Haindavam Logo - Lord Ganesha
Haindavam
📍
Font Size:

త్రిపుర సుందరీ స్తోత్రం

ధ్యానం –
బాలార్కమండలాభాసాం చతుర్బాహాం త్రిలోచనాం ।
పాశాంకుశ శరాఞ్శ్చాపాన్ ధారయంతీం శివాం భజే ॥ 1 ॥
బాలార్కయుతతైజసాం త్రినయనాం రక్తాంబరోల్లాసినీం ।
నానాలంకృతిరాజమానవపుషం బాలేందు యుక్ శేఖరాం ।
హస్తైరిక్షుధనుః సృణిం సుమశరాం పాశం ముదాబిభ్రతీం
శ్రీచక్రస్థిత సుందరీం త్రిజగతామాధారభూతాం భజే ॥ 2 ॥
పద్మరాగ ప్రతీకాశాం సునేత్రాం చంద్రశేఖరాం
నవరత్నలసద్భూషాం భూషితాపాదమస్తకాం ॥ 3 ॥
పాశాంకుశౌ పుష్ప శరాన్ దధతీం పుండ్రచాపకం
పూర్ణ తారుణ్య లావణ్య తరంగిత కలేబరాం ॥ 4 ॥
స్వ సమానాకారవేషకామేశాశ్లేష సుందరాం ।
చతుర్భుజే చంద్రకలావతంసే
కుచోన్నతే కుంకుమ రాగ శ్రోణే
పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే
నమస్తే జగదేక మాతః ॥
స్తోత్రం –
శ్రీం బీజే నాద బిందుద్వితయ శశి కలాకారరూపే స్వరూపే
మాతర్మే దేహి బుద్దిం జహి జహి జడతాం పాహిమాం దీన దీనం ।
అజ్ఞాన ధ్వాంత నాశక్షమరుచిరుచిర ప్రోల్లసత్పాద పద్మే
బ్రహ్మేశాద్యఃసురేంద్రైః సురగణ వినతైః సంస్తుతాం త్వాం నమామి ॥ 1 ॥
కల్పో సంపరణ కల్పిత తాండవస్య
దేవస్య ఖండపరశోః పరభైరవస్య ।
పాశాంకుశైక్షవశరాసన పుష్పబాణా
ససాక్షిణీ విజయతే తవ మూర్తిరేకా ॥ 2 ॥
హ్రీంకారమేవ తవనామ గృణంతి యేవా
మాతః త్రికోణనిలయే త్రిపురే త్రినేత్రే ।
త్వత్సంస్మృతౌ యమభటాభి భవం విహాయ
దీవ్యంతి నందన వనే సహలోకపాలైః ॥ 3 ॥
ఋణాంకానల భానుమండలలసచ్ఛ్రీచక్రమధ్యేస్థితాం
బాలార్కద్యుతి భాసురాం కరతలైః పాశాంకుశౌ బిభ్రతీం ।
చాపం బాణమపి ప్రసన్నవదనాం కౌసుంభవస్త్రాన్వితాం
తాం త్వాం చంద్రకలావతంసముకుటాం చారుస్మితాం భావయే ॥ 4 ॥
సర్వజ్ఞతాం సదసివాక్పటుతాం ప్రసూతే
దేవి త్వదంఘ్రి నరసిరుహయోః ప్రణామః ।
కించిత్స్ఫురన్ముకుటముజ్వలమాతపత్రం
ద్వౌచామరే చ మహతీం వసుధాం దధాతి ॥ 5 ॥
కల్యాణవృష్టిభిరివామృతపూరితాభిః
లక్ష్మీ స్వయంవరణమంగలదీపకాభిః ।
సేవాభిరంబ తవపాదసరోజమూలే
నాకారికిమ్మనసి భక్తిమతాం జనానాం ॥ 6 ॥
శివశక్తిః కామః క్షితిరథరవిః శాంత కిరణః
స్మరో హంసః శక్రస్తదను చ పరామారహరయః ।
అమీ హృల్లేఖాభిస్తి సృభిరవసానేషు ఘటితా
భజంతే వర్ణాస్తే తవజనని నామవయవతాం ॥ 7 ॥
కదాకాలే మాతః కథయకలితా లక్తకరసం
పిబేయం విద్యార్ధీ తవ చరణ నిర్ణేజనజలం ।
ప్రకృత్యా మూకానామపి చ కవితా కారణతయా
సదాధత్తే వాణీ ముఖకమల తాంబూల రసతాం ॥ 8 ॥

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits