సూచనలు:
ఆ తర్వాత, కింద ఇచ్చిన వివరణాత్మక పూజా విధానాన్ని అనుసరించండి ।
ధ్యానం –
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ।
ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే ॥
అగజానన పద్మార్కం గజాననమహర్నిశం
అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ॥
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి । 1 ॥
(కొద్దిగా పుష్పాక్షతలు స్వామి వారి పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
ఆవాహనం –
ఓం గ॒ణానా”o త్వా గ॒ణప॑తిగ్ం హవామహే
క॒విం క॑వీ॒నాము॑ప॒మశ్ర॑వస్తమం ।
జ్యే॒ష్ఠ॒రాజ॒o బ్రహ్మ॑ణాం బ్రహ్మణస్పత॒
ఆ న॑: శృ॒ణ్వన్నూ॒తిభి॑స్సీద॒ సాద॑నం ॥
అస్మిన్ హరిద్రాబింబే శ్రీ విఘ్నేశ్వరం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి । 2 ॥
(కొద్దిగా పుష్పాక్షతలు స్వామి వారి పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
సింహాసనం –
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః నవరత్నఖచిత దివ్య హేమ సింహాసనం సమర్పయామి । 3 ॥
(స్వామివారికి సింహాసనం సమర్పిస్తున్నట్లు భావన చేస్తూ, కొద్దిగా పుష్పాక్షతలు స్వామి వారి పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
పాద్యం –
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః పాదయోః పాద్యం సమర్పయామి । 4 ॥
(స్వామివారి పాదాలు కడిగినట్లు భావన చేస్తూ, దేవుని పంచపాత్రలోని నీరు ఉద్ధరిణితో స్వామికి చూపి, వేరొక పాత్రలో విడిచిపెట్టండి)
అర్ఘ్యం –
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి । 5 ॥
(స్వామివారి చేతులు కడిగినట్లు భావన చేస్తూ, దేవుని పంచపాత్రలోని నీరు ఉద్ధరిణితో స్వామికి చూపి, వేరొక పాత్రలో విడిచిపెట్టండి)
ఆచమనీయం –
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః ముఖే ఆచమనీయం సమర్పయామి । 6 ॥
(దేవుని పంచపాత్రలోని నీరు ఉద్దరిణెతో స్వామికి చూపి, వేరొక పాత్ర లో విడిచిపెట్టి, స్వామివారు ముఖం కడుక్కుని నీరు తాగినట్లు భావన చేయండి)
స్నానం –
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః శుద్ధోదక స్నానం సమర్పయామి । 7 ॥
(పుష్పంతో స్వామి వారిపై కొద్దిగా దేవుని పంచపాత్రలోని నీరు చల్లి, ఆ పుష్పాన్ని స్వామి వారి పాదాల వద్ద విడిచిపెట్టి, స్వామివారికి స్నానం చేయించినట్లు భావన చేయండి)
స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి ।
(దేవుని పంచపాత్రలోని నీరు ఉద్దరిణెతో స్వామికి చూపించి వేరొక పాత్ర లో విడిచిపెట్టండి, స్వామివారు ముఖం కడుక్కుని నీరు తాగినట్లు భావన చేయండి)
వస్త్రం –
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః వస్త్రం సమర్పయామి । 8 ॥
(స్వామివారికి వస్త్రం సమర్పించినట్లు భావన చేస్తూ, కొద్దిగా పుష్పాక్షతలు స్వామి వారి పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
యజ్ఞోపవీతం –
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి ।
(స్వామివారికి యజ్ఞోపవీతం సమర్పిస్తున్నట్లు భావన చేస్తూ, కొద్దిగా అక్షతలు స్వామి వారి పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
ఆభరణం –
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః ఆభరణం సమర్పయామి । 9 ॥
(స్వామివారికి ఆభరణాలు సమర్పిస్తున్నట్లు భావన చేస్తూ, కొద్దిగా పుష్పాక్షతలు స్వామి వారి సమర్పించండి)
గంధం –
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః దివ్య శ్రీ గంధం సమర్పయామి । 10 ॥
(గంధాన్ని సమర్పిస్తున్నట్లు భావన చేస్తూ, గంధాన్ని నీటితో తడిపి, ఒక పుష్పంతో స్వామివారి మీద చల్లి, ఆ పుష్పాన్ని స్వామి వారి సమర్పించండి)
పుష్పైః పూజయామి –
ఓం సుముఖాయ నమః ।
ఓం ఏకదంతాయ నమః ।
ఓం కపిలాయనమః ।
ఓం గజకర్ణకాయ నమః ।
ఓం లంబోదరాయనమః ।
ఓం వికటాయ నమః ।
ఓం విఘ్నరాజాయ నమః ।
ఓం గణాధిపాయనమః ।
ఓం ధూమకేతవే నమః ।
ఓం గణాధ్యక్షాయ నమః ।
ఓం ఫాలచంద్రాయ నమః ।
ఓం గజాననాయ నమః ।
ఓం వక్రతుండాయ నమః ।
ఓం శూర్పకర్ణాయ నమః ।
ఓం హేరంబాయ నమః ।
ఓం స్కందపూర్వజాయ నమః ।
ఓం సర్వసిద్ధిప్రదాయ నమః ।
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి । 11 ॥
(ప్రతీ నామానికి ఒక్కొక్క పుష్పం స్వామివారికి సమర్పించండి)
ధూపం –
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః ధూపం ఆఘ్రాపయామి । 12 ॥
(గంటానాధం చేస్తూ స్వామివారికి వెలిగించిన అగరబత్తి చూపించండి)
దీపం –
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః ప్రత్యక్ష దీపం సమర్పయామి । 13 ॥
(గంటానాధం చేస్తూ స్వామివారికి వెలిగించిన దీపాన్ని చూపించండి)
ధూప దీపానంతరం ఆచమనీయం సమర్పయామి ।
(దేవుని పంచపాత్రలోని నీరు ఉద్దరిణెతో స్వామికి చూపి, వేరొక పాత్ర లో విడిచిపెట్టి, స్వామివారు ముఖం కడుక్కుని నీరు తాగినట్లు భావన చేయండి)
నైవేద్యం –
(గంటానాధం చేస్తూ, క్రింది మంత్రం చెపుతూ పుష్పంతో నీటిని నైవేద్యం చుట్టూ 3సార్లు సవ్య దిశలో చల్లాలి)
ఓం భూర్భువ॒స్సువ॑: । తత్స॑వి॒తుర్వరే”ణ్య॒o భర్గో॑ దే॒వస్య॑ ధీమహి ।
ధియో॒ యో న॑: ప్రచో॒దయా”త్ ॥
ప్రాతః కాలే – స॒త్యం త్వ॒ర్తేన॒ పరి॑షించామి (పుష్పంతో నైవేద్యంపై నీటిని చల్లండి)
సాయంకాలే – ఋ॒తం త్వా॑ స॒త్యేన॒ పరి॑షించామి (పుష్పంతో నైవేద్యంపై నీటిని చల్లండి)
అమృతమస్తు । అ॒మృ॒తో॒ప॒స్తర॑ణమసి ।
శ్రీ విఘ్నేశ్వరాయ నమః ……………… సమర్పయామి ।
(ఆ పుష్పాన్ని స్వామి వారి పాదాల వద్ద విడిచిపెట్టండి)
ఓం ప్రా॒ణాయ॒ స్వాహా” । (స్వామివారికి నైవేద్యం చూపించండి)
ఓం అ॒పా॒నాయ॒ స్వాహా” । (స్వామివారికి నైవేద్యం చూపించండి)
ఓం వ్యా॒నాయ॒ స్వాహా” । (స్వామివారికి నైవేద్యం చూపించండి)
ఓం ఉ॒దా॒నాయ॒ స్వాహా” । (స్వామివారికి నైవేద్యం చూపించండి)
ఓం స॒మా॒నాయ॒ స్వాహా” । (స్వామివారికి నైవేద్యం చూపించండి)
(క్రింది మంత్రాలు చెపుతూ పుష్పంతో నీటిని దేవుడి పైన 5 సార్లు చల్లండి)
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి ।
అ॒మృ॒తా॒పి॒ధా॒నమ॑సి । ఉత్తరాపోశనం సమర్పయామి ।
హస్తౌ ప్రక్షాళయామి ।
పాదౌ ప్రక్షాళయామి ।
శుద్ధాచమనీయం సమర్పయామి ।
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః నైవేద్యం సమర్పయామి । 14 ॥
తాంబూలం –
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః తాంబూలం సమర్పయామి । 15 ॥
(స్వామివారికి తాంబూలం సమర్పిస్తున్నట్లు భావన చేస్తూ, కొద్దిగా పుష్పాక్షతలు స్వామి వారి పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
నీరాజనం –
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః నీరాజనం సమర్పయామి । 16 ॥
(గంటానాధం చేస్తూ స్వామివారికి కర్పూర హారతి ఇవ్వండి)
మంత్రపుష్పం –
సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ॥
ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః
వక్రతుండశ్శూర్పకర్ణో హేరంబస్స్కందపూర్వజః ॥
షోడశైతాని నామాని యః పఠేచ్ఛృణుయాదపి
విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే ॥
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి ।
(కొద్దిగా పుష్పాక్షతలు స్వామి వారి పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
ప్రదక్షిణం –
యానికాని చ పాపాని జన్మాంతరకృతాని చ ।
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ॥
పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవః ।
త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల ॥
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ ।
తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప ॥
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః ప్రదక్షిణా నమస్కారాన్ సమర్పయామి ।
(అక్షతలు, పుష్పం తీసుకొని, ఆత్మ ప్రదక్షిణాన్ని మూడు సార్లు చేసి, స్వామి వారి పాదాల వద్ద విడిచి పెట్టండి)
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః ఛత్ర చామరాది సమస్త రాజోపచారాన్ సమర్పయామి ॥
(కొద్దిగా పుష్పాక్షతలు స్వామి వారి పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
క్షమాప్రార్థన –
యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు ।
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే గజాననం ॥
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప ।
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తు తే ॥
ఓం వక్రతుండ మహాకాయ సూర్య కోటి సమప్రభ ।
నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా ॥
(పుష్పాక్షతలు, ఒక చుక్క నీరు కుడి చేతిలోకి తీసుకొని పై శ్లోకం చదివి, స్వామి వారి పాదాల వద్ద విడిచిపెట్టండి)
అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః శ్రీ విఘ్నేశ్వర సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు ॥
ఉత్తరే శుభకర్మణ్యవిఘ్నమస్తు ఇతి భవంతో బ్రువంతు ।
ఉత్తరే శుభకర్మణి అవిఘ్నమస్తు ॥
తీర్థం –
అకాలమృత్యుహరణం సర్వవ్యాధినివారణం ।
సమస్తపాపక్షయకరం శ్రీ విఘ్నేశ్వర పాదోదకం పావనం శుభం ॥
శ్రీ విఘ్నేశ్వర ప్రసాదం శిరసా గృహ్ణామి ॥
(కుడి చేతిలో నీరు పోసుకొని, పై శ్లోకం చదివి మూడు సార్లు తీర్థం తాగండి)
ఉద్వాసనం –
(గణపతి విగ్రహానికి కానీ, ఫోటోలకు కానీ ఉద్వాసన అవసరం లేదు, కేవలం పసుపుతో చేసిన గణపతికి మాత్రమే ఉద్వాసన చెప్పాలి)
ఓం య॒జ్ఞేన॑ య॒జ్ఞమ॑యజంత దే॒వాః ।
తాని॒ ధర్మా॑ణి ప్రథ॒మాన్యా॑సన్ ।
తే హ॒ నాక॑o మహి॒మాన॑స్సచంతే ।
యత్ర॒ పూర్వే॑ సా॒ధ్యాస్సంతి॑ దే॒వాః ॥
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః యథాస్థానం ఉద్వాసయామి ॥
శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ ।
(కొద్దిగా పుష్పాక్షతలు స్వామి వారి పాదాల వద్ద విడిచి పసుపు గణపతిని ముందుకు, వెనకకు కదిపి నమస్కారం చేసుకోండి)
ఓం శాంతిః శాంతిః శాంతిః ।