Haindavam Logo - Lord Ganesha

హైందవం

📍
Font Size:

దత్తాత్రేయ సిద్ధ మంగళ స్తోత్రం

శ్రీమదనంత శ్రీవిభూషిత అప్పలలక్ష్మీ నరసింహరాజా జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ 1 శ్రీవిద్యాధరి రాధ సురేఖా శ్రీరాఖీధర శ్రీపాదా జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ 2 మాతా సుమతీ వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాదా జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ 3 సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణా జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ 4 సవితృకాఠకచయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ 5 దోచౌపాతీ దేవ్ లక్ష్మీ ఘన సంఖ్యా బోధిత శ్రీచరణా జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ 6 పుణ్యరూపిణీ రాజమాంబసుత గర్భపుణ్యఫల సంజాతా జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ 7 సుమతీ నందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాదా జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ 8 పీఠికాపుర నిత్య విహారా మధుమతి దత్తా మంగళరూపా జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ 9

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits