సూచనలు:
3. ఆ తర్వాత, కింద ఇచ్చిన వివరణాత్మక పూజా విధానాన్ని అనుసరించండి ।
పునః సంకల్పం –
(పుష్పాక్షతలు, ఒక చుక్క నీరు కుడి చేతిలోకి తీసుకొని కింద ఉన్న సంకల్పం చదవండి)
పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ వల్లీదేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ప్రసాద సిద్ధ్యర్థం స్థిరలక్ష్మీ కీర్తిలాభ శత్రుపరాజయాది సకలాభీష్ట సిద్ధ్యర్థం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ధ్యానావహనాది షోడశోపచార పూజాం కరిష్యే ॥
(అని చదివి పుష్పాక్షతలు పళ్ళెములో విడిచి, చేతిని శుభ్రం చేసుకోండి)
ధ్యానం –
షడ్వక్త్రం శిఖివాహనం త్రినయనం చిత్రాంబరాలంకృతం
శక్తిం వజ్రమసిం త్రిశూలమభయం ఖేటం ధనుశ్చక్రకం ।
పాశం కుక్కుటమంకుశం చ వరదం హస్తైర్దదానం సదా
ధ్యాయేదీప్సిత సిద్ధిదం శివసుతం వందే సురారాధితం ॥
శ్రీవల్లీదేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్యం ధ్యాయామి ।
(కొద్దిగా పుష్పాక్షతలు స్వామి వారి పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
ఆవాహనం –
సుబ్రహ్మణ్య మహాభాగ క్రౌంచాఖ్యగిరిభేదన ।
ఆవాహయామి దేవ త్వం భక్తాభీష్టప్రదో భవ ॥
శ్రీవల్లీదేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్యం ఆవాహయామి ।
(కొద్దిగా పుష్పాక్షతలు స్వామి వారి పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
ఆసనం –
అగ్నిపుత్ర మహాభాగ కార్తికేయ సురార్చిత ।
రత్నసింహాసనం దేవ గృహాణ వరదావ్యయ ॥
శ్రీవల్లీదేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్యాయ నమః ఆసనం సమర్పయామి ।
(స్వామివారికి సింహాసనం సమర్పిస్తున్నట్లు భావన చేస్తూ, కొద్దిగా పుష్పాక్షతలు స్వామి వారి పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
పాద్యం –
గణేశానుజ దేవేశ వల్లీకామదవిగ్రహ ।
పాద్యం గృహాణ గాంగేయ భక్త్యా దత్తం సురార్చిత ॥
శ్రీవల్లీదేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్యాయ నమః పాదయోః పాద్యం సమర్పయామి ।
(స్వామివారి పాదాలు కడిగినట్లు భావన చేస్తూ, దేవుని పంచపాత్రలోని నీరు ఉద్ధరిణితో స్వామికి చూపి, వేరొక పాత్రలో విడిచిపెట్టండి)
అర్ఘ్యం –
బ్రహ్మాది దేవబృందానాం ప్రణవార్థోపదేశక ।
అర్ఘ్యం గృహాణ దేవేశ తారకాంతక షణ్ముఖ ॥
శ్రీవల్లీదేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్యాయ నమః హస్తయోరర్ఘ్యం సమర్పయామి ।
(స్వామివారి చేతులు కడిగినట్లు భావన చేస్తూ, దేవుని పంచపాత్రలోని నీరు ఉద్ధరిణితో స్వామికి చూపి, వేరొక పాత్రలో విడిచిపెట్టండి)
ఆచమనీయం –
ఏలాకుంకుమకస్తూరీకర్పూరాదిసువాసితైః ।
తీర్థైరాచమ్యతాం దేవ గంగాధరసుతావ్యయ ॥
శ్రీవల్లీదేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్యాయ నమః ఆచమనీయం సమర్పయామి ।
(దేవుని పంచపాత్రలోని నీరు ఉద్దరిణెతో స్వామికి చూపి, వేరొక పాత్ర లో విడిచిపెట్టి, స్వామివారు ముఖం కడుక్కుని నీరు తాగినట్లు భావన చేయండి)
పంచామృత స్నానం –
శర్కరా మధు గోక్షీర ఫలసార ఘృతైర్యుతం ।
పంచామృతస్నానమిదం బాహులేయ గృహాణ భో ॥
శ్రీవల్లీదేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్యాయ నమః పంచామృతస్నానం సమర్పయామి ।
(గంటానాధం చేస్తూ స్వామివారికి పంచామృత స్నానం చేయించండి)
స్నానం –
స్వామిన్ శరవణోద్భూత శూరపద్మాసురాంతక ।
గంగాదిసలిలైః స్నాహి దేవసేనామనోహర ॥
శ్రీవల్లీదేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్యాయ నమః స్నానం సమర్పయామి ।
(పుష్పంతో స్వామి వారిపై కొద్దిగా దేవుని పంచపాత్రలోని నీరు చల్లి, ఆ పుష్పాన్ని స్వామి వారి పాదాల వద్ద విడిచిపెట్టి, స్వామివారికి స్నానం చేయించినట్లు భావన చేయండి)
స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ।
(దేవుని పంచపాత్రలోని నీరు ఉద్దరిణెతో స్వామికి చూపి, వేరొక పాత్ర లో విడిచిపెట్టి, స్వామివారు ముఖం కడుక్కుని నీరు తాగినట్లు భావన చేయండి)
వస్త్రం –
దుకూలవస్త్రయుగలం ముక్తాజాలసమన్వితం ।
ప్రీత్యా గృహాణ గాంగేయ భక్తాపద్భంజనక్షమ ॥
శ్రీవల్లీదేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్యాయ నమః వస్త్రయుగ్మం సమర్పయామి ।
(స్వామివారికి వస్త్రం సమర్పించినట్లు భావన చేస్తూ, కొద్దిగా పుష్పాక్షతలు స్వామి వారి పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
యజ్ఞోపవీతం –
రాజతం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకం ।
యజ్ఞోపవీతం దేవేశ గృహాణ సురనాయక ॥
శ్రీవల్లీదేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్యాయ నమః ఉపవీతం సమర్పయామి ।
(స్వామివారికి యజ్ఞోపవీతం సమర్పిస్తున్నట్లు భావన చేస్తూ, కొద్దిగా అక్షతలు స్వామి వారి పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
భస్మ –
నిత్యాగ్నిహోత్రసంభూతం విరజాహోమభావితం ।
గృహాణ భస్మ హే స్వామిన్ భక్తానాం భూతిదో భవ ॥
శ్రీవల్లీదేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్యాయ నమః భస్మ సమర్పయామి ।
(స్వామివారి నుదుటిపై భస్మాన్ని అలంకరించండి)
గంధం –
కస్తూరీకుంకుమాద్యైశ్చ వాసితం సహిమోదకం ।
గంధం విలేపనార్థాయ గృహాణ క్రౌంచదారణ ॥
శ్రీవల్లీదేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్యాయ నమః గంధాన్ ధారయామి ।
(గంధాన్ని సమర్పిస్తున్నట్లు భావన చేస్తూ, గంధాన్ని నీటితో తడిపి, ఒక పుష్పంతో స్వామివారి మీద చల్లి, ఆ పుష్పాన్ని స్వామి వారి సమర్పించండి)
అక్షతాన్ –
అక్షతాన్ ధవలాన్ దివ్యాన్ శాలేయాన్ తండులాన్ శుభాన్ ।
కాంచనాక్షతసమ్యుక్తాన్ కుమార ప్రతిగృహ్యతాం ॥
శ్రీవల్లీదేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్యాయ నమః అక్షతాన్ సమర్పయామి ।
(కొద్దిగా అక్షతలు స్వామి వారి పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
ఆభరణం –
భూషణాని విచిత్రాణి హేమరత్నమయాని చ ।
గృహాణ భువనాధార భుక్తిముక్తిఫలప్రద ॥
శ్రీవల్లీదేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్యాయ నమః ఆభరణాని సమర్పయామి ।
(స్వామివారికి ఆభరణాలు సమర్పిస్తున్నట్లు భావన చేస్తూ, కొద్దిగా పుష్పాక్షతలు స్వామి వారి సమర్పించండి)
పుష్పం –
పున్నగ వకులాశోక నీప పాటల జాతి చ ।
వాసంతికా బిల్వజాజీ పుష్పాణి పరిగృహ్యతాం ॥
శ్రీవల్లీదేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్యాయ నమః పుష్పాణి సమర్పయామి ।
(కొద్దిగా పుష్పాలు స్వామి వారి పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
అష్టోత్తరశతనామ పూజా –
(ప్రతీ నామానికి ఒక్కొక్క పుష్పం స్వామి వారికి సమర్పించండి, పుష్పం అందుబాటులో లేనట్లయితే అక్షతలను ఉపయోగించండి)
ఓం స్కందాయ నమః
ఓం గుహాయ నమః
ఓం షణ్ముఖాయ నమః
ఓం ఫాలనేత్రసుతాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం పింగలాయ నమః
ఓం కృత్తికాసూనవే నమః
ఓం శిఖివాహాయ నమః
ఓం ద్విషడ్భుజాయ నమః
ఓం ద్విషణ్ణేత్రాయ నమః । 10
ఓం శక్తిధరాయ నమః
ఓం పిశితాశ ప్రభంజనాయ నమః
ఓం తారకాసుర సంహారిణే నమః
ఓం రక్షోబలవిమర్దనాయ నమః
ఓం మత్తాయ నమః
ఓం ప్రమత్తాయ నమః
ఓం ఉన్మత్తాయ నమః
ఓం సురసైన్య సురక్షకాయ నమః
ఓం దేవసేనాపతయే నమః
ఓం ప్రాజ్ఞాయ నమః । 20
ఓం కృపాలవే నమః
ఓం భక్తవత్సలాయ నమః
ఓం ఉమాసుతాయ నమః
ఓం శక్తిధరాయ నమః
ఓం కుమారాయ నమః
ఓం క్రౌంచదారణాయ నమః
ఓం సేనాన్యే నమః
ఓం అగ్నిజన్మనే నమః
ఓం విశాఖాయ నమః
ఓం శంకరాత్మజాయ నమః । 30
ఓం శివస్వామినే నమః
ఓం గణ స్వామినే నమః
ఓం సర్వస్వామినే నమః
ఓం సనాతనాయ నమః
ఓం అనంతశక్తయే నమః
ఓం అక్షోభ్యాయ నమః
ఓం పార్వతీప్రియనందనాయ నమః
ఓం గంగాసుతాయ నమః
ఓం శరోద్భూతాయ నమః
ఓం ఆహూతాయ నమః । 40
ఓం పావకాత్మజాయ నమః
ఓం జృంభాయ నమః
ఓం ప్రజృంభాయ నమః
ఓం ఉజ్జృంభాయ నమః
ఓం కమలాసన సంస్తుతాయ నమః
ఓం ఏకవర్ణాయ నమః
ఓం ద్వివర్ణాయ నమః
ఓం త్రివర్ణాయ నమః
ఓం సుమనోహరాయ నమః
ఓం చతుర్వర్ణాయ నమః । 50
ఓం పంచవర్ణాయ నమః
ఓం ప్రజాపతయే నమః
ఓం అహస్పతయే నమః
ఓం అగ్నిగర్భాయ నమః
ఓం శమీగర్భాయ నమః
ఓం విశ్వరేతసే నమః
ఓం సురారిఘ్నే నమః
ఓం హరిద్వర్ణాయ నమః
ఓం శుభకరాయ నమః
ఓం పటవే నమః । 60
ఓం వటువేషభృతే నమః
ఓం పూష్ణే నమః
ఓం గభస్తయే నమః
ఓం గహనాయ నమః
ఓం చంద్రవర్ణాయ నమః
ఓం కలాధరాయ నమః
ఓం మాయాధరాయ నమః
ఓం మహామాయినే నమః
ఓం కైవల్యాయ నమః
ఓం శంకరాత్మజాయ నమః । 70
ఓం విశ్వయోనయే నమః
ఓం అమేయాత్మనే నమః
ఓం తేజోనిధయే నమః
ఓం అనామయాయ నమః
ఓం పరమేష్ఠినే నమః
ఓం పరస్మై బ్రహ్మణే నమః
ఓం వేదగర్భాయ నమః
ఓం విరాట్సుతాయ నమః
ఓం పులిందకన్యాభర్త్రే నమః
ఓం మహాసారస్వతావృతాయ నమః । 80
ఓం ఆశ్రితాఖిలదాత్రే నమః
ఓం చోరఘ్నాయ నమః
ఓం రోగనాశనాయ నమః
ఓం అనంతమూర్తయే నమః
ఓం ఆనందాయ నమః
ఓం శిఖిండికృత కేతనాయ నమః
ఓం డంభాయ నమః
ఓం పరమడంభాయ నమః
ఓం మహాడంభాయ నమః
ఓం వృషాకపయే నమః । 90
ఓం కారణోపాత్తదేహాయ నమః
ఓం కారణాతీతవిగ్రహాయ నమః
ఓం అనీశ్వరాయ నమః
ఓం అమృతాయ నమః
ఓం ప్రాణాయ నమః
ఓం ప్రాణాయామపరాయణాయ నమః
ఓం విరుద్ధహంత్రే నమః
ఓం వీరఘ్నాయ నమః
ఓం రక్తశ్యామగలాయ నమః
ఓం సుబ్రహ్మణ్యాయ నమః । 100
ఓం గుహాయ నమః
ఓం ప్రీతాయ నమః
ఓం బ్రాహ్మణ్యాయ నమః
ఓం బ్రాహ్మణప్రియాయ నమః
ఓం వంశవృద్ధికరాయ నమః
ఓం వేదాయ నమః
ఓం వేద్యాయ నమః
ఓం అక్షయఫలప్రదాయ నమః । 108
ధూపం –
దశాంగం గుగ్గులూపేతం సుగంధం సుమనోహరం ।
కపిలాఘృతసమ్యుక్తం ధూపం గృహ్ణీష్వ షణ్ముఖ ॥
శ్రీవల్లీదేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్యాయ నమః ధూపమాఘ్రాపయామి ।
(గంటానాధం చేస్తూ స్వామివారికి వెలిగించిన అగరబత్తి చూపించండి)
దీపం –
సాజ్యం త్రివర్తిసమ్యుక్తం వహ్నినా యోజితం మయా ।
దీపం గృహాణ స్కందేశ త్రైలోక్యతిమిరాపహం ॥
శ్రీవల్లీదేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్యాయ నమః దీపం దర్శయామి ।
ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి ।
(గంటానాధం చేస్తూ స్వామివారికి వెలిగించిన దీపాన్ని చూపించండి)
నైవేద్యం –
లేహ్యం చోష్యం చ భోజ్యం చ పానీయం షడ్రసాన్వితం ।
భక్ష్యశాకాదిసమ్యుక్తం నైవేద్యం స్కంద గృహ్యతాం ॥
శ్రీవల్లీదేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్యాయ నమః నైవేద్యం సమర్పయామి ।
(గంటానాధం చేస్తూ, క్రింది మంత్రం చెపుతూ పుష్పంతో నీటిని నైవేద్యం చుట్టూ 3సార్లు సవ్య దిశలో చల్లాలి)
ఓం భూర్భువ॒స్సువ॑: । తత్స॑వి॒తుర్వరే᳚ణ్యం॒ భర్గో॑ దే॒వస్య॑ ధీమహి ।
ధియో॒ యో న॑: ప్రచో॒దయా᳚త్ ॥
సత్యం త్వా ఋతేన పరిషించామి (పుష్పంతో నైవేద్యంపై నీటిని చల్లండి)
(సాయంకాలే) – ఋతం త్వా సత్యేన పరిషించామి (పుష్పంతో నైవేద్యంపై నీటిని చల్లండి)
అమృతమస్తు । అమృతోపస్తరణమసి । (ఆ పుష్పాన్ని స్వామి వారి పాదాల వద్ద విడిచిపెట్టండి)
ఓం ప్రాణాయ స్వాహా । (స్వామివారికి నైవేద్యం చూపించండి)
ఓం అపానాయ స్వాహా । (స్వామివారికి నైవేద్యం చూపించండి)
ఓం వ్యానాయ స్వాహా । (స్వామివారికి నైవేద్యం చూపించండి)
ఓం ఉదానాయ స్వాహా । (స్వామివారికి నైవేద్యం చూపించండి)
ఓం సమానాయ స్వాహా । (స్వామివారికి నైవేద్యం చూపించండి)
(క్రింది మంత్రాలు చెపుతూ పుష్పంతో నీటిని దేవుడి పైన 5 సార్లు చల్లండి)
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి ।
అ॒మృ॒తా॒పి॒ధా॒నమ॑సి ।
ఉత్తరాపోశనం సమర్పయామి ।
హస్తౌ ప్రక్షాలయామి ।
పాదౌ ప్రక్షాలయామి ।
శుద్ధాచమనీయం సమర్పయామి ।
తాంబూలం –
పూగీఫలసమాయుక్తం నాగవల్లీదలైర్యుతం ।
కర్పూరచూర్ణసమ్యుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం ॥
శ్రీవల్లీదేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్యాయ నమః తాంబూలం సమర్పయామి ।
(స్వామివారికి తాంబూలం సమర్పిస్తున్నట్లు భావన చేస్తూ, కొద్దిగా పుష్పాక్షతలు స్వామి వారి పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
నీరాజనం –
దేవసేనాపతే స్కంద సంసారధ్వాంతభారక ।
నీరాజనమిదం దేవ గృహ్యతాం సురసత్తమ ॥
శ్రీవల్లీదేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్యాయ నమః కర్పూరనీరాజనం దర్శయామి ।
(గంటానాధం చేస్తూ స్వామివారికి కర్పూర హారతి ఇవ్వండి)
మంత్రపుష్పం –
ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి । తన్నో స్కందః ప్రచోదయాత్ ।
పుష్పాంజలిం ప్రదాస్యామి భక్తాభీష్టప్రదాయక ।
గృహాణవల్లీరమణ సుప్రీతేనాంతరాత్మనా ॥
శ్రీవల్లీదేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్యాయ నమః పుష్పాంజలిం సమర్పయామి ।
నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి । నమస్కరోమి ।
(దేవుని పంచపాత్రలోని నీరు ఉద్దరిణెతో స్వామికి చూపి, వేరొక పాత్ర లో విడిచిపెట్టి, స్వామివారు ముఖం కడుక్కుని నీరు తాగినట్లు భావన చేయండి)
ఆత్మప్రదక్షిణ –
యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ ।
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ॥
పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవ ।
త్రాహిమాం కృపయా దేవ శరణాగతవత్సల ॥
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ ।
తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష సురేశ్వర ॥
శ్రీవల్లీదేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్యాయ నమః ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి ।
(అక్షతలు, పుష్పం తీసుకొని, ఆత్మ ప్రదక్షిణాన్ని మూడు సార్లు చేసి, స్వామి వారి పాదాల వద్ద విడిచి పెట్టండి)
నమస్కారం –
షడాననం కుంకుమరక్తవర్ణం
ద్విషడ్భుజం బాలకమంబికాసుతం ।
రుద్రస్య సూనుం సురసైన్యనాథం
గుహం సదాఽహం శరణం ప్రపద్యే ॥
శ్రీవల్లీదేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్యాయ నమః ప్రార్థనా నమస్కారాన్ సమర్పయామి ।
(నమస్కారం చేయండి)
రాజోపచార పూజా –
ఓం శ్రీవల్లీదేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్యాయ నమః ।
ఛత్రమాచ్ఛాదయామి ।
చామరైర్వీజయామి ।
గీతం శ్రావయామి ।
నృత్యం దర్శయామి ।
వాద్యం ఘోషయామి ।
ఆందోలికాన్ ఆరోహయామి ।
అశ్వాన్ ఆరోహయామి ।
గజాన్ ఆరోహయామి ।
ఓం శ్రీవల్లీదేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్యాయ నమః ।
సమస్త రాజోపచారాన్ దేవోపచారాన్ సమర్పయామి ।
అర్ఘ్యం –
దేవసేనాపతే స్వామిన్ సేనానీరఖిలేష్టద ।
ఇదమర్ఘ్యం ప్రదాస్యామి సుప్రీతో భవ సర్వదా ॥
ఓం శ్రీవల్లీదేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్యాయ నమః ।
ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ॥ 1 ॥
చంద్రాత్రేయ మహాభాగ సోమ సోమవిభూషణ ।
ఇదమర్ఘ్యం ప్రదాస్యామి సుప్రీతో భవ సర్వదా ॥
ఓం శ్రీవల్లీదేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్యాయ నమః ।
ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ॥ 2 ॥
నీలకంఠ మహాభాగ సుబ్రహ్మణ్యసువాహన ।
ఇదమర్ఘ్యం ప్రదాస్యామి సుప్రీతో భవ సర్వదా ॥
ఓం శ్రీవల్లీదేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్యాయ నమః ।
ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ॥ 3 ॥
(స్వామివారి చేతులు కడిగినట్లు భావన చేస్తూ, దేవుని పంచపాత్రలోని నీరు ఉద్ధరిణితో స్వామికి చూపి, వేరొక పాత్రలో విడిచిపెట్టండి)
క్షమాప్రార్థనా –
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వర ।
యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే ॥
(పుష్పాక్షతలు, ఒక చుక్క నీరు కుడి చేతిలోకి తీసుకొని పై శ్లోకం చదివి, స్వామి వారి పాదాల వద్ద విడిచిపెట్టండి)
అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః శ్రీవల్లీదేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్య స్వామి సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు ॥
(కొద్దిగా పుష్పాక్షతలు స్వామి వారి పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
ఓం శాంతిః శాంతిః శాంతిః ॥