Haindavam Logo - Lord Ganesha
Haindavam
📍
Font Size:

పితృ తర్పణ విధి - ఆపస్తంభ సూత్రమ్

కావలసిన సామాన్లు –
- దర్భలు
- నల్లనువ్వులు
- తడిపిన తెల్ల బియ్యం
- చెంబులో మంచినీరు (అర్ఘ్య పాత్ర)
- పంచపాత్ర (ఆచమన పాత్ర, ఉద్ధరిణి, అరివేణం)
- తర్పణం విడవడానికి పళ్ళెం
- చిటికెడు గంధం
- కూర్చోవడానికి ఆసనం
యజ్ఞోపవీతం ధరించు విధానములు
- సవ్యం – మామూలుగా ఎడమ భుజం మీదుగా కుడి నడుముకు వచ్చేది.
- నివీతీ – దండలాగా మెడలో నుండి పొట్ట మీదకు వేసుకునేది.
- ప్రాచీనావీతీ – కుడి భుజం మీదుగా ఎడమ నడుముకు వచ్చేది.
శివాయ గురవే నమః ।
శుచిః –
(తలమీద నీళ్ళను జల్లుకోండి)
అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతోఽపి వా
యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరః శుచిః ॥
పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష ॥
ప్రార్థనా –
(నమస్కారం చేస్తూ ఇవి చదవండి)
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ॥
వక్రతుండ మహాకాయ కోటిసూర్యసమప్రభ ।
నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా ॥
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ।
(ఆచమనం చేయండి)
ఓం కేశవాయ స్వాహా ।
ఓం నారాయణాయ స్వాహా ।
ఓం మాధవాయ స్వాహా ।
ఓం గోవిందాయ నమః ।
ఓం విష్ణవే నమః ।
ఓం మధుసూదనాయ నమః ।
ఓం త్రివిక్రమాయ నమః ।
ఓం వామనాయ నమః ।
ఓం శ్రీధరాయ నమః ।
ఓం హృషీకేశాయ నమః ।
ఓం పద్మనాభాయ నమః ।
ఓం దామోదరాయ నమః ।
ఓం సంకర్షణాయ నమః ।
ఓం వాసుదేవాయ నమః ।
ఓం ప్రద్యుమ్నాయ నమః ।
ఓం అనిరుద్ధాయ నమః ।
ఓం పురుషోత్తమాయ నమః ।
ఓం అథోక్షజాయ నమః ।
ఓం నారసింహాయ నమః ।
ఓం అచ్యుతాయ నమః ।
ఓం జనార్దనాయ నమః ।
ఓం ఉపేంద్రాయ నమః ।
ఓం హరయే నమః ।
ఓం శ్రీ కృష్ణాయ నమః ।
పవిత్రం –
ఓం పవిత్రవన్తః పరివాజమాసతే పితైషాం ప్రత్నో అభి రక్షతి వ్రతమ్ ।
మహస్సముద్రం వరుణస్తిరో దధే ధీరా ఇచ్ఛేకుర్ధరుణేష్వారభమ్ ॥
పవిత్రం తే వితతం బ్రహ్మణస్పతే ప్రభుర్గాత్రాణి పర్యేషి విశ్వతః ।
అతప్తతనూర్న తదామో అశ్నుతే శృతాస ఇద్వహన్తస్తత్సమాశత ॥
పవిత్రం ధృత్వా ॥
(పవిత్రం ధరించండి)
భూతోచ్ఛాటనం –
ఉత్తిష్ఠన్తు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ।
ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ॥
(కుడి చేతిలో అక్షతలు తీసుకొని పై శ్లోకం చదువుతూ వాసన చూసి మీ ఎడమ వైపు నుండి వెనకకు వేయండి)
ప్రాణాయామం –
ఓం భూః । ఓం భువః । ఓం సువః । ఓం మహః ।
ఓం జనః । ఓం తపః । ఓం సత్యం ।
తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ।
ధియో యో నః ప్రచోదయాత్ ।
ఓమాపో జ్యోతీ రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్ ।
(మూడు సార్లు అనులోమ-విలోమ ప్రాణాయామం చేయండి)
సంకల్పం –
(అక్షతలు చేతిలో పట్టుకోండి)
శ్రీ గోవింద గోవింద గోవింద । శ్రీమహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ___ ప్రదేశే ___, ___ నద్యోః మధ్యే పుణ్యప్రదేశే సమస్త దేవతా బ్రాహ్మణ ఆచార్య హరి హర గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమనే వ్యావహరిక చాంద్రమానేన శ్రీ ____ నామ సంవత్సరే ___ అయనే ___ ఋతౌ ___ మాసే ___ పక్షే ___ తిథౌ ___ వాసరే శ్రీవిష్ణు నక్షత్రే శ్రీవిష్ణు యోగే శ్రీవిష్ణు కరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం పుణ్యతిథౌ ॥ ప్రాచీనావీతీ ॥ అస్మత్ పితౄనుద్దిశ్య అస్మత్ పితౄణాం పుణ్యలోకావాప్త్యర్థం పితృ తర్పణం కరిష్యే ॥ సవ్యం ॥
(నీరు తీసుకుని అక్షింతలు అరివేణం లో విడవండి)
నమస్కారం –
(నమస్కారం చేయండి)
ఈశానః పితృరూపేణ మహాదేవో మహేశ్వరః ।
ప్రీయతాం భగవానీశః పరమాత్మా సదాశివః ॥ 1
దేవతాభ్యః పితృభ్యశ్చ మహాయోగిభ్య ఏవ చ ।
నమస్స్వాహాయై స్వధాయై నిత్యమేవ నమో నమః ॥ 2
మన్త్రమధ్యే క్రియామధ్యే విష్ణోస్స్మరణ పూర్వకం ।
యత్కించిత్క్రియతే కర్మ తత్కోటి గుణితం భవేత్ ॥ 3
విష్ణుర్విష్ణుర్విష్ణుః ॥
(దక్షిణం వైపు తిరగి కూర్చోండి)
అర్ఘ్యపాత్ర –
అర్ఘ్యపాత్రయోః అమీగంధాః ।
(అర్ఘ్యపాత్రలో గంధం వేయండి)
పుష్పార్థా ఇమే అక్షతాః ।
(అర్ఘ్యపాత్రలో అక్షతలు వేయండి)
అమీ కుశాః ।
(అర్ఘ్యపాత్రలో ఒక దర్భ వేయండి)
॥ సవ్యం ॥ నమస్కృత్య ।
ఓం ఆయంతు నః పితరస్సోమ్యాసోగ్నిష్వాత్తాః పథిభిర్దేవ యానైః ।
అస్మిన్ యజ్ఞే స్వధయా మదం త్వధి బృవంతు తే అవంత్వ స్మాన్ ॥
ఇదం పితృభ్యో నమో అస్త్వద్య యే పూర్వాసో య ఉపరాస ఈయుః ।
యే పార్థివే రజస్యా నిషత్తా యే వా నూనం సువృజనాసు విక్షు ॥
పితృదేవతాభ్యో నమః ।
ఓం ఆగచ్ఛంతు మే పితర ఇమం గృహ్ణంతు జలాంజలిమ్ ।
(పళ్ళెంలో ఒక దర్భ పెట్టండి)
॥ ప్రాచీనావీతీ ॥
సకలోపచారార్థే తిలాన్ సమర్పయామి ।
(నల్లనువ్వులు పళ్ళెంలోని దర్భ మీద వేయండి)
పిత్రాది తర్పణం ।
(కుడి బొటన వేలికి నల్లనువ్వులు అద్దుకుని పితృతీర్థముగా మూడేసిసార్లు నీరు విడవండి.
బ్రాహ్మణులకు – శర్మాణం, క్షత్రియులకు – వర్మాణం, వైశ్యులకు – గుప్తం )
(గతించిన వారికి మాత్రమే చేయండి. సజీవులకు చేయవద్దు.)
॥ ప్రాచీనావీతీ ॥
[తండ్రిగారు]
అస్మత్ పితరం __(గోత్రం)__ గోత్రం __(మనిషి పేరు)__ శర్మాణం* వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి ।
[తండ్రియొక్క తండ్రిగారు]
అస్మత్ పితామహం ___ గోత్రం ___ శర్మాణం* రుద్రరూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి ।
[తండ్రియొక్క తండ్రిగారి తండ్రిగారు]
అస్మత్ ప్రపితామహం ___ గోత్రం ___ శర్మాణం* ఆదిత్యరూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి ।
[తల్లిగారు]
అస్మత్ మాతరం ___ గోత్రాం ___ దాం వసురూపాం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి ।
[తండ్రియొక్క తల్లిగారు]
అస్మత్ పితామహీం ___ గోత్రాం ___ దాం రుద్రరూపాం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి ।
[తండ్రియొక్క తండ్రిగారి తల్లిగారు]
అస్మత్ ప్రపితామహీం ___ గోత్రాం ___ దాం ఆదిత్యరూపాం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి ।
[తండ్రియొక్క మారు భార్య (సవతితల్లి)]
( సవతితల్లి ఉండి గతించినట్లైతేనే ఇది చేయండి)
అస్మత్ సాపత్నీమాతరం ___ గోత్రాం ___ దాం వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి ।
[తల్లియొక్క తండ్రిగారు]
అస్మత్ మాతామహం ___ గోత్రం ___ శర్మాణం* వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి ।
[తల్లియొక్క తండ్రిగారి తండ్రిగారు]
అస్మత్ మాతుః పితామహం ___ గోత్రం ___ శర్మాణం* రుద్రరూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి ।
[తల్లియొక్క తండ్రిగారి తండ్రిగారికి తండ్రిగారు]
అస్మత్ మాతుః ప్రపితామహం ___ గోత్రం ___ శర్మాణం* ఆదిత్యరూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి ।
[తల్లియొక్క తల్లిగారు]
అస్మత్ మాతామహీం ___ గోత్రాం ___ దాం వసురూపాం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి ।
[తల్లియొక్క తల్లిగారి అత్తగారు (తల్లిగారి నాయనమ్మ)]
అస్మత్ మాతుః పితామహీం ___ గోత్రాం ___ దాం రుద్రరూపాం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి ।
[తల్లియొక్క తల్లిగారి అత్తగారి అత్తగారు (తల్లిగారి తాతమ్మ)]
అస్మత్ మాతుః ప్రపితామహీం ___ గోత్రాం ___ దాం ఆదిత్యరూపాం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి ।
(ఈ క్రింది తర్పణలు వివాహం జరిగినవాళ్ళు మాత్రమే గతించినవారికి మాత్రమే ఇవ్వవలెను. సజీవులకు ఇవ్వరాదు)
[భార్య]
అస్మత్ ఆత్మపత్నీం ___ గోత్రాం ___ దాం వసురూపాం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి ।
[కుమారుడు]
అస్మత్ సుతం ___ గోత్రం ___ శర్మాణం* వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి ।
[సోదరుడు]
అస్మత్ భ్రాతరం ___ గోత్రం ___ శర్మాణం* వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి ।
[పెదతండ్రి(జ్యేష్ఠ)/పినతండ్రి(కనిష్ఠ)]
అస్మత్ జ్యేష్ఠ/కనిష్ఠ పితృవ్యం ___ గోత్రం ___ శర్మాణం* వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి ।
[మేనమామ]
అస్మత్ మాతులం ___ గోత్రం ___ శర్మాణం* వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి ।
[కూతురు]
అస్మత్ దుహితరం ___ గోత్రాం ___ దాం వసురూపాం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి ।
[తోబుట్టువు]
అస్మత్ భగినీం ___ గోత్రాం ___ దాం వసురూపాం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి ।
[కూతురి కోడుకు (మనుమడు)]
అస్మత్ దౌహిత్రం ___ గోత్రం ___ శర్మాణం* వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి ।
[మేనల్లుడు]
అస్మత్ భగినేయకం ___ గోత్రం ___ శర్మాణం* వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి ।
[మేనత్త]
అస్మత్ పితృష్వసారం ___ గోత్రాం ___ దాం వసురూపాం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి ।
[పెదతల్లి(జ్యేష్ఠ)/పినతల్లి(కనిష్ఠ)]
అస్మత్ జ్యేష్ఠ/కనిష్ఠ మాతృష్వసారం ___ గోత్రాం ___ దాం వసురూపాం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి ।
[అల్లుడు]
అస్మత్ జామాతరం ___ గోత్రం ___ శర్మాణం* వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి ।
[తోబుట్టువు భర్త]
అస్మత్ భావుకం ___ గోత్రం ___ శర్మాణం* వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి ।
[కోడలు]
అస్మత్ స్నుషాం ___ గోత్రం ___ దాం వసురూపాం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి ।
[భార్యయొక్క తండ్రిగారు]
అస్మత్ శ్వశురం ___ గోత్రం ___ శర్మాణం* వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి ।
[భార్యయొక్క తల్లిగారు]
అస్మత్ శ్వశ్రూం ___ గోత్రాం ___ దాం వసురూపాం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి ।
[బావమరుదులు]
అస్మత్ స్యాలకం ___ గోత్రం ___ శర్మాణం* వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి ।
[ఆచార్యుడు]
అస్మత్ స్వామినం/ఆచార్యం ___ గోత్రం ___ శర్మాణం* వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి ।
[బ్రహ్మోపదేశం చేసిన గురువుగారు]
అస్మత్ గురుం ___ గోత్రం ___ శర్మాణం* వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి ।
[తర్పణ కోరినవారు]
అస్మత్ రిక్థినం ___ గోత్రం ___ శర్మాణం* వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి ।
పితృదేవతాభ్యో నమః ।
సుప్రీతో భవతు ।
కుశోదకం –
॥ ప్రాచీనావీతీ ॥
ఏషాన్నమాతా న పితా న బన్ధుః నాన్య గోత్రిణః ।
తే సర్వే తృప్తిమాయాన్తు మయోత్సృష్టైః కుశోదకైః ॥
తృప్యత తృప్యత తృప్యత తృప్యత తృప్యత ।
(కొన్ని నువ్వులు, పళ్ళెం లోని దర్భ చేతిలోకి తీసుకుని చెంబులోని నీరు పితృతీర్థంగా పళ్ళెంలో విడవండి. దర్భ కూడా విడిచిపెట్టి చేతికి నువ్వులు లేకుండా శుభ్రం చేసుకోండి).
నిష్పీడనోదకం –
॥ నివీతీ ॥
యేకే చాస్మత్కులేజాతాః అపుత్రాః గోత్రిణో మృతాః ।
తే గృహ్ణన్తు మయా దత్తం వస్త్రనిష్పీడనోదకమ్ ।
(జంధ్యము దండలావేసుకొని బ్రహ్మముడులమీద నీరుపోసి తడిపి పిండి కళ్ళకు అద్దుకోండి)
సమర్పణం –
॥ సవ్యం ॥
కాయేన వాచా మనసైన్ద్రియైర్వా
బుద్ధ్యాత్మనా వా ప్రకృతేస్స్వభావాత్ ।
కరోమి యద్యత్సకలం పరస్మై
నారాయణాయేతి సమర్పయామి ॥
నమో బ్రహ్మణ్యదేవాయ గో బ్రాహ్మణ హితాయ చ ।
జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః ॥
పవిత్రం విసృజ్య ।
ఓం శాంతిః శాంతిః శాంతిః ।
ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు ।

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits