సూచనలు:
3. ఆ తర్వాత, కింద ఇచ్చిన వివరణాత్మక పూజా విధానాన్ని అనుసరించండి ।
పునః సంకల్పం –
(పుష్పాక్షతలు, ఒక చుక్క నీరు కుడి చేతిలోకి తీసుకొని కింద ఉన్న సంకల్పం చదవండి)
పూర్వోక్త ఏవం గుణవిశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీ ఉమామహేశ్వర ముద్దిశ్య శ్రీ ఉమామహేశ్వర ప్రీత్యర్థం యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే ॥
(అని చదివి పుష్పాక్షతలు పళ్ళెములో విడిచి, చేతిని శుభ్రం చేసుకోండి)
ప్రాణప్రతిష్ఠా –
ఓం అసు॑నీతే॒ పున॑ర॒స్మాసు॒ చక్షు॒:
పున॑: ప్రా॒ణమి॒హ నో᳚ ధేహి॒ భోగం᳚ ।
జ్యోక్ప॑శ్యేమ॒ సూర్య॑ము॒చ్చరం᳚త॒
మను॑మతే మృ॒డయా᳚ నః స్వ॒స్తి ।
అ॒మృతం॒ వై ప్రా॒ణా అ॒మృత॒మాప॑:
ప్రా॒ణానే॒వ య॑థాస్థా॒నముప॑హ్వయతే ॥
స్థిరో భవ । వరదో భవ । సుముఖో భవ ।
సుప్రసన్నో భవ । స్థిరాసనం కురు ॥
స్వామిన్ సర్వ జగన్నాథ యావత్పూజాఽవసానకం ।
తావత్త్వం ప్రీతి భావేన లింగేఽస్మిన్ సన్నిధిం కురు ॥
ఓం త్ర్యం॑బకం యజామహే సుగం॒ధిం పు॑ష్టి॒ వర్ధ॑నం ।
ఉ॒ర్వా॒రు॒కమి॑వ॒ బంధ॑నాన్మృ॒త్యోర్ము॑క్షీయ॒ మాఽమృతా᳚త్ ॥
అస్మిన్ లింగే శ్రీఉమామహేశ్వర స్వామినమావాహయామి స్థాపయామి । తతః ప్రాణ ప్రతిష్ఠాపనం కరిష్యే ॥
(కొద్దిగా పుష్పాక్షతలు స్వామి వారి పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
ధ్యానం –
శాంతం పద్మాసనస్థం శశిధరముకుటం పంచవక్త్రం త్రినేత్రం
శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం ।
నాగం పాశం చ ఘంటాం ప్రలయహుతవహం సాంకుశం వామభాగే
నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి ॥
ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః ధ్యాయామి ।
(కొద్దిగా పుష్పాక్షతలు స్వామి వారి పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
ఆవాహనం –
(ఓం స॒ద్యోజా॒త-మ్ప్ర॑పద్యా॒మి)
ఓంకారాయ నమస్తుభ్యం ఓంకారప్రియ శంకర ।
ఆవాహన-ఙ్గృహాణేద-మ్పార్వతీప్రియ వల్లభ ॥
ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః ఆవాహయామి ।
(కొద్దిగా పుష్పాక్షతలు స్వామి వారి పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
ఆసనం –
(ఓం స॒ద్యోజా॒తాయ॒వై నమో॒ నమః॑)
మహాదేవ జగన్నాథ భక్తానామభయప్రద ।
పాద్య-ఙ్గృహాణ దేవేశ మమ సౌఖ్యం-విఀవర్ధయ ॥
ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః నవరత్నఖచిత సువర్ణ సింహాసనం సమర్పయామి ।
(స్వామివారికి సింహాసనం సమర్పిస్తున్నట్లు భావన చేస్తూ, కొద్దిగా పుష్పాక్షతలు స్వామి వారి పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
పాద్యం –
(ఓ-మ్భవే భ॑వే॒న)
యా తే॑ రుద్ర శి॒వా త॒నూరఘో॒రాఽపా॑పకాశినీ ।
తయా॑ నస్త॒నువా॒ శంత॑మయా॒ గిరి॑శంతా॒భిచా॑కశీహి ॥
ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః పాదయోః పాద్యం సమర్పయామి ।
(స్వామివారి పాదాలు కడిగినట్లు భావన చేస్తూ, దేవుని పంచపాత్రలోని నీరు ఉద్ధరిణితో స్వామికి చూపి, వేరొక పాత్రలో విడిచిపెట్టండి)
అర్ఘ్యం –
(ఓం అతి॑ భవే భవస్వ॒మాం)
శివాప్రియ నమస్తేస్తు పావన-ఞ్జలపూరితం ।
అర్ఘ్య-ఙ్గృహాణ భగవ-న్గాంగేయ కలశస్థితం ॥
ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ।
(స్వామివారి చేతులు కడిగినట్లు భావన చేస్తూ, దేవుని పంచపాత్రలోని నీరు ఉద్ధరిణితో స్వామికి చూపి, వేరొక పాత్రలో విడిచిపెట్టండి)
ఆచమనీయం –
(ఓ-మ్భ॒వోద్భ॑వాయ॒ నమః)
వామదేవ సురాధీశ వందితాంఘ్రి సరోరుహ ।
గృహాణాచమన-న్దేవ కరుణా వరుణాలయ ॥
ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః ముఖే ఆచమనీయం సమర్పయామి ।
(దేవుని పంచపాత్రలోని నీరు ఉద్దరిణెతో స్వామికి చూపి, వేరొక పాత్ర లో విడిచిపెట్టి, స్వామివారు ముఖం కడుక్కుని నీరు తాగినట్లు భావన చేయండి)
మధుపర్కం –
యమాంతకాయ ఉగ్రాయ భీమాయ చ నమో నమః ।
మధుపర్క-మ్ప్రదాస్యామి గృహాణ త్వముమాపతే ॥
ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః ముఖే ఆచమనీయం సమర్పయామి ।
(స్వామివారికి మధుపర్కం సమర్పిస్తున్నట్లు భావన చేస్తూ, కొద్దిగా పుష్పాక్షతలు స్వామి వారి పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
పంచామృత స్నానం –
ఆప్యా॑యస్వ॒ సమే॑తు తే వి॒శ్వత॑స్సోమ॒ వృష్ణి॑యం ।
భవా॒ వాజ॑స్య సంగ॒థే ॥
ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః క్షీరేణ స్నపయామి ।
(ఆవు పాలతో అభిషేకం చేసి, నూనె లేదా నెయ్యి దీపంతో హారతి ఇవ్వండి)
(నీటితో అభిషేకం చేసి, ప్రతిమను శుభ్రం చేయండి)
ద॒ధి॒క్రావ్ణో॑ అకారిషం జి॒ష్ణోరశ్వ॑స్య వా॒జిన॑: ।
సు॒ర॒భి నో॒ ముఖా॑ కర॒త్ప్రాణ॒ ఆయూగ్ం॑షి తారిషత్ ॥
ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః దధ్నా స్నపయామి ।
(ఆవు పెరుగుతో అభిషేకం చేసి, నూనె లేదా నెయ్యి దీపంతో హారతి ఇవ్వండి)
(నీటితో అభిషేకం చేసి, ప్రతిమను శుభ్రం చేయండి)
శు॒క్రమ॑సి॒ జ్యోతి॑రసి॒ తేజో॑సి దే॒వోవ॑స్సవి॒తోత్పు॑నా॒తు
అచ్ఛి॑ద్రేణ ప॒విత్రే॑ణ॒ వసో॒స్సూర్య॑స్య ర॒శ్మిభి॑: ।
ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః ఆజ్యేన స్నపయామి ।
(ఆవు నెయ్యితో అభిషేకం చేసి, నూనె లేదా నెయ్యి దీపంతో హారతి ఇవ్వండి)
(నీటితో అభిషేకం చేసి, ప్రతిమను శుభ్రం చేయండి)
మధు॒వాతా॑ ఋతాయ॒తే మధు॑క్షరంతి॒ సింధ॑వః ।
మాధ్వీ᳚ర్నః సం॒త్వౌష॑ధీః ।
మధు॒నక్త॑ము॒తోష॑సి॒ మధు॑మ॒త్ పార్థి॑వ॒గ్ం॒రజ॑: ।
మధు॒ద్యౌర॑స్తు నః పి॒తా ।
మధు॑మాన్నో॒ వన॒స్పతి॒ర్మధు॑మాగ్ం అస్తు॒ సూర్య॑: ।
మాధ్వీ॒ర్గావో॑ భవంతు నః ।
ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః మధునా స్నపయామి ।
(తేనెతో అభిషేకం చేసి, నూనె లేదా నెయ్యి దీపంతో హారతి ఇవ్వండి)
(నీటితో అభిషేకం చేసి, ప్రతిమను శుభ్రం చేయండి)
స్వా॒దుః ప॑వస్వ ది॒వ్యాయ॒ జన్మ॑నే ।
స్వా॒దురింద్రా᳚య సు॒హవీ᳚తు నామ్నే ।
స్వా॒దుర్మి॒త్రాయ॒ వరు॑ణాయ వా॒యవే॒ ।
బృహ॒స్పత॑యే॒ మధు॑మాం॒ అదా᳚భ్యః ।
ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః శర్కరేణ స్నపయామి ।
(చక్కెరతో అభిషేకం చేసి, నూనె లేదా నెయ్యి దీపంతో హారతి ఇవ్వండి)
(నీటితో అభిషేకం చేసి, ప్రతిమను శుభ్రం చేయండి)
యాః ఫ॒లినీ॒ర్యా అ॑ఫ॒లా అ॑పు॒ష్పాయాశ్చ॑ పు॒ష్పిణీ॑: ।
బృహ॒స్పతి॑ ప్రసూతా॒స్తానో॑ మున్చం॒త్వగ్ం హ॑సః ॥
ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః ఫలోదకేన స్నపయామి ।
(పండ్ల రసంతో అభిషేకం చేసి, నూనె లేదా నెయ్యి దీపంతో హారతి ఇవ్వండి)
(నీటితో అభిషేకం చేసి, ప్రతిమను శుభ్రం చేయండి)
స్నానం –
ఆపో॒ హిష్ఠా మ॑యో॒భువ॒స్తా న॑ ఊ॒ర్జే ద॑ధాతన ।
మ॒హేరణా॑య॒ చక్ష॑సే ।
యో వ॑: శి॒వత॑మో రస॒స్తస్య॑ భాజయతే॒ హ న॑: ।
ఉ॒శ॒తీరి॑వ మా॒త॑రః ।
తస్మా॒ అరం॑గమామవో॒ యస్య॒ క్షయా॑య॒ జిన్వ॑థ ।
ఆపో॑ జ॒నయ॑థా చ నః ।
ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః శుద్ధోదక స్నానం సమర్పయామి ।
(పుష్పంతో స్వామి వారిపై కొద్దిగా దేవుని పంచపాత్రలోని నీరు చల్లి, ఆ పుష్పాన్ని స్వామి వారి పాదాల వద్ద విడిచిపెట్టి, స్వామివారికి స్నానం చేయించినట్లు భావన చేయండి)
స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ।
(దేవుని పంచపాత్రలోని నీరు ఉద్దరిణెతో స్వామికి చూపి, వేరొక పాత్ర లో విడిచిపెట్టి, స్వామివారు ముఖం కడుక్కుని నీరు తాగినట్లు భావన చేయండి)
వస్త్రం –
(ఓ-ఞ్జ్యే॒ష్ఠాయ॒ నమః)
నమో నాగవిభూషాయ నారదాది స్తుతాయ చ ।
వస్త్రయుగ్మ-మ్ప్రదాస్యామి పార్థివేశ్వర స్వీకురు ॥
ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః వస్త్రయుగ్మం సమర్పయామి ।
(స్వామివారికి వస్త్రం సమర్పించినట్లు భావన చేస్తూ, కొద్దిగా పుష్పాక్షతలు స్వామి వారి పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
యజ్ఞోపవీతం –
(ఓం శ్రే॒ష్ఠాయ॒ నమః)
యజ్ఞేశ యజ్ఞవిధ్వంస సర్వదేవ నమస్కృత ।
యజ్ఞసూత్ర-మ్ప్రదాస్యామి శోభన-ఞ్చోత్తరీయకం ॥
ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః యజ్ఞోపవీతం సమర్పయామి ।
(స్వామివారికి యజ్ఞోపవీతం సమర్పిస్తున్నట్లు భావన చేస్తూ, కొద్దిగా అక్షతలు స్వామి వారి పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
ఆభరణం –
(ఓం రు॒ద్రాయ॒ నమః)
నాగాభరణ విశ్వేశ చంద్రార్ధకృతమస్తక ।
పార్థివేశ్వర మద్దత్త-ఙ్గృహాణాభరణం-విఀభో ॥
ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః సర్వాభరణాని సమర్పయామి ।
(స్వామివారికి ఆభరణాలు సమర్పిస్తున్నట్లు భావన చేస్తూ, కొద్దిగా పుష్పాక్షతలు స్వామి వారి సమర్పించండి)
గంధం –
(ఓ-ఙ్కాలా॑య॒ నమః॑)
శ్రీ గంధ-న్తే ప్రయచ్ఛామి గృహాణ పరమేశ్వర ।
కస్తూరి కుంకుమోపేతం శివాశ్లిష్ట భుజద్వయ ॥
ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి ।
(గంధాన్ని సమర్పిస్తున్నట్లు భావన చేస్తూ, గంధాన్ని నీటితో తడిపి, ఒక పుష్పంతో స్వామివారి మీద చల్లి, ఆ పుష్పాన్ని స్వామి వారి సమర్పించండి)
అక్షతాన్ –
(ఓ-ఙ్కల॑వికరణాయ॒ నమః)
అక్షతా-న్ధవలా-న్దివ్యాన్ శాలి తుండుల మిశ్రితాన్ ।
అక్షతోసి స్వభావేన స్వీకురుష్వ మహేశ్వర ॥
ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః అక్షతాన్ సమర్పయామి ।
(కొద్దిగా అక్షతలు స్వామి వారి పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
పుష్పాణి –
(ఓ-మ్బల॑ వికరణాయ॒ నమః)
సుగంధీని సుపుష్పాణి జాజీబిల్వార్క చంపకైః ।
నిర్మిత-మ్పుష్పమాలంచ నీలకంఠ గృహాణ భో ॥
ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః నానావిధ పరిమల పత్ర పుష్పాణి సమర్పయామి ।
(కొద్దిగా పుష్పాలు స్వామి వారి పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
అష్టోత్తర శత నామావలీ –
(ప్రతీ నామానికి ఒక్కొక్క పుష్పం స్వామి వారికి సమర్పించండి, పుష్పం అందుబాటులో లేనట్లయితే అక్షతలను ఉపయోగించండి)
ఓం శివాయ నమః
ఓం మహేశ్వరాయ నమః
ఓం శంభవే నమః
ఓం పినాకినే నమః
ఓం శశిశేఖరాయ నమః
ఓం వామదేవాయ నమః
ఓం విరూపాక్షాయ నమః
ఓం కపర్దినే నమః
ఓం నీలలోహితాయ నమః
ఓం శంకరాయ నమః ।10।
ఓం శూలపాణయే నమః
ఓం ఖట్వాంగినే నమః
ఓం విష్ణువల్లభాయ నమః
ఓం శిపివిష్టాయ నమః
ఓం అంబికానాథాయ నమః
ఓం శ్రీకంఠాయ నమః
ఓం భక్తవత్సలాయ నమః
ఓం భవాయ నమః
ఓం శర్వాయ నమః
ఓం త్రిలోకేశాయ నమః ।20।
ఓం శితికంఠాయ నమః
ఓం శివాప్రియాయ నమః
ఓం ఉగ్రాయ నమః
ఓం కపాలినే నమః
ఓం కామారయే నమః
ఓం అంధకాసుర సూదనాయ నమః
ఓం గంగాధరాయ నమః
ఓం లలాటాక్షాయ నమః
ఓం కాలకాలాయ నమః
ఓం కృపానిధయే నమః ।30।
ఓం భీమాయ నమః
ఓం పరశుహస్తాయ నమః
ఓం మృగపాణయే నమః
ఓం జటాధరాయ నమః
ఓం కైలాసవాసినే నమః
ఓం కవచినే నమః
ఓం కఠోరాయ నమః
ఓం త్రిపురాంతకాయ నమః
ఓం వృషాంకాయ నమః
ఓం వృషభారూఢాయ నమః ।40।
ఓం భస్మోద్ధూలిత విగ్రహాయ నమః
ఓం సామప్రియాయ నమః
ఓం స్వరమయాయ నమః
ఓం త్రయీమూర్తయే నమః
ఓం అనీశ్వరాయ నమః
ఓం సర్వజ్ఞాయ నమః
ఓం పరమాత్మనే నమః
ఓం సోమసూర్యాగ్ని లోచనాయ నమః
ఓం హవిషే నమః
ఓం యజ్ఞమయాయ నమః ।50।
ఓం సోమాయ నమః
ఓం పంచవక్త్రాయ నమః
ఓం సదాశివాయ నమః
ఓం విశ్వేశ్వరాయ నమః
ఓం వీరభద్రాయ నమః
ఓం గణనాథాయ నమః
ఓం ప్రజాపతయే నమః
ఓం హిరణ్యరేతసే నమః
ఓం దుర్ధర్షాయ నమః
ఓం గిరీశాయ నమః ।60।
ఓం గిరిశాయ నమః
ఓం అనఘాయ నమః
ఓం భుజంగ భూషణాయ నమః
ఓం భర్గాయ నమః
ఓం గిరిధన్వనే నమః
ఓం గిరిప్రియాయ నమః
ఓం కృత్తివాససే నమః
ఓం పురారాతయే నమః
ఓం భగవతే నమః
ఓం ప్రమథాధిపాయ నమః ।70।
ఓం మృత్యుంజయాయ నమః
ఓం సూక్ష్మతనవే నమః
ఓం జగద్వ్యాపినే నమః
ఓం జగద్గురవే నమః
ఓం వ్యోమకేశాయ నమః
ఓం మహాసేన జనకాయ నమః
ఓం చారువిక్రమాయ నమః
ఓం రుద్రాయ నమః
ఓం భూతపతయే నమః
ఓం స్థాణవే నమః ।80।
ఓం అహిర్బుధ్న్యాయ నమః
ఓం దిగంబరాయ నమః
ఓం అష్టమూర్తయే నమః
ఓం అనేకాత్మనే నమః
ఓం సాత్త్వికాయ నమః
ఓం శుద్ధవిగ్రహాయ నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం ఖండపరశవే నమః
ఓం అజాయ నమః
ఓం పాశవిమోచకాయ నమః ।90।
ఓం మృడాయ నమః
ఓం పశుపతయే నమః
ఓం దేవాయ నమః
ఓం మహాదేవాయ నమః
ఓం అవ్యయాయ నమః
ఓం హరయే నమః
ఓం పూషదంతభిదే నమః
ఓం అవ్యగ్రాయ నమః
ఓం దక్షాధ్వరహరాయ నమః
ఓం హరాయ నమః ।100।
ఓం భగనేత్రభిదే నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం సహస్రాక్షాయ నమః
ఓం సహస్రపాదే నమః
ఓం అపవర్గప్రదాయ నమః
ఓం అనంతాయ నమః
ఓం తారకాయ నమః
ఓం పరమేశ్వరాయ నమః ।108।
ధూపం –
(ఓ-మ్బలా॑య॒ నమః)
దశాంగం ధూపముఖ్యం చ హ్యంగార వినివేశితం ।
ధూపం సుగంధైరుత్పన్నం త్వాం ప్రీణయతు శంకర ॥
ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః ధూపం సమర్పయామి ।
(గంటానాధం చేస్తూ స్వామివారికి వెలిగించిన అగరబత్తి చూపించండి)
దీపం –
(ఓ-మ్బల॑ ప్రమథనాయ॒ నమః)
యోగినాం హృదయేష్వేవ జ్ఞాన దీపాంకురోహ్యసి ।
బాహ్య దీపో మయాదత్తః గృహ్యతాం భక్త గౌరవాత్ ॥
ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః దీపం సమర్పయామి ।
(గంటానాధం చేస్తూ స్వామివారికి వెలిగించిన దీపాన్ని చూపించండి)
ధూప దీపానంతరం ఆచమనీయం సమర్పయామి ।
(దేవుని పంచపాత్రలోని నీరు ఉద్దరిణెతో స్వామికి చూపి, వేరొక పాత్ర లో విడిచిపెట్టి, స్వామివారు ముఖం కడుక్కుని నీరు తాగినట్లు భావన చేయండి)
నైవేద్యం –
(ఓం సర్వ॑ భూత దమనాయ॒ నమః)
నైవేద్యం షడ్రసోపేతం ఘృత భక్ష్య సమన్వితం ।
భక్త్యా తే సంప్రదాస్యామి గృహాణ పరమేశ్వర ॥
ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః నైవేద్యం సమర్పయామి ।
(గంటానాధం చేస్తూ, క్రింది మంత్రం చెపుతూ పుష్పంతో నీటిని నైవేద్యం చుట్టూ 3సార్లు సవ్య దిశలో చల్లాలి)
ఓం భూర్భువ॑స్సువ॑: । తత్స॑వితు॒ర్వరే᳚ణ్యం॒ । భ॒ర్గో॑ దే॒వస్య॑ ధీ॒మహి ।
ధియో॒ యోన॑: ప్రచో॒దయా᳚త్ ॥
సత్యం త్వా ఋతేన పరిషించామి (పుష్పంతో నైవేద్యంపై నీటిని చల్లండి)
(సాయంకాలే) – ఋతం త్వా సత్యేన పరిషించామి (పుష్పంతో నైవేద్యంపై నీటిని చల్లండి)
అమృతమస్తు । అమృతోపస్తరణమసి । (ఆ పుష్పాన్ని స్వామి వారి పాదాల వద్ద విడిచిపెట్టండి)
ఓం ప్రాణాయ స్వాహా । (స్వామివారికి నైవేద్యం చూపించండి)
ఓం అపానాయ స్వాహా । (స్వామివారికి నైవేద్యం చూపించండి)
ఓం వ్యానాయ స్వాహా । (స్వామివారికి నైవేద్యం చూపించండి)
ఓం ఉదానాయ స్వాహా । (స్వామివారికి నైవేద్యం చూపించండి)
ఓం సమానాయ స్వాహా । (స్వామివారికి నైవేద్యం చూపించండి)
(క్రింది మంత్రాలు చెపుతూ పుష్పంతో నీటిని దేవుడి పైన 5 సార్లు చల్లండి)
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి ।
అ॒మృ॒తా॒పి॒ధా॒నమ॑సి ।
ఉత్తరాపోశనం సమర్పయామి ।
హస్తౌ ప్రక్షాలయామి ।
పాదౌ ప్రక్షాలయామి ।
శుద్ధాచమనీయం సమర్పయామి ।
తాంబూలం –
(ఓ-మ్మ॒నోన్మ॑నాయ॒ నమః)
తాంబూలం భవతాం దేవ అర్పయామ్యద్య శంకర ।
పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దలైర్యుతం ॥
ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః తాంబూలం సమర్పయామి ।
(స్వామివారికి తాంబూలం సమర్పిస్తున్నట్లు భావన చేస్తూ, కొద్దిగా పుష్పాక్షతలు స్వామి వారి పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
నీరాజనం –
శ్రీ శంభ॑వే॒ నమః॑ ॥
నమ॑స్తే అస్తు భగవన్-విశ్వేశ్వ॒రాయ॑ మహాదే॒వాయ॑ త్ర్యంబ॒కాయ॑ త్రిపురాంత॒కాయ॑ త్రికాగ్నికా॒లాయ॑ కాలాగ్నిరు॒ద్రాయ॑ నీలకం॒ఠాయ॑ మృత్యుంజ॒యాయ॑ సర్వేశ్వ॒రాయ॑ సదాశి॒వాయ॑ [శంక॒రాయ॑] శ్రీమన్-మహాదే॒వాయ॒ నమః॑ ।
ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః కర్పూర నీరాజనం సమర్పయామి ।
(గంటానాధం చేస్తూ స్వామివారికి కర్పూర హారతి ఇవ్వండి)
నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి । నమస్కరోమి ।
(దేవుని పంచపాత్రలోని నీరు ఉద్దరిణెతో స్వామికి చూపి, వేరొక పాత్ర లో విడిచిపెట్టి, స్వామివారు ముఖం కడుక్కుని నీరు తాగినట్లు భావన చేయండి)
మంత్రపుష్పం –
ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ ।
ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి ।
(కొద్దిగా పుష్పాక్షతలు స్వామి వారి పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
ఆత్మప్రదక్షిణ –
యానికాని చ పాపాని జన్మాంతరకృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ।
పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవ ।
త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సలా ।
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ ।
తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దనా ।
ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ।
(అక్షతలు, పుష్పం తీసుకొని, ఆత్మ ప్రదక్షిణాన్ని మూడు సార్లు చేసి, స్వామి వారి పాదాల వద్ద విడిచి పెట్టండి)
సాష్టాంగ నమస్కారం –
ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా ।
పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే ॥
ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి ।
(పురుషులు సాష్టాంగ, మహిళలు పంచాంగ నమస్కారం చేయండి)
సర్వోపచారాః –
ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః ఛత్రం ఆచ్ఛాదయామి ।
ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః చామరైర్వీజయామి ।
ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః నృత్యం దర్శయామి ।
ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః గీతం శ్రావయామి ।
ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః ఆందోలికాన్నారోహయామి ।
ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః అశ్వానారోహయామి ।
ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః గజానారోహయామి ।
సమస్త రాజోపచారాన్ దేవోపచారాన్ సమర్పయామి ।
క్షమాప్రార్థనా –
అపరాధ సహస్రాణి క్రియంతేఽహర్నిశం మయా ।
దాసోఽయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వర ।
ఆవాహనం న జానామి న జానామి విసర్జనం ।
పూజావిధిం న జానామి క్షమస్వ పరమేశ్వర ।
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన ।
యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే ।
(పుష్పాక్షతలు, ఒక చుక్క నీరు కుడి చేతిలోకి తీసుకొని పై శ్లోకం చదివి, స్వామి వారి పాదాల వద్ద విడిచిపెట్టండి)
అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః శ్రీ ఉమామహేశ్వర సుప్రీతా సుప్రసన్నా వరదా భవంతు ॥
(కొద్దిగా పుష్పాక్షతలు స్వామి వారి పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
తీర్థప్రసాద స్వీకరణ –
అకాలమృత్యహరణం సర్వవ్యాధినివారణం ॥
సమస్తపాపక్షయకరం శ్రీ పరమేశ్వర పాదోదకం పావనం శుభం ॥
శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః ప్రసాదం శీరసా గృహ్ణామి ।
(కుడి చేతిలో నీరు పోసుకొని, పై శ్లోకం చదివి మూడు సార్లు తీర్థం తాగండి)
ఓం శాంతిః శాంతిః శాంతిః ।