సూచనలు:
3. ఆ తర్వాత, కింద ఇచ్చిన వివరణాత్మక పూజా విధానాన్ని అనుసరించండి ।
పునః సంకల్పం –
(పుష్పాక్షతలు, ఒక చుక్క నీరు కుడి చేతిలోకి తీసుకొని కింద ఉన్న సంకల్పం చదవండి)
పూర్వోక్త ఏవం గుణవిశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ రుద్ర నమక ప్రథమ అనువాక విధానేన యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే ॥
(అని చదివి పుష్పాక్షతలు పళ్ళెములో విడిచి, చేతిని శుభ్రం చేసుకోండి)
ధ్యానం –
ఆపాతాల-నభఃస్థలాంత-భువన-బ్రహ్మాండ-మావిస్ఫురత్-
జ్యోతిః స్ఫాటిక-లింగ-మౌలి-విలసత్-పూర్ణేందు-వాంతామృతైః ।
అస్తోకాప్లుత-మేక-మీశ-మనిశం రుద్రాను-వాకాంజపన్
ధ్యాయే-దీప్సిత-సిద్ధయే ధ్రువపదం-విఀప్రోఽభిషించే-చ్చివం ॥
బ్రహ్మాండ వ్యాప్తదేహా భసిత హిమరుచా భాసమానా భుజంగైః
కంఠే కాలాః కపర్దాః కలిత-శశికలా-శ్చండ కోదండ హస్తాః ।
త్ర్యక్షా రుద్రాక్షమాలాః ప్రకటితవిభవాః శాంభవా మూర్తిభేదాః
రుద్రాః శ్రీరుద్రసూక్త-ప్రకటితవిభవా నః ప్రయచ్చంతు సౌఖ్యం ॥
ఓం శ్రీ పరమేశ్వరాభ్యాం నమః ధ్యాయామి ।
(కొద్దిగా పుష్పాక్షతలు స్వామి వారి పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
ఆవాహనం –
ఓం నమో భగవతే॑ రుద్రా॒య ॥
నమ॑స్తే రుద్ర మ॒న్యవ॑ ఉ॒తోత॒ ఇష॑వే॒ నమః॑ ।
నమ॑స్తే అస్తు॒ ధన్వ॑నే బా॒హుభ్యా॑ము॒త తే॒ నమః॑ ॥
ఓం శ్రీ పరమేశ్వరాభ్యాం నమః ఆవాహయామి ।
(కొద్దిగా పుష్పాక్షతలు స్వామి వారి పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
ఆసనం –
యా త॒ ఇషుః॑ శి॒వత॑మా శి॒వం బ॒భూవ॑ తే॒ ధనుః॑ ।
శి॒వా శ॑ర॒వ్యా॑ యా తవ॒ తయా॑ నో రుద్ర మృడయ ॥
ఓం శ్రీ పరమేశ్వరాభ్యాం నమః నవరత్నఖచిత సువర్ణ సింహాసనం సమర్పయామి ।
(స్వామివారికి సింహాసనం సమర్పిస్తున్నట్లు భావన చేస్తూ, కొద్దిగా పుష్పాక్షతలు స్వామి వారి పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
పాద్యం –
యా తే॑ రుద్ర శి॒వా త॒నూరఘో॒రాఽపా॑పకాశినీ ।
తయా॑ నస్త॒నువా॒ శంత॑మయా॒ గిరి॑శంతా॒భిచా॑కశీహి ॥
ఓం శ్రీ పరమేశ్వరాభ్యాం నమః పాదయోః పాద్యం సమర్పయామి ।
(స్వామివారి పాదాలు కడిగినట్లు భావన చేస్తూ, దేవుని పంచపాత్రలోని నీరు ఉద్ధరిణితో స్వామికి చూపి, వేరొక పాత్రలో విడిచిపెట్టండి)
అర్ఘ్యం –
యామిషుం॑ గిరిశంత॒ హస్తే॒ బిభ॒ర్ష్యస్త॑వే ।
శి॒వాం గి॑రిత్ర॒ తాం కు॑రు॒ మా హిగ్ం॑సీః॒ పురు॑షం॒ జగ॑త్॥
ఓం శ్రీ పరమేశ్వరాభ్యాం నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ।
(స్వామివారి చేతులు కడిగినట్లు భావన చేస్తూ, దేవుని పంచపాత్రలోని నీరు ఉద్ధరిణితో స్వామికి చూపి, వేరొక పాత్రలో విడిచిపెట్టండి)
ఆచమనీయం –
శి॒వేన॒ వచ॑సా త్వా॒ గిరి॒శాచ్ఛా॑ వదామసి ।
యథా॑ నః॒ సర్వ॒మిజ్జగ॑దయ॒క్ష్మగ్ం సు॒మనా॒ అస॑త్ ॥
ఓం శ్రీ పరమేశ్వరాభ్యాం నమః ముఖే ఆచమనీయం సమర్పయామి ।
(దేవుని పంచపాత్రలోని నీరు ఉద్దరిణెతో స్వామికి చూపి, వేరొక పాత్ర లో విడిచిపెట్టి, స్వామివారు ముఖం కడుక్కుని నీరు తాగినట్లు భావన చేయండి)
పంచామృత స్నానం –
ఆప్యా॑యస్వ॒ సమే॑తు తే వి॒శ్వత॑స్సోమ॒ వృష్ణి॑యం ।
భవా॒ వాజ॑స్య సంగ॒థే ॥
ఓం శ్రీ పరమేశ్వరాభ్యాం నమః క్షీరేణ స్నపయామి ।
(ఆవు పాలతో అభిషేకం చేసి, నూనె లేదా నెయ్యి దీపంతో హారతి ఇవ్వండి)
(నీటితో అభిషేకం చేసి, ప్రతిమను శుభ్రం చేయండి)
ద॒ధి॒క్రావ్ణో॑ అకారిషం జి॒ష్ణోరశ్వ॑స్య వా॒జిన॑: ।
సు॒ర॒భి నో॒ ముఖా॑ కర॒త్ప్రాణ॒ ఆయూగ్ం॑షి తారిషత్ ॥
ఓం శ్రీ పరమేశ్వరాభ్యాం నమః దధ్నా స్నపయామి ।
(ఆవు పెరుగుతో అభిషేకం చేసి, నూనె లేదా నెయ్యి దీపంతో హారతి ఇవ్వండి)
(నీటితో అభిషేకం చేసి, ప్రతిమను శుభ్రం చేయండి)
శు॒క్రమ॑సి॒ జ్యోతి॑రసి॒ తేజో॑సి దే॒వోవ॑స్సవి॒తోత్పు॑నా॒తు
అచ్ఛి॑ద్రేణ ప॒విత్రే॑ణ॒ వసో॒స్సూర్య॑స్య ర॒శ్మిభి॑: ।
ఓం శ్రీ పరమేశ్వరాభ్యాం నమః ఆజ్యేన స్నపయామి ।
(ఆవు నెయ్యితో అభిషేకం చేసి, నూనె లేదా నెయ్యి దీపంతో హారతి ఇవ్వండి)
(నీటితో అభిషేకం చేసి, ప్రతిమను శుభ్రం చేయండి)
మధు॒వాతా॑ ఋతాయ॒తే మధు॑క్షరంతి॒ సింధ॑వః ।
మాధ్వీ᳚ర్నః సం॒త్వౌష॑ధీః ।
మధు॒నక్త॑ము॒తోష॑సి॒ మధు॑మ॒త్ పార్థి॑వ॒గ్ం॒రజ॑: ।
మధు॒ద్యౌర॑స్తు నః పి॒తా ।
మధు॑మాన్నో॒ వన॒స్పతి॒ర్మధు॑మాగ్ం అస్తు॒ సూర్య॑: ।
మాధ్వీ॒ర్గావో॑ భవంతు నః ।
ఓం శ్రీ పరమేశ్వరాభ్యాం నమః మధునా స్నపయామి ।
(తేనెతో అభిషేకం చేసి, నూనె లేదా నెయ్యి దీపంతో హారతి ఇవ్వండి)
(నీటితో అభిషేకం చేసి, ప్రతిమను శుభ్రం చేయండి)
స్వా॒దుః ప॑వస్వ ది॒వ్యాయ॒ జన్మ॑నే ।
స్వా॒దురింద్రా᳚య సు॒హవీ᳚తు నామ్నే ।
స్వా॒దుర్మి॒త్రాయ॒ వరు॑ణాయ వా॒యవే॒ ।
బృహ॒స్పత॑యే॒ మధు॑మాం॒ అదా᳚భ్యః ।
ఓం శ్రీ పరమేశ్వరాభ్యాం నమః శర్కరేణ స్నపయామి ।
(చక్కెరతో అభిషేకం చేసి, నూనె లేదా నెయ్యి దీపంతో హారతి ఇవ్వండి)
(నీటితో అభిషేకం చేసి, ప్రతిమను శుభ్రం చేయండి)
యాః ఫ॒లినీ॒ర్యా అ॑ఫ॒లా అ॑పు॒ష్పాయాశ్చ॑ పు॒ష్పిణీ॑: ।
బృహ॒స్పతి॑ ప్రసూతా॒స్తానో॑ మున్చం॒త్వగ్ం హ॑సః ॥
ఓం శ్రీ పరమేశ్వరాభ్యాం నమః ఫలోదకేన స్నపయామి ।
(పండ్ల రసంతో అభిషేకం చేసి, నూనె లేదా నెయ్యి దీపంతో హారతి ఇవ్వండి)
(నీటితో అభిషేకం చేసి, ప్రతిమను శుభ్రం చేయండి)
స్నానం –
అధ్య॑వోచదధివ॒క్తా ప్ర॑థ॒మో దైవ్యో॑ భి॒షక్ ।
అహీగ్॑శ్చ॒ సర్వాం᳚జం॒భయ॒న్-థ్సర్వా᳚శ్చ యాతుధా॒న్యః॑ ॥
ఆపో॒ హిష్ఠా మ॑యో॒భువ॒స్తా న॑ ఊ॒ర్జే ద॑ధాతన ।
మ॒హేరణా॑య॒ చక్ష॑సే ।
యో వ॑: శి॒వత॑మో రస॒స్తస్య॑ భాజయతే॒ హ న॑: ।
ఉ॒శ॒తీరి॑వ మా॒త॑రః ।
తస్మా॒ అరం॑గమామవో॒ యస్య॒ క్షయా॑య॒ జిన్వ॑థ ।
ఆపో॑ జ॒నయ॑థా చ నః ।
ఓం శ్రీ పరమేశ్వరాభ్యాం నమః శుద్ధోదక స్నానం సమర్పయామి ।
(పుష్పంతో స్వామి వారిపై కొద్దిగా దేవుని పంచపాత్రలోని నీరు చల్లి, ఆ పుష్పాన్ని స్వామి వారి పాదాల వద్ద విడిచిపెట్టి, స్వామివారికి స్నానం చేయించినట్లు భావన చేయండి)
స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ।
(దేవుని పంచపాత్రలోని నీరు ఉద్దరిణెతో స్వామికి చూపి, వేరొక పాత్ర లో విడిచిపెట్టి, స్వామివారు ముఖం కడుక్కుని నీరు తాగినట్లు భావన చేయండి)
వస్త్రం –
అ॒సౌ యస్తా॒మ్రో అ॑రు॒ణ ఉ॒త బ॒భ్రుస్సు॑మం॒గలః॑ ।
యే చే॒మాగ్ం రు॒ద్రా అ॒భితో॑ ది॒క్షు శ్రి॒తాః స॑హస్ర॒శోఽవై॑షా॒గ్ం॒ హేడ॑ ఈమహే ॥
ఓం శ్రీ పరమేశ్వరాభ్యాం నమః వస్త్రయుగ్మం సమర్పయామి ।
(స్వామివారికి వస్త్రం సమర్పించినట్లు భావన చేస్తూ, కొద్దిగా పుష్పాక్షతలు స్వామి వారి పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
యజ్ఞోపవీతం –
అ॒సౌ యో॑ఽవ॒సర్ప॑తి॒ నీల॑గ్రీవో॒ విలో॑హితః ।
ఉ॒తైనం॑ గో॒పా అ॑దృశ॒న్నదృ॑శన్నుదహా॒ర్యః॑ ।
ఉ॒తైనం॒-విఀశ్వా॑ భూ॒తాని॒ స దృ॒ష్టో మృ॑డయాతి నః ॥
ఓం శ్రీ పరమేశ్వరాభ్యాం నమః యజ్ఞోపవీతం సమర్పయామి ।
(స్వామివారికి యజ్ఞోపవీతం సమర్పిస్తున్నట్లు భావన చేస్తూ, కొద్దిగా అక్షతలు స్వామి వారి పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
గంధం –
నమో॑ అస్తు॒ నీల॑గ్రీవాయ సహస్రా॒క్షాయ॑ మీ॒ఢుషే᳚ ।
అథో॒ యే అ॑స్య॒ సత్వా॑నో॒ఽహం తేభ్యో॑ఽకర॒న్నమః॑ ॥
ఓం శ్రీ పరమేశ్వరాభ్యాం నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి ।
(గంధాన్ని సమర్పిస్తున్నట్లు భావన చేస్తూ, గంధాన్ని నీటితో తడిపి, ఒక పుష్పంతో స్వామివారి మీద చల్లి, ఆ పుష్పాన్ని స్వామి వారి సమర్పించండి)
ఆభరణం –
ప్రముం॑చ॒ ధన్వ॑న॒స్త్వము॒భయో॒రార్త్ని॑ యో॒ర్జ్యాం ।
యాశ్చ॑ తే॒ హస్త॒ ఇష॑వః॒ పరా॒ తా భ॑గవో వప ॥
ఓం శ్రీ పరమేశ్వరాభ్యాం నమః సర్వాభరణాని సమర్పయామి ।
(స్వామివారికి ఆభరణాలు సమర్పిస్తున్నట్లు భావన చేస్తూ, కొద్దిగా పుష్పాక్షతలు స్వామి వారి సమర్పించండి)
పుష్పాణి –
అ॒వ॒తత్య॒ ధను॒స్త్వగ్ం సహ॑స్రాక్ష॒ శతే॑షుధే ।
ని॒శీర్య॑ శ॒ల్యానాం॒ ముఖా॑ శి॒వో నః॑ సు॒మనా॑ భవ ॥
ఓం శ్రీ పరమేశ్వరాభ్యాం నమః నానావిధ పరిమల పత్ర పుష్పాణి సమర్పయామి ।
(కొద్దిగా పుష్పాలు స్వామి వారి పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
ధూపం –
విజ్యం॒ ధనుః॑ కప॒ర్దినో॒ విశ॑ల్యో॒ బాణ॑వాగ్ం ఉ॒త ।
అనే॑శన్న॒స్యేష॑వ ఆ॒భుర॑స్య నిషం॒గథిః॑ ॥
ఓం శ్రీ పరమేశ్వరాభ్యాం నమః ధూపం సమర్పయామి ।
(గంటానాధం చేస్తూ స్వామివారికి వెలిగించిన అగరబత్తి చూపించండి)
దీపం –
యా తే॑ హే॒తిర్మీ॑డుష్టమ॒ హస్తే॑ బ॒భూవ॑ తే॒ ధనుః॑ ।
తయా॒ఽస్మాన్, వి॒శ్వత॒స్త్వమ॑య॒క్ష్మయా॒ పరి॑బ్భుజ ॥
ఓం శ్రీ పరమేశ్వరాభ్యాం నమః దీపం సమర్పయామి ।
(గంటానాధం చేస్తూ స్వామివారికి వెలిగించిన దీపాన్ని చూపించండి)
ధూప దీపానంతరం ఆచమనీయం సమర్పయామి ।
(దేవుని పంచపాత్రలోని నీరు ఉద్దరిణెతో స్వామికి చూపి, వేరొక పాత్ర లో విడిచిపెట్టి, స్వామివారు ముఖం కడుక్కుని నీరు తాగినట్లు భావన చేయండి)
నైవేద్యం –
నమ॑స్తే అ॒స్త్వాయు॑ధా॒యానా॑తతాయ ధృ॒ష్ణవే᳚ ।
ఉ॒భాభ్యా॑ము॒త తే॒ నమో॑ బా॒హుభ్యాం॒ తవ॒ ధన్వ॑నే ॥
ఓం శ్రీ పరమేశ్వరాభ్యాం నమః నైవేద్యం సమర్పయామి ।
(గంటానాధం చేస్తూ, క్రింది మంత్రం చెపుతూ పుష్పంతో నీటిని నైవేద్యం చుట్టూ 3సార్లు సవ్య దిశలో చల్లాలి)
ఓం భూర్భువ॑స్సువ॑: । తత్స॑వితు॒ర్వరే᳚ణ్యం॒ । భ॒ర్గో॑ దే॒వస్య॑ ధీ॒మహి ।
ధియో॒ యోన॑: ప్రచో॒దయా᳚త్ ॥
సత్యం త్వా ఋతేన పరిషించామి (పుష్పంతో నైవేద్యంపై నీటిని చల్లండి)
(సాయంకాలే) – ఋతం త్వా సత్యేన పరిషించామి (పుష్పంతో నైవేద్యంపై నీటిని చల్లండి)
అమృతమస్తు । అమృతోపస్తరణమసి । (ఆ పుష్పాన్ని స్వామి వారి పాదాల వద్ద విడిచిపెట్టండి)
ఓం ప్రాణాయ స్వాహా । (స్వామివారికి నైవేద్యం చూపించండి)
ఓం అపానాయ స్వాహా । (స్వామివారికి నైవేద్యం చూపించండి)
ఓం వ్యానాయ స్వాహా । (స్వామివారికి నైవేద్యం చూపించండి)
ఓం ఉదానాయ స్వాహా । (స్వామివారికి నైవేద్యం చూపించండి)
ఓం సమానాయ స్వాహా । (స్వామివారికి నైవేద్యం చూపించండి)
(క్రింది మంత్రాలు చెపుతూ పుష్పంతో నీటిని దేవుడి పైన 5 సార్లు చల్లండి)
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి ।
అ॒మృ॒తా॒పి॒ధా॒నమ॑సి ।
ఉత్తరాపోశనం సమర్పయామి ।
హస్తౌ ప్రక్షాలయామి ।
పాదౌ ప్రక్షాలయామి ।
శుద్ధాచమనీయం సమర్పయామి ।
తాంబూలం –
పరి॑ తే॒ ధన్వ॑నో హే॒తిర॒స్మాన్ వృ॑ణక్తు వి॒శ్వతః॑ ।
అథో॒ య ఇ॑షు॒ధిస్తవా॒రే అ॒స్మన్నిధే॑హి॒ తం ॥
ఓం శ్రీ పరమేశ్వరాభ్యాం నమః తాంబూలం సమర్పయామి ।
(స్వామివారికి తాంబూలం సమర్పిస్తున్నట్లు భావన చేస్తూ, కొద్దిగా పుష్పాక్షతలు స్వామి వారి పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
నీరాజనం –
శ్రీ శంభ॑వే॒ నమః॑ ॥
నమ॑స్తే అస్తు భగవన్-విశ్వేశ్వ॒రాయ॑ మహాదే॒వాయ॑ త్ర్యంబ॒కాయ॑ త్రిపురాంత॒కాయ॑ త్రికాగ్నికా॒లాయ॑ కాలాగ్నిరు॒ద్రాయ॑ నీలకం॒ఠాయ॑ మృత్యుంజ॒యాయ॑ సర్వేశ్వ॒రాయ॑ సదాశి॒వాయ॑ [శంక॒రాయ॑] శ్రీమన్-మహాదే॒వాయ॒ నమః॑ ।
ఓం శ్రీ పరమేశ్వరాభ్యాం నమః కర్పూర నీరాజనం సమర్పయామి ।
(గంటానాధం చేస్తూ స్వామివారికి కర్పూర హారతి ఇవ్వండి)
నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి । నమస్కరోమి ।
(దేవుని పంచపాత్రలోని నీరు ఉద్దరిణెతో స్వామికి చూపి, వేరొక పాత్ర లో విడిచిపెట్టి, స్వామివారు ముఖం కడుక్కుని నీరు తాగినట్లు భావన చేయండి)
మంత్రపుష్పం –
ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ ।
ఓం శ్రీ పరమేశ్వరాభ్యాం నమః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి ।
(కొద్దిగా పుష్పాక్షతలు స్వామి వారి పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
ఆత్మప్రదక్షిణ –
యానికాని చ పాపాని జన్మాంతరకృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ।
పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవ ।
త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సలా ।
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ ।
తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దనా ।
ఓం శ్రీ పరమేశ్వరాభ్యాం నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ।
(అక్షతలు, పుష్పం తీసుకొని, ఆత్మ ప్రదక్షిణాన్ని మూడు సార్లు చేసి, స్వామి వారి పాదాల వద్ద విడిచి పెట్టండి)
సాష్టాంగ నమస్కారం –
ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా ।
పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే ॥
ఓం శ్రీ పరమేశ్వరాభ్యాం నమః సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి ।
(పురుషులు సాష్టాంగ, మహిళలు పంచాంగ నమస్కారం చేయండి)
సర్వోపచారాః –
ఓం శ్రీ పరమేశ్వరాభ్యాం నమః ఛత్రం ఆచ్ఛాదయామి ।
ఓం శ్రీ పరమేశ్వరాభ్యాం నమః చామరైర్వీజయామి ।
ఓం శ్రీ పరమేశ్వరాభ్యాం నమః నృత్యం దర్శయామి ।
ఓం శ్రీ పరమేశ్వరాభ్యాం నమః గీతం శ్రావయామి ।
ఓం శ్రీ పరమేశ్వరాభ్యాం నమః ఆందోలికాన్నారోహయామి ।
ఓం శ్రీ పరమేశ్వరాభ్యాం నమః అశ్వానారోహయామి ।
ఓం శ్రీ పరమేశ్వరాభ్యాం నమః గజానారోహయామి ।
సమస్త రాజోపచారాన్ దేవోపచారాన్ సమర్పయామి ।
క్షమాప్రార్థనా –
అపరాధ సహస్రాణి క్రియంతేఽహర్నిశం మయా ।
దాసోఽయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వర ।
ఆవాహనం న జానామి న జానామి విసర్జనం ।
పూజావిధిం న జానామి క్షమస్వ పరమేశ్వర ।
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన ।
యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే ।
(పుష్పాక్షతలు, ఒక చుక్క నీరు కుడి చేతిలోకి తీసుకొని పై శ్లోకం చదివి, స్వామి వారి పాదాల వద్ద విడిచిపెట్టండి)
అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః శ్రీ పరమేశ్వర సుప్రీతా సుప్రసన్నా వరదా భవంతు ॥
(కొద్దిగా పుష్పాక్షతలు స్వామి వారి పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
తీర్థప్రసాద స్వీకరణ –
అకాలమృత్యహరణం సర్వవ్యాధినివారణం ॥
సమస్తపాపక్షయకరం శ్రీ పరమేశ్వర పాదోదకం పావనం శుభం ॥
శ్రీ పరమేశ్వరాభ్యాం నమః ప్రసాదం శీరసా గృహ్ణామి ।
(కుడి చేతిలో నీరు పోసుకొని, పై శ్లోకం చదివి మూడు సార్లు తీర్థం తాగండి)
ఓం శాంతిః శాంతిః శాంతిః ।