Haindavam Logo - Lord Ganesha
Haindavam
📍
Font Size:

మహా గణపతి షోడశోపచార పూజా

సూచనలు:
1. ముందుగా, పూర్వాంగం చేయండి ।
2. తరువాత, విఘ్నేశ్వర పూజ చేయండి ।
3. ఆ తర్వాత, కింద ఇచ్చిన వివరణాత్మక పూజా విధానాన్ని అనుసరించండి ।
పునః సంకల్పం –
(పుష్పాక్షతలు, ఒక చుక్క నీరు కుడి చేతిలోకి తీసుకొని కింద ఉన్న సంకల్పం చదవండి)
పూర్వోక్త ఏవం గుణవిశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమహగణపతిముద్దిశ్య శ్రీమహాగణపతిప్రీత్యర్థం శ్రీమన్ముద్గలపురాణే శ్రీగృత్సమద ప్రోక్త శ్లోకవిధానేన యావచ్ఛక్తి ధ్యానావహనాది షోడశోపచార పూజాం కరిష్యే ॥
(అని చదివి పుష్పాక్షతలు పళ్ళెములో విడిచి, చేతిని శుభ్రం చేసుకోండి)
ప్రాణప్రతిష్ఠ –
ఓం అసు॑నీతే॒ పున॑ర॒స్మాసు॒ చక్షు॒:
పున॑: ప్రా॒ణమి॒హ నో᳚ ధేహి॒ భోగం᳚ ।
జ్యోక్ప॑శ్యేమ॒ సూర్య॑ము॒చ్చరం᳚త॒
మను॑మతే మృ॒డయా᳚ నః స్వ॒స్తి ॥
అ॒మృతం॒ వై ప్రా॒ణా అ॒మృత॒మాప॑:
ప్రా॒ణానే॒వ య॑థాస్థా॒నముప॑హ్వయతే ॥
ఆవాహితో భవ స్థాపితో భవ ।
సుప్రసన్నో భవ వరదో భవ ।
అస్మిన్ బింబే సపరివార సమేత శ్రీమహాగణపతి స్వామినం ఆవాహయామి స్థాపయామి పూజయామి ॥
(కొద్దిగా పుష్పాక్షతలు స్వామి వారి పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
ధ్యానం –
ఓం గ॒ణానాం᳚ త్వా గ॒ణప॑తిగ్ం హవామహే
క॒విం క॑వీ॒నాము॑ప॒మశ్ర॑వస్తమం ।
జ్యే॒ష్ఠ॒రాజం॒ బ్రహ్మ॑ణాం బ్రహ్మణస్పత॒
ఆ న॑: శృ॒ణ్వన్నూ॒తిభి॑: సీద॒ సాద॑నం ॥
చతుర్బాహుం త్రినేత్రం చ గజాస్యం రక్తవర్ణకం ।
పాశాంకుశాదిసమ్యుక్తం మాయాయుక్తం ప్రచింతయేత్ ॥
ఓం శ్రీమహాగణపతయే నమః ధ్యాయామి ।
(కొద్దిగా పుష్పాక్షతలు స్వామి వారి పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
ఆవాహనం –
ఆగచ్ఛ బ్రహ్మణాం నాథ సురాఽసురవరార్చిత ।
సిద్ధిబుద్ధ్యాదిసమ్యుక్త భక్తిగ్రహణలాలస ॥
ఓం శ్రీమహాగణపతయే నమః ఆవహయామి ।
(కొద్దిగా పుష్పాక్షతలు స్వామి వారి పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
సింహాసనం –
రత్నసింహాసనం స్వామిన్ గృహాణ గణనాయక ।
తత్రోపవిశ్య విఘ్నేశ రక్ష భక్తాన్విశేషతః ॥
ఓం శ్రీమహాగణపతయే నమః ఆసనం సమర్పయామి ।
(స్వామివారికి సింహాసనం సమర్పిస్తున్నట్లు భావన చేస్తూ, కొద్దిగా పుష్పాక్షతలు స్వామి వారి పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
పాద్యం –
సువాసితాభిరద్భిశ్చ పాదప్రక్షాలనం ప్రభో ।
శీతోష్ణాంభః కరోమి తే గృహాణ పాద్యముత్తమం ॥
ఓం శ్రీమహాగణపతయే నమః పాద్యం సమర్పయామి ।
(స్వామివారి పాదాలు కడిగినట్లు భావన చేస్తూ, దేవుని పంచపాత్రలోని నీరు ఉద్ధరిణితో స్వామికి చూపి, వేరొక పాత్రలో విడిచిపెట్టండి)
అర్ఘ్యం –
రత్నప్రవాలముక్తాద్యైరనర్ఘ్యైః సంస్కృతం ప్రభో ।
అర్ఘ్యం గృహాణ హేరంబ ద్విరదానన తోషకం ॥
ఓం శ్రీమహాగణపతయే నమః అర్ఘ్యం సమర్పయామి ।
(స్వామివారి చేతులు కడిగినట్లు భావన చేస్తూ, దేవుని పంచపాత్రలోని నీరు ఉద్ధరిణితో స్వామికి చూపి, వేరొక పాత్రలో విడిచిపెట్టండి)
ఆచమనీయం –
సర్వతీర్థాహృతం తోయం సువాసితం సువస్తుభిః ।
ఆచమనం చ తేనైవ కురుష్వ గణనాయక ॥
ఓం శ్రీమహాగణపతయే నమః ఆచమనీయం సమర్పయామి ।
(దేవుని పంచపాత్రలోని నీరు ఉద్దరిణెతో స్వామికి చూపి, వేరొక పాత్ర లో విడిచిపెట్టి, స్వామివారు ముఖం కడుక్కుని నీరు తాగినట్లు భావన చేయండి)
మధుపర్కం –
దధిమధుఘృతైర్యుక్తం మధుపర్కం గజానన ।
గృహాణ భావసమ్యుక్తం మయా దత్తం నమోఽస్తు తే ॥
ఓం శ్రీమహాగణపతయే నమః మధుపర్కం సమర్పయామి ।
(స్వామివారికి మధుపర్కం సమర్పిస్తున్నట్లు భావన చేస్తూ, కొద్దిగా పుష్పాక్షతలు స్వామి వారి పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
పంచామృత స్నానం-
ఆప్యా॑యస్వ॒ సమే॑తు తే వి॒శ్వత॑స్సోమ॒ వృష్ణి॑యం ।
భవా॒ వాజ॑స్య సంగ॒థే ॥
ఓం శ్రీ ______ నమః క్షీరేణ స్నపయామి ।
(గంటానాధం చేస్తూ స్వామివారికి పంచామృత స్నానం చేయించండి)
స్నానం –
గంగాది సర్వతీర్థేభ్యః ఆహృతైరమలైర్జలైః ।
స్నానం కురుష్వ భగవానుమాపుత్ర నమోఽస్తుతే ॥
ఓం శ్రీమహాగణపతయే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి ।
(పుష్పంతో స్వామి వారిపై కొద్దిగా దేవుని పంచపాత్రలోని నీరు చల్లి, ఆ పుష్పాన్ని స్వామి వారి పాదాల వద్ద విడిచిపెట్టి, స్వామివారికి స్నానం చేయించినట్లు భావన చేయండి)
స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ।
(దేవుని పంచపాత్రలోని నీరు ఉద్దరిణెతో స్వామికి చూపి, వేరొక పాత్ర లో విడిచిపెట్టి, స్వామివారు ముఖం కడుక్కుని నీరు తాగినట్లు భావన చేయండి)
వస్త్రం –
వస్త్రయుగ్మం గృహాణ త్వమనర్ఘం రక్తవర్ణకం ।
లోకలజ్జాహరం చైవ విఘ్ననాథ నమోఽస్తు తే ॥
ఓం శ్రీమహాగణపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి ।
(స్వామివారికి వస్త్రం సమర్పించినట్లు భావన చేస్తూ, కొద్దిగా పుష్పాక్షతలు స్వామి వారి పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
యజ్ఞోపవీతం –
ఉపవీతం గణాధ్యక్ష గృహాణ చ తతః పరం ।
త్రైగుణ్యమయరూపం తు ప్రణవగ్రంథిబంధనం ॥
ఓం శ్రీమహాగణపతయే నమః ఉపవీతం సమర్పయామి ।
(స్వామివారికి యజ్ఞోపవీతం సమర్పిస్తున్నట్లు భావన చేస్తూ, కొద్దిగా అక్షతలు స్వామి వారి పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
ఆభరణం –
నానాభూషణకాని త్వమంగేషు వివిధేషు చ ।
భాసురస్వర్ణరత్నైశ్చ నిర్మితాని గృహాణ భో ॥
ఓం శ్రీమహాగణపతయే నమః ఆభరణాని సమర్పయామి ।
(స్వామివారికి ఆభరణాలు సమర్పిస్తున్నట్లు భావన చేస్తూ, కొద్దిగా పుష్పాక్షతలు స్వామి వారి సమర్పించండి)
గంధం –
అష్టగంధసమాయుక్తం గంధం రక్తం గజానన ।
ద్వాదశాంగేషు తే ఢుంఢే లేపయామి సుచిత్రవత్ ॥
ఓం శ్రీమహాగణపతయే నమః గంధాన్ సమర్పయామి ।
(గంధాన్ని సమర్పిస్తున్నట్లు భావన చేస్తూ, గంధాన్ని నీటితో తడిపి, ఒక పుష్పంతో స్వామివారి మీద చల్లి, ఆ పుష్పాన్ని స్వామి వారి సమర్పించండి)
అక్షతాన్ –
రక్తచందనసమ్యుక్తానథవా కుంకుమైర్యుతాన్ ।
అక్షతాన్విఘ్నరాజ త్వం గృహాణ ఫాలమండలే ॥
ఓం శ్రీమహాగణపతయే నమః అక్షతాన్ సమర్పయామి ।
(కొద్దిగా అక్షతలు స్వామి వారి పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
పుష్పం –
చంపకాదిసువృక్షేభ్యః సంభూతాని గజానన ।
పుష్పాణి శమీమందారదూర్వాదీని గృహాణ చ ॥
ఓం శ్రీమహాగణపతయే నమః నానావిధ పరిమల పుష్పాణి సమర్పయామి ।
(కొద్దిగా పుష్పాలు స్వామి వారి పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
అష్టోత్తర శత నామావలీ –
(ప్రతీ నామానికి ఒక్కొక్క పుష్పం స్వామి వారికి సమర్పించండి, పుష్పం అందుబాటులో లేనట్లయితే అక్షతలను ఉపయోగించండి)
ఓం గజాననాయ నమః ।
ఓం గణాధ్యక్షాయ నమః ।
ఓం విఘ్నారాజాయ నమః ।
ఓం వినాయకాయ నమః ।
ఓం ద్వైమాతురాయ నమః ।
ఓం ద్విముఖాయ నమః ।
ఓం ప్రముఖాయ నమః ।
ఓం సుముఖాయ నమః ।
ఓం కృతినే నమః ।
ఓం సుప్రదీపాయ నమః । 10
ఓం సుఖనిధయే నమః ।
ఓం సురాధ్యక్షాయ నమః ।
ఓం సురారిఘ్నాయ నమః ।
ఓం మహాగణపతయే నమః ।
ఓం మాన్యాయ నమః ।
ఓం మహాకాలాయ నమః ।
ఓం మహాబలాయ నమః ।
ఓం హేరంబాయ నమః ।
ఓం లంబజఠరాయ నమః ।
ఓం హ్రస్వగ్రీవాయ నమః । 20
ఓం మహోదరాయ నమః ।
ఓం మదోత్కటాయ నమః ।
ఓం మహావీరాయ నమః ।
ఓం మంత్రిణే నమః ।
ఓం మంగలస్వరాయ నమః ।
ఓం ప్రమథాయ నమః ।
ఓం ప్రథమాయ నమః ।
ఓం ప్రాజ్ఞాయ నమః ।
ఓం విఘ్నకర్త్రే నమః ।
ఓం విఘ్నహంత్రే నమః । 30
ఓం విశ్వనేత్రే నమః ।
ఓం విరాట్పతయే నమః ।
ఓం శ్రీపతయే నమః ।
ఓం వాక్పతయే నమః ।
ఓం శృంగారిణే నమః ।
ఓం ఆశ్రితవత్సలాయ నమః ।
ఓం శివప్రియాయ నమః ।
ఓం శీఘ్రకారిణే నమః ।
ఓం శాశ్వతాయ నమః ।
ఓం బలాయ నమః । 40
ఓం బలోద్ధితాయ నమః ।
ఓం భవాత్మజాయ నమః ।
ఓం పురాణపురుషాయ నమః ।
ఓం పూష్ణే నమః ।
ఓం పుష్కరోత్షిప్తవారిణే నమః ।
ఓం అగ్రగణ్యాయ నమః ।
ఓం అగ్రపూజ్యాయ నమః ।
ఓం అగ్రగామినే నమః ।
ఓం మంత్రకృతే నమః ।
ఓం చామీకరప్రభాయ నమః । 50
ఓం సర్వాయ నమః ।
ఓం సర్వోపాస్యాయ నమః ।
ఓం సర్వకర్త్రే నమః ।
ఓం సర్వనేత్రే నమః ।
ఓం సర్వసిద్ధిప్రదాయ నమః ।
ఓం సర్వసిద్ధయే నమః ।
ఓం పంచహస్తాయ నమః ।
ఓం పార్వతీనందనాయ నమః ।
ఓం ప్రభవే నమః ।
ఓం కుమారగురవే నమః । 60
ఓం అక్షోభ్యాయ నమః ।
ఓం కుంజరాసురభంజనాయ నమః ।
ఓం ప్రమోదాయ నమః ।
ఓం మోదకప్రియాయ నమః ।
ఓం కాంతిమతే నమః ।
ఓం ధృతిమతే నమః ।
ఓం కామినే నమః ।
ఓం కపిత్థవనప్రియాయ నమః ।
ఓం బ్రహ్మచారిణే నమః ।
ఓం బ్రహ్మరూపిణే నమః । 70
ఓం బ్రహ్మవిద్యాదిదానభువే నమః ।
ఓం జిష్ణవే నమః ।
ఓం విష్ణుప్రియాయ నమః ।
ఓం భక్తజీవితాయ నమః ।
ఓం జితమన్మథాయ నమః ।
ఓం ఐశ్వర్యకారణాయ నమః ।
ఓం జ్యాయసే నమః ।
ఓం యక్షకిన్నరసేవితాయ నమః ।
ఓం గంగాసుతాయ నమః ।
ఓం గణాధీశాయ నమః । 80
ఓం గంభీరనినదాయ నమః ।
ఓం వటవే నమః ।
ఓం అభీష్టవరదాయినే నమః ।
ఓం జ్యోతిషే నమః ।
ఓం భక్తనిధయే నమః ।
ఓం భావగమ్యాయ నమః ।
ఓం మంగలప్రదాయ నమః ।
ఓం అవ్యక్తాయ నమః ।
ఓం అప్రాకృతపరాక్రమాయ నమః ।
ఓం సత్యధర్మిణే నమః । 90
ఓం సఖయే నమః ।
ఓం సరసాంబునిధయే నమః ।
ఓం మహేశాయ నమః ।
ఓం దివ్యాంగాయ నమః ।
ఓం మణికింకిణీమేఖాలాయ నమః ।
ఓం సమస్తదేవతామూర్తయే నమః ।
ఓం సహిష్ణవే నమః ।
ఓం సతతోత్థితాయ నమః ।
ఓం విఘాతకారిణే నమః ।
ఓం విశ్వదృశే నమః । 100
ఓం విశ్వరక్షాకృతే నమః ।
ఓం కల్యాణగురవే నమః ।
ఓం ఉన్మత్తవేషాయ నమః ।
ఓం అపరాజితే నమః ।
ఓం సమస్తజగదాధారాయ నమః ।
ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః ।
ఓం ఆక్రాంతచిదచిత్ప్రభవే నమః ।
ఓం శ్రీవిఘ్నేశ్వరాయ నమః । 108
ధూపం –
దశాంగం గుగ్గులుం ధూపం సర్వసౌరభకారకం ।
గృహాణ త్వం మయా దత్తం వినాయక మహోదర ॥
ఓం శ్రీమహాగణపతయే నమః ధూపమాఘ్రాపయామి ।
(గంటానాధం చేస్తూ స్వామివారికి వెలిగించిన అగరబత్తి చూపించండి)
దీపం –
నానాజాతిభవం దీపం గృహాణ గణనాయక ।
అజ్ఞానమలజం దీపం హరంతం జ్యోతిరూపకం ॥
ఓం శ్రీమహాగణపతయే నమః దీపం దర్శయామి ।
(గంటానాధం చేస్తూ స్వామివారికి వెలిగించిన దీపాన్ని చూపించండి)
ధూప దీపానంతరం ఆచమనీయం సమర్పయామి ।
(దేవుని పంచపాత్రలోని నీరు ఉద్దరిణెతో స్వామికి చూపి, వేరొక పాత్ర లో విడిచిపెట్టి, స్వామివారు ముఖం కడుక్కుని నీరు తాగినట్లు భావన చేయండి)
నైవేద్యం –
చతుర్విధాన్నసంపన్నం మధురం లడ్డుకాదికం ।
నైవేద్యం తే మయా దత్తం భోజనం కురు విఘ్నప ॥
ఓం శ్రీమహాగణపతయే నమః నైవేద్యం సమర్పయామి ।
(గంటానాధం చేస్తూ, క్రింది మంత్రం చెపుతూ పుష్పంతో నీటిని నైవేద్యం చుట్టూ 3సార్లు సవ్య దిశలో చల్లాలి)
ఓం భూర్భువ॒స్సువ॑: । తత్స॑వి॒తుర్వరే᳚ణ్యం॒ భర్గో॑ దే॒వస్య॑ ధీమహి ।
ధియో॒ యో న॑: ప్రచో॒దయా᳚త్ ॥
సత్యం త్వా ఋతేన పరిషించామి (పుష్పంతో నైవేద్యంపై నీటిని చల్లండి)
(సాయంకాలే) – ఋతం త్వా సత్యేన పరిషించామి (పుష్పంతో నైవేద్యంపై నీటిని చల్లండి)
అమృతమస్తు । అ॒మృ॒తో॒ప॒స్తర॑ణమసి । (ఆ పుష్పాన్ని స్వామి వారి పాదాల వద్ద విడిచిపెట్టండి)
ఓం ప్రా॒ణాయ॒ స్వాహా᳚ । (స్వామివారికి నైవేద్యం చూపించండి)
ఓం అ॒పా॒నాయ॒ స్వాహా᳚ । (స్వామివారికి నైవేద్యం చూపించండి)
ఓం వ్యా॒నాయ॒ స్వాహా᳚ । (స్వామివారికి నైవేద్యం చూపించండి)
ఓం ఉ॒దా॒నాయ॒ స్వాహా᳚ । (స్వామివారికి నైవేద్యం చూపించండి)
ఓం స॒మా॒నాయ॒ స్వాహా᳚ । (స్వామివారికి నైవేద్యం చూపించండి)
(క్రింది మంత్రాలు చెపుతూ పుష్పంతో నీటిని దేవుడి పైన 5 సార్లు చల్లండి)
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి ।
అ॒మృ॒తా॒పి॒ధా॒నమ॑సి ।
ఉత్తరాపోశనం సమర్పయామి ।
హస్తౌ ప్రక్షాలయామి ।
పాదౌ ప్రక్షాలయామి ।
శుద్ధాచమనీయం సమర్పయామి ।
తాంబూలం –
అష్టాంగం దేవ తాంబూలం గృహాణ ముఖవాసనం ।
అసకృద్విఘ్నరాజ త్వం మయా దత్తం విశేషతః ॥
ఓం శ్రీమహాగణపతయే నమః తాంబూలం సమర్పయామి ।
(స్వామివారికి తాంబూలం సమర్పిస్తున్నట్లు భావన చేస్తూ, కొద్దిగా పుష్పాక్షతలు స్వామి వారి పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
నీరాజనం –
నానాదీపసమాయుక్తం నీరాజనం గజానన ।
గృహాణ భావసమ్యుక్తం సర్వాజ్ఞానవినాశన ॥
ఓం శ్రీమహాగణపతయే నమః నీరాజనం సమర్పయామి ।
(గంటానాధం చేస్తూ స్వామివారికి కర్పూర హారతి ఇవ్వండి)
మంత్రపుష్పం –
ఓం గ॒ణానాం᳚ త్వా గ॒ణప॑తిం హవామహే
క॒విం క॑వీ॒నాము॑ప॒మశ్ర॑వస్తమం ।
జ్యే॒ష్ఠ॒రాజం॒ బ్రహ్మ॑ణాం బ్రహ్మణస్పత॒
ఆ న॑: శృ॒ణ్వన్నూ॒తిభి॑స్సీద॒ సాద॑నం ॥
చతుర్వేదభవైర్మంత్రైర్గాణపత్యైర్గజానన ।
మంత్రితాని గృహాణ త్వం పుష్పపత్రాణి విఘ్నప ॥
ఓం శ్రీమహాగణపతయే నమః మంత్రపుష్పం సమర్పయామి ।
(కొద్దిగా పుష్పాక్షతలు స్వామి వారి పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
ప్రదక్షిణం –
ఏకవింశతిసంఖ్యం వా త్రిసంఖ్యం వా గజానన ।
ప్రాదక్షిణ్యం గృహాణ త్వం బ్రహ్మన్ బ్రహ్మేశభావన ॥
ఓం శ్రీమహాగణపతయే నమః ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ।
(అక్షతలు, పుష్పం తీసుకొని, ఆత్మ ప్రదక్షిణాన్ని మూడు సార్లు చేసి, స్వామి వారి పాదాల వద్ద విడిచి పెట్టండి)
సాష్టాంగనమస్కారః –
సాష్టాంగాం ప్రణతిం నాథ ఏకవింశతిసమ్మితాం ।
హేరంబ సర్వపూజ్య త్వం గృహాణ తు మయా కృతం ॥
ఓం శ్రీమహాగణపతయే నమః సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి ।
(పురుషులు సాష్టాంగ, మహిళలు పంచాంగ నమస్కారం చేయండి)
నమస్కారం –
విఘ్నేశ్వరాయ వరదాయ గణేశ్వరాయ ।
సర్వేశ్వరాయ శుభదాయ సురేశ్వరాయ ॥
విద్యాధరాయ వికటాయ చ వామనాయ ।
భక్తిప్రసన్న వరదాయ నమో నమోఽస్తు ॥
(నమస్కారం చేయండి)
క్షమాప్రార్థన –
అపరాధానసంఖ్యాతాన్ క్షమస్వ గణనాయక ।
భక్తం కురు చ మాం ఢుంఢే తవ పాదప్రియం సదా ॥
(పుష్పాక్షతలు, ఒక చుక్క నీరు కుడి చేతిలోకి తీసుకొని పై శ్లోకం చదివి, స్వామి వారి పాదాల వద్ద విడిచిపెట్టండి)
సమర్పణం –
జాగ్రత్స్వప్నసుషుప్తిభిర్దేహవాఙ్మనసైః కృతం ।
సాంసర్గికేణ యత్కర్మ గణేశాయ సమర్పయే ॥
(పుష్పాక్షతలు, ఒక చుక్క నీరు కుడి చేతిలోకి తీసుకొని పై శ్లోకం చదివి, స్వామి వారి పాదాల వద్ద విడిచిపెట్టండి)
అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మికః శ్రీ మహాగణాధిపతి
సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు ॥
(కొద్దిగా పుష్పాక్షతలు స్వామి వారి పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
తీర్థస్వీకరణ –
బాహ్యం నానావిధం పాపం మహోగ్రం తల్లయం వ్రజేత్ ।
గణేశపాదతీర్థస్య మస్తకే ధారణాత్కిల ॥
శ్రీ మహాగణాధిపతి పాదోదక తీర్థం గృహ్ణామి ।
(కుడి చేతిలో నీరు పోసుకొని, పై శ్లోకం చదివి మూడు సార్లు తీర్థం తాగండి)
ప్రసాదస్వీకరణ –
తతోచ్ఛిష్టం తు నైవేద్యం గణేశస్య భునజ్మ్యహం ।
భుక్తిముక్తిప్రదం పూర్ణం నానాపాపనికృంతనం ॥
శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి ।
(స్వామి వారి పాదాల నుండి ఒక పుష్పాన్ని తీసుకొని మీ రెండు కళ్లకు తాకించండి)
ఓం శాంతిః శాంతిః శాంతిః ॥

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits