వేదపాదనుతతోషిత దత్త ।
శ్రావితశాస్త్రవిరోధక దత్త ।
సమ్మతవేదశిరోమత దత్త ।
సంపృష్టేశ్వరసత్క్రియ దత్త ।
కర్మేట్తత్త్వజ్ఞాపక దత్త ।
స్మృతితః సన్నిధికారక దత్త ।
సహ్యమహీధరవాసిన్ దత్త ।
కాశీగంగాస్నాయిన్ దత్త ।
కమలాపత్తనభిక్షుక దత్త ।
శాండిల్యానుగ్రాహక దత్త ।
యోగాష్టాంగజ్ఞేశ్వర దత్త ।
యోగఫలాభిజ్ఞేశ్వర దత్త ॥ 1 ॥
శిక్షితపాతంజలప్రద దత్త ।
అర్పితసాయుజ్యామృత దత్త ।
విక్షేపావృతివర్జిత దత్త ।
అసంగ అక్రియ అవికృత దత్త ।
స్వాశ్రయశక్త్యుద్బోధక దత్త ।
స్వైకాంశాహితవిశ్వక దత్త ।
జీవేశ్వరతాస్వీకృత దత్త ।
వ్యష్టిసమష్ట్యంతర్గత దత్త ।
గుణతోరూపత్రయధర దత్త ।
నానాకర్మగతిప్రద దత్త ।
స్వభక్తమాయానాశక దత్త ।
అనసూయాత్ర్యాహ్లాదక దత్త ।
మత్స్యాద్యవతారాత్మక దత్త ।
ప్రహ్లాదానుగ్రాహక దత్త ।
అసురసురోరగశిక్షక దత్త ।
జ్ఞానకాండసందర్శక దత్త ॥ 2 ॥
నవవిధభక్తిపరాయణ దత్త ।
స్వమంత్రజాపకతారక దత్త ।
యోగభ్రష్టద్విజనుత దత్త ।
సతీమాహాత్మ్యప్రముదిత దత్త ।
సత్యనసూయాత్ర్యర్భక దత్త ।
కృతవీర్యానుగ్రాహక దత్త ।
జంభాఖ్యాసురఘాతక దత్త ।
దేవేంద్రాభీష్టార్పక దత్త ।
అర్జునహృద్యవరప్రద దత్త ।
మోక్షేచ్ఛ్వర్జునసంస్తుత దత్త ।
శిల్పజ్ఞోద్గతిశంసక దత్త ।
కామశాస్త్రవిజ్ఞాపక దత్త ।
సప్తగ్రహవిద్రావక దత్త ।
విష్ణుదత్తవరదాయక దత్త ।
కర్మవిపాకాఖ్యాపక దత్త ।
ఝుటింగపీడాహారక దత్త ।
భీతప్రాజ్ఞాహ్లాదక దత్త ॥ 3 ॥
శ్రవణాదివిధిద్యోతక దత్త ।
సయోగవిజ్ఞానార్పక దత్త ।
విముక్తచర్యాజల్పక దత్త ।
శక్తభక్తహితయోజక దత్త ।
భార్గవరామాహ్లాదక దత్త ।
అర్జునసాయుజ్యప్రద దత్త ।
రేణుకాభీష్టార్థప్రద దత్త ।
పాతితభూపకదంబక దత్త ॥ 4 ॥
ఋతధ్వజానుగ్రాహక దత్త ।
మదాలసానుగ్రాహక దత్త ।
అలర్కరాజ్యోత్కర్షక దత్త ।
అలర్కరాజ్యత్యాజక దత్త ।
యోగసిద్ధిసందర్శక దత్త ।
యోగసుచర్యాభాషక దత్త ।
మృత్యులక్ష్మసంజల్పక దత్త ।
అలర్కగీతోత్తమగుణ దత్త ।
విహితాలర్కనృపాశ్రయ దత్త ॥ 5 ॥
ఆయురాజవరప్రద దత్త ।
నహుషాశేషారిష్టద దత్త ।
ఆయుఃశోకద్రావక దత్త ।
ఇందుమతీహృద్ధర్షక దత్త ।
ప్రకటితనహుషసుతేజో దత్త ।
ఘాతితహుండాసురబల దత్త ।
ఆయుర్లిప్సాపూరక దత్త ।
యదురాజానుగ్రాహక దత్త ।
బహుగురుతత్త్వగ్రాహక దత్త ।
శ్రీయదువంశాహ్లాదక దత్త ।
మన్వంతరసత్కీర్తిగ దత్త ।
సప్తద్వీపక్ష్మాప్రియ దత్త ।
దినకరవంశోత్కర్షక దత్త ।
హిమకరవంశోద్ధారక దత్త ।
పూరితభక్తమనోరథ దత్త ।
ఉపాసనాకాండప్రియ దత్త ॥ 6 ॥
దేహాధ్రౌవ్యోద్బోధక దత్త ।
శరీరదోషాదర్శక దత్త ।
తనుసాఫల్యద్యోతక దత్త ।
ఋచీకతప ఆఖ్యాపక దత్త ।
భాషితసుందాసురమృత దత్త ।
జల్పితవైశ్యోత్తమగత దత్త ।
అభిహితవిట్సుతదుర్గత దత్త ।
నానాధర్మద్యోతక దత్త ।
నిషేధవిధిసందర్శక దత్త ।
వైష్ణవధర్మాదర్శక దత్త ।
సన్మాహాత్మ్యద్యోతక దత్త ।
మాఘస్నానఖ్యాపక దత్త ।
భాషితరాక్షసమోచన దత్త ।
సుకృతోత్సుకజనరోచక దత్త ॥ 7 ॥
సోమకీర్తినృపతారక దత్త ।
అధర్మసాధ్వసహారక దత్త ।
వర్ణాశ్రమవృషకారక దత్త ।
బ్రహ్మచారివృషబోధక దత్త ।
గృహస్థధర్మద్యోతక దత్త ।
శ్రాద్ధసుపద్ధతిదర్శక దత్త ।
దర్శితసత్తిథినిర్ణయ దత్త ।
కృతదుష్కర్మవినిర్ణయ దత్త ।
ప్రాయశ్చిత్తస్థాపక దత్త ।
కర్మవిపాకజ్ఞాపక దత్త ।
సత్సంసారద్యోతక దత్త ।
వనస్థతప ఆదర్శక దత్త ।
పంచప్రలయాసంగత దత్త ।
సమ్మతసన్న్యాసాశ్రమ దత్త ॥ 8 ॥