Haindavam Logo - Lord Ganesha
Haindavam
📍
Font Size:

వరాహాష్టోత్తర శతనామ స్తోత్రం

ధ్యానం ।
శ్వేతం సుదర్శనదరాంకితబాహుయుగ్మం
దంష్ట్రాకరాలవదనం ధరయా సమేతం ।
బ్రహ్మాదిభిః సురగణైః పరిసేవ్యమానం
ధ్యాయేద్వరాహవపుషం నిగమైకవేద్యం ॥
స్తోత్రం ।
శ్రీవరాహో మహీనాథః పూర్ణానందో జగత్పతిః ।
నిర్గుణో నిష్కలోఽనంతో దండకాంతకృదవ్యయః ॥ 1 ॥
హిరణ్యాక్షాంతకృద్దేవః పూర్ణషాడ్గుణ్యవిగ్రహః ।
లయోదధివిహారీ చ సర్వప్రాణిహితేరతః ॥ 2 ॥
అనంతరూపోఽనంతశ్రీర్జితమన్యుర్భయాపహః ।
వేదాంతవేద్యో వేదీ చ వేదగర్భః సనాతనః ॥ 3 ॥
సహస్రాక్షః పుణ్యగంధః కల్పకృత్ క్షితిభృద్ధరిః ।
పద్మనాభః సురాధ్యక్షో హేమాంగో దక్షిణాముఖః ॥ 4 ॥
మహాకోలో మహాబాహుః సర్వదేవనమస్కృతః ।
హృషీకేశః ప్రసన్నాత్మా సర్వభక్తభయాపహః ॥ 5 ॥
యజ్ఞభృద్యజ్ఞకృత్సాక్షీ యజ్ఞాంగో యజ్ఞవాహనః ।
హవ్యభుక్ హవ్యదేవశ్చ సదాఽవ్యక్తః కృపాకరః ॥ 6 ॥
దేవభూమిగురుః కాంతో ధర్మగుహ్యో వృషాకపిః ।
స్రవత్తుండో వక్రదంష్ట్రో నీలకేశో మహాబలః ॥ 7 ॥
పూతాత్మా వేదనేతా చ వేదహర్తృశిరోహరః ।
వేదాంతవిద్వేదగుహ్యః సర్వవేదప్రవర్తకః ॥ 8 ॥
గభీరాక్షస్త్రిధామా చ గభీరాత్మాఽమరేశ్వరః ।
ఆనందవనగో దివ్యో బ్రహ్మనాసాసముద్భవః ॥ 9 ॥
సింధుతీరనివాసీ చ క్షేమకృత్సాత్త్వతాం పతిః ।
ఇంద్రత్రాతా జగత్త్రాతా చేంద్రదోర్దండగర్వహా ॥ 10 ॥
భక్తవశ్యో సదోద్యుక్తో నిజానందో రమాపతిః ।
శ్రుతిప్రియః శుభాంగశ్చ పుణ్యశ్రవణకీర్తనః ॥ 11 ॥
సత్యకృత్సత్యసంకల్పః సత్యవాక్సత్యవిక్రమః ।
సత్యేనిగూఢః సత్యాత్మా కాలాతీతో గుణాధికః ॥ 12 ॥
పరంజ్యోతిః పరంధామ పరమః పురుషః పరః ।
కల్యాణకృత్కవిః కర్తా కర్మసాక్షీ జితేంద్రియః ॥ 13 ॥
కర్మకృత్కర్మకాండస్యసంప్రదాయప్రవర్తకః ।
సర్వాంతకః సర్వగశ్చ సర్వదః సర్వభక్షకః ॥ 14 ॥
సర్వలోకపతిః శ్రీమాన్ శ్రీముష్ణేశః శుభేక్షణః ।
సర్వదేవప్రియః సాక్షీత్యేతన్నామాష్టకం శతం ॥ 15 ॥
సర్వవేదాధికం పుణ్యం వరాహస్య మహాత్మనః ।
సతతం ప్రాతరుత్థాయ సమ్యగాచమ్య వారిణా ॥ 16 ॥
జితాసనో జితక్రోధః పశ్చాన్మంత్రముదీరయేత్ ।
బ్రాహ్మణో బ్రహ్మవిద్యాయాం చ క్షత్రియో రాజ్యమాప్నుయాత్ ॥ 17 ॥
వైశ్యో ధనసమృద్ధః స్యాత్ శూద్రః సుఖమవాప్నుయాత్ ।
సకామో లభతే కామాన్నిష్కామో మోక్షమాప్నుయాత్ ॥ 18 ॥
ఇతి శ్రీవరాహపురాణే ధరణీవరాహసంవాదే శ్రీభూవరాహాష్టోత్తరస్తవః ।

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits