నక్షత్రం - కృత్తికా, దేవతా - అగ్నిః
ఓం అ॒గ్నిర్నః॑ పాతు॒ కృత్తి॑కాః । నక్ష॑త్రం దే॒వమిం॑ద్రి॒యం ।
ఇ॒దమా॑సాం-విఀచక్ష॒ణం । హ॒విరా॒సం జు॑హోతన ।
యస్య॒ భాంతి॑ ర॒శ్మయో॒ యస్య॑ కే॒తవః॑ । యస్యే॒మా విశ్వా॒ భువ॑నాని॒ సర్వా᳚ ।
స కృత్తి॑కాభి-ర॒భిసంవఀసా॑నః । అ॒గ్నిర్నో॑ దే॒వస్సు॑వి॒తే ద॑ధాతు ॥ 1
నక్షత్రం - రోహిణీ, దేవతా - ప్రజాపతిః
ప్ర॒జాప॑తే రోహి॒ణీవే॑తు॒ పత్నీ᳚ । వి॒శ్వరూ॑పా బృహ॒తీ చి॒త్రభా॑నుః ।
సా నో॑ య॒జ్ఞస్య॑ సువి॒తే ద॑ధాతు । యథా॒ జీవే॑మ శ॒రద॒స్సవీ॑రాః ।
రో॒హి॒ణీ దే॒వ్యుద॑గాత్పు॒రస్తా᳚త్ । విశ్వా॑ రూ॒పాణి॑ ప్రతి॒మోద॑మానా ।
ప్ర॒జాప॑తిగ్ం హ॒విషా॑ వ॒ర్ధయం॑తీ । ప్రి॒యా దే॒వానా॒-ముప॑యాతు య॒జ్ఞం ॥ 2
నక్షత్రం - మృగశీర్షః, దేవతా - సోమః
సోమో॒ రాజా॑ మృగశీ॒ర్॒షేణ॒ ఆగన్న్॑ । శి॒వం నక్ష॑త్రం ప్రి॒యమ॑స్య॒ ధామ॑ ।
ఆ॒ప్యాయ॑మానో బహు॒ధా జనే॑షు । రేతః॑ ప్ర॒జాం-యఀజ॑మానే దధాతు ।
యత్తే॒ నక్ష॑త్రం మృగశీ॒ర్॒షమస్తి॑ । ప్రి॒యగ్ం రా॑జన్ ప్రి॒యత॑మం ప్రి॒యాణాం᳚ ।
తస్మై॑ తే సోమ హ॒విషా॑ విధేమ । శన్న॑ ఏధి ద్వి॒పదే॒ శంచతు॑ష్పదే ॥ 3
నక్షత్రం - ఆర్ద్రా, దేవతా - రుద్రః
ఆ॒ర్ద్రయా॑ రు॒ద్రః ప్రథ॑మా న ఏతి । శ్రేష్ఠో॑ దే॒వానాం॒ పతి॑రఘ్ని॒యానాం᳚ ।
నక్ష॑త్రమస్య హ॒విషా॑ విధేమ । మా నః॑ ప్ర॒జాగ్ం రీ॑రిష॒న్మోత వీ॒రాన్ ।
హే॒తీ రు॒ద్రస్య॒ పరి॑ణో వృణక్తు । ఆ॒ర్ద్రా నక్ష॑త్రం జుషతాగ్ం హ॒విర్నః॑ ।
ప్ర॒ముం॒చమా॑నౌ దురి॒తాని॒ విశ్వా᳚ । అపా॒ఘశగ్ం॑ సన్ను-దతా॒మరా॑తిం ॥ 4
నక్షత్రం - పునర్వసు, దేవతా - అదితిః
పున॑ర్నో దే॒వ్యది॑తి-స్పృణోతు । పున॑ర్వసూ నః॒ పున॒రేతాం᳚-యఀ॒జ్ఞం ।
పున॑ర్నో దే॒వా అ॒భియం॑తు॒ సర్వే᳚ । పునః॑ పునర్వో హ॒విషా॑ యజామః ।
ఏ॒వా న దే॒వ్య-ది॑తిరన॒ర్వా । విశ్వ॑స్య భ॒ర్త్రీ జగ॑తః ప్రతి॒ష్ఠా ।
పున॑ర్వసూ హ॒విషా॑ వ॒ర్ధయం॑తీ । ప్రి॒యం దే॒వానా॒-మప్యే॑తు॒ పాథః॑ ॥ 5
నక్షత్రం - పుష్యః, దేవతా - బృహస్పతిః
బృహ॒స్పతిః॑ ప్రథ॒మంజాయ॑మానః । తి॒ష్యం॑ నక్ష॑త్రమ॒భి సంబ॑భూవ ।
శ్రేష్ఠో॑ దే॒వానాం॒ పృత॑నాసు జి॒ష్ణుః । ది॒శోఽను॒ సర్వా॒ అభ॑యన్నో అస్తు ।
తి॒ష్యః॑ పు॒రస్తా॑దు॒త మ॑ధ్య॒తో నః॑ । బృహ॒స్పతి॑ర్నః॒ పరి॑పాతు ప॒శ్చాత్ ।
బాధే॑ తాం॒ద్వేషో॒ అభ॑యం కృణుతాం । సు॒వీర్య॑స్య॒ పత॑యస్యామ ॥ 6
నక్షత్రం -ఆశ్రేషం, దేవతా - సర్పాః
ఇ॒దగ్ం స॒ర్పేభ్యో॑ హ॒విర॑స్తు॒ జుష్టం᳚ । ఆ॒శ్రే॒షా యేషా॑మను॒యంతి॒ చేతః॑ ।
యే అం॒తరి॑క్షం పృథి॒వీం-క్షి॒యంతి॑ । తేన॑ స్స॒ర్పాసో॒ హవ॒మాగ॑మిష్ఠాః ।
యే రో॑చ॒నే సూర్య॒స్యాపి॑ స॒ర్పాః । యే దివం॑ దే॒వీ-మను॑సం॒చరం॑తి ।
యేషా॑మాశ్రే॒షా అ॑ను॒యంతి॒ కామం᳚ । తేభ్య॑-స్స॒ర్పేభ్యో॒ మధు॑-మజ్జుహోమి ॥ 7
నక్షత్రం - మఘా, దేవతా - పితరః
ఉప॑హూతాః పి॒తరో॒ యే మ॒ఘాసు॑ । మనో॑జవస-స్సు॒కృత॑-స్సుకృ॒త్యాః ।
తే నో॒ నక్ష॑త్రే॒ హవ॒మాగ॑మిష్ఠాః । స్వ॒ధాభి॑ర్య॒జ్ఞం ప్రయ॑తం జుషంతాం ।
యే అ॑గ్నిద॒గ్ధా యేఽన॑గ్ని-దగ్ధాః । యే॑ఽముల్లో॒కం పి॒తరః॑, క్షి॒యంతి॑ ।
యాగ్గ్శ్చ॑ వి॒ద్మయాగ్ం ఉ॑ చ॒ న ప్ర॑వి॒ద్మ । మ॒ఘాసు॑ య॒జ్ఞగ్ం సుకృ॑తం జుషంతాం ॥ 8
నక్షత్రం - పూర్వఫల్గునీ, దేవతా - అర్యమా
గవాం॒ పతిః॒ ఫల్గు॑నీ-నామసి॒ త్వం । తద॑ర్యమన్వరుణ మిత్ర॒ చారు॑ ।
తం త్వా॑ వ॒యగ్ం స॑ని॒తారగ్ం॑ సనీ॒నాం । జీ॒వా జీవం॑త॒ముప॒ సంవిఀ॑శేమ ।
యేనే॒మా విశ్వా॒ భువ॑నాని॒ సంజి॑తా । యస్య॑ దే॒వా అ॑నుసంయంఀతి॒ చేతః॑ ।
అ॒ర్య॒మా రాజా॒ఽజర॒స్తు వి॑ష్మాన్ । ఫల్గు॑నీనా-మృష॒భో రో॑రవీతి ॥ 9
నక్షత్రం - ఉత్తర ఫల్గునీ, దేవతా - భగః
శ్రేష్ఠో॑ దే॒వానాం᳚ భగవో భగాసి । తత్త్వా॑ విదుః॒ ఫల్గు॑నీ॒-స్తస్య॑ విత్తాత్ ।
అ॒స్మభ్యం॑-క్ష॒త్రమ॒జరగ్ం॑ సు॒వీర్యం᳚ । గోమ॒దశ్వ॑-వ॒దుప॒సన్ను॑-దే॒హ ।
భగో॑హ దా॒తా భగ॒ ఇత్ప్ర॑దా॒తా । భగో॑ దే॒వీః ఫల్గు॑నీ॒-రావి॑వేశ ।
భగ॒స్యేత్తం ప్ర॑స॒వం గ॑మేమ । యత్ర॑ దే॒వై-స్స॑ధ॒మాదం॑ మదేమ ॥ 10
నక్షత్రం - హస్తః, దేవతా - సవితా
ఆయా॑తు దే॒వ-స్స॑వి॒తో ప॑యాతు । హి॒ర॒ణ్యయే॑న సు॒వృతా॒ రథే॑న ।
వహ॒న॒, హస్తగ్ం॑ సు॒భగం॑-విఀద్మ॒నాప॑సం । ప్ర॒యచ్ఛం॑తం॒ పపు॑రిం॒ పుణ్య॒మచ్ఛ॑ ।
హస్తః॒ ప్రయ॑చ్ఛ త్వ॒మృతం॒-వఀసీ॑యః । దక్షి॑ణేన॒ ప్రతి॑గృభ్ణీమ ఏనత్ ।
దా॒తార॑-మ॒ద్య స॑వి॒తా వి॑దేయ । యో నో॒ హస్తా॑య ప్రసు॒వాతి॑ య॒జ్ఞం ॥ 11
నక్షత్రం - చిత్రా, దేవతా - త్వష్టా
త్వష్టా॒ నక్ష॑త్ర-మ॒భ్యే॑తి చి॒త్రాం । సు॒భగ్ం స॑సంయుఀవ॒తిగ్ం రోచ॑మానాం ।
ని॒వే॒శయ॑-న్న॒మృతా॒-న్మర్త్యాగ్గ్॑శ్చ । రూ॒పాణి॑ పి॒గ్ం॒శన్ భువ॑నాని॒ విశ్వా᳚ ।
తన్న॒స్త్వష్టా॒ తదు॑ చి॒త్రా విచ॑ష్టాం । తన్నక్ష॑త్రం భూరి॒దా అ॑స్తు॒ మహ్యం᳚ ।
తన్నః॑ ప్ర॒జాం-వీఀ॒రవ॑తీగ్ం సనోతు । గోభి॑ర్నో॒ అశ్వై॒-స్సమ॑నక్తు య॒జ్ఞం ॥ 12
నక్షత్రం - స్వాతీ, దేవతా - వాయుః
వా॒యు-ర్నక్ష॑త్ర-మ॒భ్యే॑తి॒ నిష్ట్యాం᳚ । తి॒గ్మశృం॑గో వృష॒భో రోరు॑వాణః ।
స॒మీ॒రయ॒న్ భువ॑నా మాత॒రిశ్వా᳚ । అప॒ ద్వేషాగ్ం॑సి నుదతా॒మరా॑తీః ।
తన్నో॑ వా॒యస్తదు॒ నిష్ట్యా॑ శృణోతు । తన్నక్ష॑త్రం భూరి॒దా అ॑స్తు॒ మహ్యం᳚ ।
తన్నో॑ దే॒వాసో॒ అను॑ జానంతు॒ కామం᳚ । యథా॒ తరే॑మ దురి॒తాని॒ విశ్వా᳚ ॥ 13
నక్షత్రం - విశాఖా, దేవతా - ఇంద్రాగ్నీ
దూ॒రమ॒స్మచ్ఛత్ర॑వో యంతు భీ॒తాః । తదిం॑ద్రా॒గ్నీ కృ॑ణుతాం॒ తద్విశా॑ఖే ।
తన్నో॑ దే॒వా అను॑మదంతు య॒జ్ఞం । ప॒శ్చాత్ పు॒రస్తా॒-దభ॑యన్నో అస్తు ।
నక్ష॑త్రాణా॒-మధి॑పత్నీ॒ విశా॑ఖే । శ్రేష్ఠా॑-వింద్రా॒గ్నీ భువ॑నస్య గో॒పౌ ।
విషూ॑చ॒-శ్శత్రూ॑నప॒బాధ॑మానౌ । అప॒క్షుధ॑-న్నుదతా॒మరా॑తిం ॥ 14
పౌర్ణమాసి
పూ॒ర్ణా ప॒శ్చాదు॒త పూ॒ర్ణా పు॒రస్తా᳚త్ । ఉన్మ॑ధ్య॒తః పౌ᳚ర్ణమా॒సీ జి॑గాయ ।
తస్యాం᳚ దే॒వా అధి॑ సం॒-వఀసం॑తః । ఉ॒త్త॒మే నాక॑ ఇ॒హ మా॑దయంతాం ।
పృ॒థ్వీ సు॒వర్చా॑ యువ॒తి-స్స॒జోషాః᳚ । పౌ॒ర్ణ॒మా॒స్యుద॑గా॒-చ్ఛోభ॑మానా ।
ఆ॒ప్యా॒యయం॑తీ దురి॒తాని॒ విశ్వా᳚ । ఉ॒రుం దుహాం॒-యఀజ॑మానాయ య॒జ్ఞం ॥ 15
నక్షత్రం - అనూరాధా, దేవతా - మిత్రః
ఋ॒ద్ధ్యాస్మ॑ హ॒వ్యై-ర్నమ॑సోప॒-సద్య॑ । మి॒త్రం దే॒వం మి॑త్ర॒ధేయ॑న్నో అస్తు ।
అ॒నూ॒రా॒ధాన్, హ॒విషా॑ వ॒ర్ధయం॑తః । శ॒తం జీ॑వేమ శ॒రద॒-స్సవీ॑రాః ।
చి॒త్రం-నక్ష॑త్ర॒-ముద॑గా-త్పు॒రస్తా᳚త్ । అ॒నూ॒రా॒ధా స॒ ఇతి॒ యద్వదం॑తి ।
తన్మి॒త్ర ఏ॑తి ప॒థిభి॑-ర్దేవ॒యానైః᳚ । హి॒ర॒ణ్యయై॒-ర్విత॑తై-రం॒తరి॑క్షే ॥ 16
నక్షత్రం - జ్యేష్ఠా, దేవతా - ఇంద్రః
ఇంద్రో᳚ జ్యే॒ష్ఠా మను॒ నక్ష॑త్రమేతి । యస్మి॑న్ వృ॒త్రం-వృఀ॑త్ర॒ తూర్యే॑ త॒తార॑ ।
తస్మి॑న్వ॒య-మ॒మృతం॒ దుహా॑నాః । క్షుధం॑తరేమ॒ దురి॑తిం॒ దురి॑ష్టిం ।
పు॒రం॒ద॒రాయ॑ వృష॒భాయ॑ ధృ॒ష్ణవే᳚ । అషా॑ఢాయ॒ సహ॑మానాయ మీ॒ఢుషే᳚ ।
ఇంద్రా॑య జ్యే॒ష్ఠా మధు॑మ॒ద్దుహా॑నా । ఉ॒రుం కృ॑ణోతు॒ యజ॑మానాయ లో॒కం ॥ 17
నక్షత్రం - మూలం, దేవతా - ప్రజాపతిః
మూలం॑ ప్ర॒జాం-వీఀ॒రవ॑తీం-విఀదేయ । పరా᳚చ్యేతు॒ నిర్ఋ॑తిః పరా॒చా ।
గోభి॒-ర్నక్ష॑త్రం ప॒శుభి॒-స్సమ॑క్తం । అహ॑-ర్భూయా॒-ద్యజ॑మానాయ॒ మహ్యం᳚ ।
అహ॑ర్నో అ॒ద్య సు॑వి॒తే ద॑ధాతు । మూలం॒ నక్ష॑త్ర॒మితి॒ యద్వదం॑తి ।
పరా॑చీం-వాఀ॒చా నిర్ఋ॑తిం నుదామి । శి॒వం ప్ర॒జాయై॑ శి॒వమ॑స్తు॒ మహ్యం᳚ ॥ 18
నక్షత్రం - పూర్వాషాఢా, దేవతా - ఆపః
యా ది॒వ్యా ఆపః॒ పయ॑సా సంబభూ॒వుః । యా అం॒తరి॑క్ష ఉ॒త పార్థి॑వీ॒ర్యాః ।
యాసా॑మషా॒ఢా అ॑ను॒యంతి॒ కామం᳚ । తా న॒ ఆపః॒ శగ్గ్ స్యో॒నా భ॑వంతు ।
యాశ్చ॒ కూప్యా॒ యాశ్చ॑ నా॒ద్యా᳚-స్సము॒ద్రియాః᳚ । యాశ్చ॑ వైశం॒తీరు॒త ప్రా॑స॒చీర్యాః ।
యాసా॑మషా॒ఢా మధు॑ భ॒క్షయం॑తి । తా న॒ ఆపః॒ శగ్గ్ స్యో॒నా భ॑వంతు ॥ 19
నక్షత్రం - ఉత్తరాషాఢా, దేవతా - విశ్వేదేవః
తన్నో॒ విశ్వే॒ ఉప॑ శృణ్వంతు దే॒వాః । తద॑షా॒ఢా అ॒భిసంయఀం॑తు య॒జ్ఞం ।
తన్నక్ష॑త్రం ప్రథతాం ప॒శుభ్యః॑ । కృ॒షి-ర్వృ॒ష్టి-ర్యజ॑మానాయ కల్పతాం ।
శు॒భ్రాః క॒న్యా॑ యువ॒తయ॑-స్సు॒పేశ॑సః । క॒ర్మ॒కృత॑-స్సు॒కృతో॑ వీ॒ర్యా॑వతీః ।
విశ్వా᳚న్ దే॒వాన్, హ॒విషా॑ వ॒ర్ధయం॑తీః ।
అ॒షా॒ఢాః కామ॒ ముప॑యాంతు య॒జ్ఞం ॥ 20
నక్షత్రం - అభిజిత్, దేవతా - బ్రహ్మా
యస్మి॒న్ బ్రహ్మా॒భ్యజ॑య॒థ్ సర్వ॑మే॒తత్ । అ॒ముంచ॑ లో॒క మి॒దమూ॑చ॒ సర్వం᳚ ।
తన్నో॒ నక్ష॑త్ర-మభి॒జి-ద్వి॒జిత్య॑ । శ్రియం॑ దధా॒త్వ-హృ॑ణీయమానం ।
ఉ॒భౌ లో॒కౌ బ్రహ్మ॑ణా॒ సంజి॑తే॒మౌ । తన్నో॒ నక్ష॑త్ర-మభి॒జి-ద్విచ॑ష్టాం ।
తస్మి॑న్ వ॒యం పృత॑నా॒ స్సంజ॑యేమ । తన్నో॑ దే॒వాసో॒ అను॑జానంతు॒ కామం᳚ ॥ 21
నక్షత్రం - శ్రవణం, దేవతా - విష్ణుః
శృ॒ణ్వంతి॑ శ్రో॒ణా-మ॒మృత॑స్య గో॒పాం । పుణ్యా॑మస్యా॒ ఉప॑శృణోమి॒ వాచం᳚ ।
మ॒హీం దే॒వీం-విఀష్ణు॑పత్నీ మజూ॒ర్యాం । ప్ర॒తీచీ॑ మేనాగ్ం హ॒విషా॑ యజామః ।
త్రే॒ధా విష్ణు॑-రురుగా॒యో విచ॑క్రమే । మ॒హీం దివం॑ పృథి॒వీ-మం॒తరి॑క్షం ।
తచ్ఛ్రో॒ణైతి॒ శ్రవ॑-ఇ॒చ్ఛమా॑నా । పుణ్య॒గ్గ్॒ శ్లోకం॒-యఀజ॑మానాయ కృణ్వ॒తీ ॥ 22
నక్షత్రం - శ్రవిష్టా, దేవతా - వసవః
అ॒ష్టౌ దే॒వా వస॑వస్సో॒మ్యాసః॑ । చత॑స్రో దే॒వీ ర॒జరాః॒ శ్రవి॑ష్ఠాః ।
తే య॒జ్ఞం పాం᳚తు॒ రజ॑సః ప॒రస్తా᳚త్ । సంవఀ॒థ్స॒రీణ॑-మ॒మృతగ్గ్॑ స్వ॒స్తి ।
య॒జ్ఞం నః॑ పాంతు॒ వస॑వః పు॒రస్తా᳚త్ । ద॒క్షి॒ణ॒తో॑-ఽభియం॑తు॒ శ్రవి॑ష్ఠాః ।
పుణ్య॒న్నక్ష॑త్రమ॒భి సంవిఀ॑శామ । మా నో॒ అరా॑తి-ర॒ఘశ॒గ్ం॒ సాగన్న్॑ ॥ 23
నక్షత్రం - శతభిషక్, దేవతా - వరుణః
క్ష॒త్రస్య॒ రాజా॒ వరు॑ణోఽధిరా॒జః । నక్ష॑త్రాణాగ్ం శ॒తభి॑ష॒గ్ వసి॑ష్ఠః ।
తౌ దే॒వేభ్యః॑ కృణుతో దీ॒ర్ఘమాయః॑ । శ॒తగ్ం స॒హస్రా॑ భేష॒జాని॑ ధత్తః ।
య॒జ్ఞన్నో॒ రాజా॒ వరు॑ణ॒ ఉప॑యాతు । తన్నో॒ విశ్వే॑ అ॒భిసంయఀం॑తు దే॒వాః ।
తన్నో॒ నక్ష॑త్రగ్ం శ॒తభి॑షగ్ జుషా॒ణం । దీ॒ర్ఘమాయుః॒ ప్రతి॑ర-ద్భేష॒జాని॑ ॥ 24
నక్షత్రం - పూర్వప్రోష్ఠపదా, దేవతా - అజయేకపాదః
అ॒జ ఏక॑పా॒- దుద॑గాత్ పు॒రస్తా᳚త్ । విశ్వా॑ భూ॒తాని॑ ప్రతి॒ మోద॑మానః ।
తస్య॑ దే॒వాః ప్ర॑స॒వం-యఀం॑తి॒ సర్వే᳚ । ప్రో॒ష్ఠ॒ప॒దాసో॑ అ॒మృత॑స్య గో॒పాః ।
వి॒భ్రాజ॑మాన-స్సమిధా॒న ఉ॒గ్రః । ఆఽంతరి॑క్ష-మరుహ॒ద-ద్గం॒ద్యాం ।
తగ్ం సూర్యం॑ దే॒వ-మ॒జమేక॑పాదం । ప్రో॒ష్ఠ॒ప॒దాసో॒ అను॑యంతి॒ సర్వే᳚ ॥ 25
నక్షత్రం - ఉత్తరప్రోష్ఠపదా, దేవతా - అహిర్బుద్ధ్నియః
అహి॑-ర్బు॒ద్ధ్నియః॒ ప్రథ॑మాన ఏతి । శ్రేష్ఠో॑ దే॒వానా॑ము॒త మాను॑షాణాం ।
తం బ్రా᳚హ్మ॒ణా-స్సో॑మ॒పా-స్సో॒మ్యాసః॑ । ప్రో॒ష్ఠ॒ప॒దాసో॑ అ॒భిర॑క్షంతి॒ సర్వే᳚ ।
చ॒త్వార॒ ఏక॑మ॒భి కర్మ॑ దే॒వాః । ప్రో॒ష్ఠ॒ప॒దాస॒ ఇతి॒ యాన్, వదం॑తి ।
తే బు॒ద్ధనియం॑ పరి॒షద్యగ్గ్॑ స్తు॒వంతః॑ । అహిగ్ం॑ రక్షంతి॒ నమ॑సోప॒ సద్య॑ ॥ 26
నక్షత్రం - రేవతీ, దేవతా - పూషా
పూ॒షా రే॒వత్యన్వే॑తి॒ పంథాం᳚ । పు॒ష్టి॒పతీ॑ పశు॒పా వాజ॑బస్త్యౌ ।
ఇ॒మాని॑ హ॒వ్యా ప్రయ॑తా జుషా॒ణా । సు॒గైర్నో॒ యానై॒రుప॑యాతాం-యఀ॒జ్ఞం ।
క్షు॒ద్రాన్ ప॒శూన్ ర॑క్షతు రే॒వతీ॑ నః । గావో॑ నో॒ అశ్వా॒గ్ం॒ అన్వే॑తు పూ॒షా ।
అన్న॒గ్ం॒ రక్షం॑తౌ బహు॒ధా విరూ॑పం । వాజగ్ం॑ సనుతాం॒-యఀజ॑మానాయ య॒జ్ఞం ॥ 27
నక్షత్రం - అశ్వినీ, దేవతా - అశ్వినీ దేవ
తద॒శ్వినా॑-వశ్వ॒యుజో-ప॑యాతాం । శుభం॒గమి॑ష్ఠౌ సు॒యమే॑భి॒రశ్వైః᳚ ।
స్వన్నక్ష॑త్రగ్ం హ॒విషా॒ యజం॑తౌ । మద్ధ్వా॒-సంపృ॑క్తౌ॒ యజు॑షా॒ సమ॑క్తౌ ।
యౌ దే॒వానాం᳚ భి॒షజౌ॑ హవ్యవా॒హౌ । విశ్వ॑స్య దూ॒తా-వ॒మృత॑స్య గో॒పౌ ।
తౌ నక్ష॑త్రం-జుజుషా॒ణో-ప॑యాతాం । నమో॒ఽశ్విభ్యాం᳚ కృణుమో-ఽశ్వ॒గ్యుభ్యాం᳚ ॥ 28
నక్షత్రం - అపభరణీ, దేవతా - యమః
అప॑ పా॒ప్మానం॒ భర॑ణీ-ర్భరంతు । తద్య॒మో రాజా॒ భగ॑వా॒న్॒, విచ॑ష్టాం ।
లో॒కస్య॒ రాజా॑ మహ॒తో మ॒హాన్, హి । సు॒గన్నః॒ పంథా॒మభ॑యం కృణోతు ।
యస్మి॒-న్నక్ష॑త్రే య॒మ ఏతి॒ రాజా᳚ । యస్మి॑న్నేన-మ॒భ్యషిం॑చంత దే॒వాః ।
తద॑స్య చి॒త్రగ్ం హ॒విషా॑ యజామ । అప॑ పా॒ప్మానం॒ భర॑ణీ-ర్భరంతు ॥ 29
అమావాసి
ని॒వేశ॑నీ సం॒గమ॑నీ॒ వసూ॑నాం॒-విఀశ్వా॑ రూ॒పాణి॒ వసూ᳚న్యా-వే॒శయం॑తీ ।
స॒హ॒స్ర॒-పో॒షగ్ం సు॒భగా॒ రరా॑ణా॒ సా న॒ ఆగ॒న్ వర్చ॑సా సంవిఀదా॒నా ।
యత్తే॑ దే॒వా అద॑ధు-ర్భాగ॒ధేయ॒-మమా॑వాస్యే సంవఀసం॑తో మహి॒త్వా ।
సా నో॑ య॒జ్ఞం పి॑పృహి విశ్వవారే ర॒యిన్నో॑ ధేహి సుభగే సు॒వీరం᳚ ॥ 30
ఓం శాంతిః॒ శాంతిః॒ శాంతిః॑ ॥