామృతాంశు నిభ ఫాలామనా గరుణ చేలా నితంబ ఫలకే కోలాహల క్షపిత కాలామరాకుశల కీలాల శోషణ రవిః స్థూలాకుచే జలద నీలాకచే కలిత వీలా కదంబ విపినే శూలాయుధ ప్రణతి శీలా దధాతు హృది శైలాధి రాజ తనయా 4 శా కంబావతీవ సవిడంబా గలేన నవ తుంబాభ వీణ సవిధా బింబాధరా వినత శంబాయుధాది నికురుంబా కదంబ విపినే అంబా కురంగ మదజంబాల రోచి రిహ లంబాలకా దిశతు మే శం బాహులేయ శశి బింబాభి రామ ముఖ సంబాధితా స్తన భరా 5 శా దాసాయమాన సుమహాసా కదంబవన వాసా కుసుంభ సుమనో వాసా విపంచి కృత రాసా విధూత మధు మాసారవింద మధురా కాసార సూన తతి భాసాభిరామ తను రాసార శీత కరుణా నాసా మణి ప్రవర భాసా శివా తిమిర మాసాయే దుపరతిం 6 శా న్యంకాకరే వపుషి కంకాల రక్త పుషి కంకాది పక్షి విషయే త్వం కామనా మయసి కిం కారణం హృదయ పంకారి మే హి గిరిజాం శంకాశిలా నిశిత టంకాయమాన పద సంకాశమాన సుమనో ఝంకారి భృంగతతి మంకానుపేత శశి సంకాశ వక్త్ర కమలాం 7 శా జంభారి కుంభి పృథు కుంభాపహాసి కుచ సంభావ్య హార లతికా రంభా కరీంద్ర కర దంభాపహోరుగతి డింభానురంజిత పదా శంభా ఉదార పరిరంభాంకురత్ పులక దంభానురాగ పిశునా శం భాసురాభరణ గుంభా సదా దిశతు శుంభాసుర ప్రహరణా 8 శా దాక్షాయణీ దనుజ శిక్షా విధౌ వికృత దీక్షా మనోహర గుణా భిక్షాశినో నటన వీక్షా వినోద ముఖి దక్షాధ్వర ప్రహరణా వీక్షాం విధేహి మయి దక్షా స్వకీయ జన పక్షా విపక్ష విముఖీ యక్షేశ సేవిత నిరాక్షేప శక్తి జయ లక్షావధాన కలనా 9 శా వందారు లోక వర సంధాయినీ విమల కుందావదాత రదనా బృందారు బృంద మణి బృందారవింద మకరందాభిషిక్త చరణా మందానిలా కలిత మందార దామభిరమందాభిరామ మకుటా మందాకినీ జవన భిందాన వాచమరవిందాననా దిశతు మే 10 శా యత్రాశయో లగతి తత్రాగజా భవతు కుత్రాపి నిస్తుల శుకా సుత్రామ కాల ముఖ సత్రాసకప్రకర సుత్రాణ కారి చరణా ఛత్రానిలాతిరయ పత్త్రాభిభిరామ గుణ మిత్రామరీ సమ వధూః కు త్రాసహీన మణి చిత్రాకృతి స్ఫురిత పుత్రాది దాన నిపుణా 11 శా కూలాతిగామి భయ తూలావలిజ్వలనకీలా నిజస్తుతి విధా కోలాహలక్షపిత కాలామరీ కుశల కీలాల పోషణ రతా స్థూలాకుచే జలద నీలాకచే కలిత లీలా కదంబ విపినే శూలాయుధ ప్రణతి శీలా విభాతు హృది శైలాధిరాజ తనయా 12 శా ఇంధాన కీర మణిబంధా భవే హృదయబంధా వతీవ రసికా సంధావతీ భువన సంధారణే ప్యమృత సింధావుదార నిలయా గంధానుభావ ముహురంధాలి పీత కచ బంధా సమర్పయతు మే శం ధామ భానుమపి రుంధాన మాశు పద సంధాన మప్యనుగతా 13 శా

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits