అదితిరువాచ ।
నమస్తే దేవదేవేశ సర్వవ్యాపిన్ జనార్దన ।
సత్త్వాదిగుణభేదేన లోకవ్యాపారకారిణే ॥ 1 ॥
నమస్తే బహురూపాయ అరూపాయ నమో నమః ।
సర్వైకాద్భుతరూపాయ నిర్గుణాయ గుణాత్మనే ॥ 2 ॥
నమస్తే లోకనాథాయ పరమజ్ఞానరూపిణే ।
సద్భక్తజనవాత్సల్యశీలినే మంగలాత్మనే ॥ 3 ॥
యస్యావతారరూపాణి హ్యర్చయంతి మునీశ్వరాః ।
తమాదిపురుషం దేవం నమామీష్టార్థసిద్ధయే ॥ 4 ॥
యం న జానంతి శ్రుతయో యం న జాయంతి సూరయః ।
తం నమామి జగద్ధేతుం మాయినం తమమాయినం ॥ 5 ॥
యస్యావలోకనం చిత్రం మాయోపద్రవవారణం ।
జగద్రూపం జగత్పాలం తం వందే పద్మజాధవం ॥ 6 ॥
యో దేవస్త్యక్తసంగానాం శాంతానాం కరుణార్ణవః ।
కరోతి హ్యాత్మనా సంగం తం వందే సంగవర్జితం ॥ 7 ॥
యత్పాదాబ్జజలక్లిన్నసేవారంజితమస్తకాః ।
అవాపుః పరమాం సిద్ధిం తం వందే సర్వవందితం ॥ 8 ॥
యజ్ఞేశ్వరం యజ్ఞభుజం యజ్ఞకర్మసునిష్ఠితం ।
నమామి యజ్ఞఫలదం యజ్ఞకర్మప్రభోదకం ॥ 9 ॥
అజామిలోఽపి పాపాత్మా యన్నామోచ్చారణాదను ।
ప్రాప్తవాన్ పరమం ధామ తం వందే లోకసాక్షిణం ॥ 10 ॥
బ్రహ్మాద్యా అపి యే దేవా యన్మాయాపాశయంత్రితాః ।
న జానంతి పరం భావం తం వందే సర్వనాయకం ॥ 11 ॥
హృత్పద్మనిలయోఽజ్ఞానాం దూరస్థ ఇవ భాతి యః ।
ప్రమాణాతీతసద్భావం తం వందే జ్ఞానసాక్షిణం ॥ 12 ॥
యన్ముఖాద్బ్రాహ్మణో జాతో బాహుభ్యాం క్షత్రియోఽజని ।
తథైవ ఊరుతో వైశ్యః పద్భ్యాం శూద్రో అజాయత ॥ 13 ॥
మనసశ్చంద్రమా జాతో జాతః సూర్యశ్చ చక్షుషః ।
ముఖాదింద్రశ్చాఽగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత ॥ 14 ॥
త్వమింద్రః పవనః సోమస్త్వమీశానస్త్వమంతకః ।
త్వమగ్నిర్నిరృతిశ్చైవ వరుణస్త్వం దివాకరః ॥ 15 ॥
దేవాశ్చ స్థావరాశ్చైవ పిశాచాశ్చైవ రాక్షసాః ।
గిరయః సిద్ధగంధర్వా నద్యో భూమిశ్చ సాగరాః ॥ 16 ॥
త్వమేవ జగతామీశో యన్నామాస్తి పరాత్పరః ।
త్వద్రూపమఖిలం తస్మాత్పుత్రాన్మే పాహి శ్రీహరే ॥ 17 ॥
ఇతి స్తుత్వా దేవధాత్రీ దేవం నత్వా పునః పునః ।
ఉవాచ ప్రాంజలిర్భూత్వా హర్షాశ్రుక్షాలితస్తనీ ॥ 18 ॥
అనుగ్రాహ్యాస్మి దేవేశ హరే సర్వాదికారణ ।
అకంటకశ్రియం దేహి మత్సుతానాం దివౌకసాం ॥ 19 ॥
అంతర్యామిన్ జగద్రూప సర్వభూత పరేశ్వర ।
తవాజ్ఞాతం కిమస్తీహ కిం మాం మోహయసి ప్రభో ॥ 20 ॥
తథాపి తవ వక్ష్యామి యన్మే మనసి వర్తతే ।
వృథాపుత్రాస్మి దేవేశ రక్షోభిః పరిపీడితా ॥ 21 ॥
ఏతన్న హంతుమిచ్ఛామి మత్సుతా దితిజా యతః ।
తానహత్వా శ్రియం దేహి మత్సుతానామువాచ సా ॥ 22 ॥
ఇత్యుక్తో దేవదేవస్తు పునః ప్రీతిముపాగతః ।
ఉవాచ హర్షయన్సాధ్వీం కృపయాఽభి పరిప్లుతః ॥ 23 ॥
శ్రీ భగవానువాచ ।
ప్రీతోఽస్మి దేవి భద్రం తే భవిష్యామి సుతస్తవ ।
యతః సపత్నీతనయేష్వపి వాత్సల్యశాలినీ ॥ 24 ॥
త్వయా చ మే కృతం స్తోత్రం పఠంతి భువి మానవాః ।
తేషాం పుత్రో ధనం సంపన్న హీయంతే కదాచన ।
అంతే మత్పదమాప్నోతి యద్విష్ణోః పరమం శుభం ॥ 25 ॥
ఇతి శ్రీపద్మపురాణే శ్రీ వామన స్తోత్రం ।