Haindavam Logo - Lord Ganesha
Haindavam
📍
Font Size:

ఆది వరాహ స్తోత్రం

ధరణ్యువాచ ।
నమస్తే దేవదేవేశ వరాహవదనాఽచ్యుత ।
క్షీరసాగరసంకాశ వజ్రశృంగ మహాభుజ ॥ 1 ॥
ఉద్ధృతాస్మి త్వయా దేవ కల్పాదౌ సాగరరాంభసః ।
సహస్రబాహునా విష్ణో ధారయామి జగంత్యహం ॥ 2 ॥
అనేకదివ్యాభరణయజ్ఞసూత్రవిరాజిత ।
అరుణారుణాంబరధర దివ్యరత్నవిభూషిత ॥ 3 ॥
ఉద్యద్భానుప్రతీకాశపాదపద్మ నమో నమః ।
బాలచంద్రాభదంష్ట్రాగ్ర మహాబలపరాక్రమ ॥ 4 ॥
దివ్యచందనలిప్తాంగ తప్తకాంచనకుండల ।
ఇంద్రనీలమణిద్యోతిహేమాంగదవిభూషిత ॥ 5 ॥
వజ్రదంష్ట్రాగ్రనిర్భిన్న హిరణ్యాక్ష మహాబల ।
పుండరీకాభితామ్రాక్ష సామస్వనమనోహర ॥ 6 ॥
శ్రుతిసీమంతభూషాత్మన్ సర్వాత్మన్ చారువిక్రమ ।
చతురాననశంభుభ్యాం వందితాఽఽయతలోచన ॥ 7 ॥
సర్వవిద్యామయాకార శబ్దాతీత నమో నమః ।
ఆనందవిగ్రహాఽనంత కాలకాల నమో నమః ॥ 8 ॥
ఇతి శ్రీస్కందపురాణే వేంకటాచలమాహాత్మ్యే భూదేవీ కృత శ్రీ ఆదివరాహ స్తోత్రం ॥

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits