Haindavam Logo - Lord Ganesha
Haindavam
📍
Font Size:

రథ సప్తమి శ్లోకాః

అర్కపత్ర స్నాన శ్లోకాః ।
సప్తసప్తిప్రియే దేవి సప్తలోకైకదీపికే ।
సప్తజన్మార్జితం పాపం హర సప్తమి సత్వరం ॥ 1 ॥
యన్మయాత్ర కృతం పాపం పూర్వం సప్తసు జన్మసు ।
తత్సర్వం శోకమోహౌ చ మాకరీ హంతు సప్తమీ ॥ 2 ॥
నమామి సప్తమీం దేవీం సర్వపాపప్రణాశినీం ।
సప్తార్కపత్రస్నానేన మమ పాపం వ్యాపోహతు ॥ 3 ॥
అర్ఘ్య శ్లోకం ।
సప్త సప్తి వహప్రీత సప్తలోక ప్రదీపన ।
సప్తమీ సహితో దేవ గృహాణార్ఘ్యం దివాకర ॥ 1 ॥
అన్య పాఠః –
యదా జన్మకృతం పాపం మయా జన్మసు జన్మసు ।
తన్మే రోగం చ శోకం చ మాకరీ హంతు సప్తమీ ॥ 1
ఏతజ్జన్మ కృతం పాపం యచ్చ జన్మాంతరార్జితం ।
మనో వాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పునః ॥ 2
ఇతి సప్తవిధం పాపం స్నానాన్మే సప్త సప్తికే ।
సప్తవ్యాధి సమాయుక్తం హర మాకరి సప్తమీ ॥ 3
సప్త సప్త మహాసప్త సప్త ద్వీపా వసుంధరా ।
శ్వేతార్క పర్ణమాదాయ సప్తమీ రథ సప్తమీ ॥ 4

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits