Haindavam Logo - Lord Ganesha
Haindavam
📍
Font Size:

ఆంజనేయ షోడశోపచార పూజా

సూచనలు:
1. ముందుగా, పూర్వాంగం చేయండి ।
2. తరువాత, విఘ్నేశ్వర పూజ చేయండి ।
3. ఆ తర్వాత, కింద ఇచ్చిన వివరణాత్మక పూజా విధానాన్ని అనుసరించండి ।
పునః సంకల్పం –
(పుష్పాక్షతలు, ఒక చుక్క నీరు కుడి చేతిలోకి తీసుకొని కింద ఉన్న సంకల్పం చదవండి)
పూర్వోక్త ఏవం గుణవిశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీ ఆంజనేయ ముద్దిశ్య శ్రీ ఆంజనేయ ప్రీత్యర్థం యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే ॥
(అని చదివి పుష్పాక్షతలు పళ్ళెములో విడిచి, చేతిని శుభ్రం చేసుకోండి)
ధ్యానం –
మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం ।
వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే ॥
ఓం శ్రీ ఆంజనేయాయ నమః ధ్యాయామి ।
(కొద్దిగా పుష్పాక్షతలు స్వామి వారి పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
ఆవాహనం –
రామచంద్రపదాంభోజయుగల స్థిరమాసనం ।
ఆవాహయామి వరదం హనూమంతమభీష్టదం ॥
ఓం శ్రీ ఆంజనేయాయ నమః ఆవాహయామి ।
(కొద్దిగా పుష్పాక్షతలు స్వామి వారి పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
ఆసనం –
నవరత్ననిబద్ధాశ్రం చతురశ్రం సుశోభనం ।
సౌవర్ణమాసనం తుభ్యం దాస్యామి కపినాయక ॥
ఓం శ్రీ ఆంజనేయాయ నమః నవరత్నఖచిత సువర్ణ సింహాసనం సమర్పయామి ।
(స్వామివారికి సింహాసనం సమర్పిస్తున్నట్లు భావన చేస్తూ, కొద్దిగా పుష్పాక్షతలు స్వామి వారి పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
పాద్యం –
సువర్ణకలశానీతం గంగాది సలిలైర్యుతం ।
పాదయోః పాద్యమనఘం ప్రతిగృహ్య ప్రసీద మే ॥
ఓం శ్రీ ఆంజనేయాయ నమః పాదయోః పాద్యం సమర్పయామి ।
(స్వామివారి పాదాలు కడిగినట్లు భావన చేస్తూ, దేవుని పంచపాత్రలోని నీరు ఉద్ధరిణితో స్వామికి చూపి, వేరొక పాత్రలో విడిచిపెట్టండి)
అర్ఘ్యం –
లక్ష్మణప్రాణసంరక్ష సీతాశోకవినాశన ।
గృహాణార్ఘ్యం మయా దత్తం అంజనాప్రియనందన ॥
ఓం శ్రీ ఆంజనేయాయ నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ।
(స్వామివారి చేతులు కడిగినట్లు భావన చేస్తూ, దేవుని పంచపాత్రలోని నీరు ఉద్ధరిణితో స్వామికి చూపి, వేరొక పాత్రలో విడిచిపెట్టండి)
ఆచమనీయం –
వాలాగ్రసేతుబంధాయ శతాననవధాయ చ ।
తుభ్యమాచమనం దత్తం ప్రతిగృహ్ణీష్వ మారుతే ॥
ఓం శ్రీ ఆంజనేయాయ నమః ముఖే ఆచమనీయం సమర్పయామి ।
(దేవుని పంచపాత్రలోని నీరు ఉద్దరిణెతో స్వామికి చూపి, వేరొక పాత్ర లో విడిచిపెట్టి, స్వామివారు ముఖం కడుక్కుని నీరు తాగినట్లు భావన చేయండి)
మధుపర్కం –
అర్జునధ్వజసంవాస దశాననమదాపహ ।
మధుపర్కం ప్రదాస్యామి హనుమన్ ప్రతిగృహ్యతాం ॥
ఓం శ్రీ ఆంజనేయాయ నమః ముఖే ఆచమనీయం సమర్పయామి ।
(స్వామివారికి మధుపర్కం సమర్పిస్తున్నట్లు భావన చేస్తూ, కొద్దిగా పుష్పాక్షతలు స్వామి వారి పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
స్నానం –
గంగాదిసర్వతీర్థేభ్యః సమానీతైర్నవోదకైః ।
భవంతం స్నపయిష్యామి కపినాయక గృహ్యతాం ॥
ఓం శ్రీ ఆంజనేయాయ నమః శుద్ధోదక స్నానం సమర్పయామి ।
(పుష్పంతో స్వామి వారిపై కొద్దిగా దేవుని పంచపాత్రలోని నీరు చల్లి, ఆ పుష్పాన్ని స్వామి వారి పాదాల వద్ద విడిచిపెట్టి, స్వామివారికి స్నానం చేయించినట్లు భావన చేయండి)
స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ।
(దేవుని పంచపాత్రలోని నీరు ఉద్దరిణెతో స్వామికి చూపి, వేరొక పాత్ర లో విడిచిపెట్టి, స్వామివారు ముఖం కడుక్కుని నీరు తాగినట్లు భావన చేయండి)
వస్త్రం –
పీతాంబరమిదం తుభ్యం తప్తహాటకసన్నిభం ।
దాస్యామి వానరశ్రేష్ఠ సంగృహాణ నమోఽస్తు తే ॥
ఉత్తరీయం తు దాస్యామి సంసారోత్తారకారణ ।
గృహాణ చ మయా ప్రీత్యా దత్తం ధత్స్వ యథావిధి ॥
ఓం శ్రీ ఆంజనేయాయ నమః వస్త్రయుగ్మం సమర్పయామి ।
(స్వామివారికి వస్త్రం సమర్పించినట్లు భావన చేస్తూ, కొద్దిగా పుష్పాక్షతలు స్వామి వారి పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
యజ్ఞోపవీతం –
నవభిస్తంతుభిర్యుక్తం త్రిగుణం దేవతామయం ।
ఉపవీతం చోత్తరీయం గృహాణ రామకింకర ॥
ఓం శ్రీ ఆంజనేయాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి ।
(స్వామివారికి యజ్ఞోపవీతం సమర్పిస్తున్నట్లు భావన చేస్తూ, కొద్దిగా అక్షతలు స్వామి వారి పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
గంధం –
కస్తూరీకుంకుమామిశ్రం కర్పూరాగరువాసితం ।
శ్రీచందనం తు దాస్యామి గృహ్యతాం హనుమత్ప్రభో ॥
ఓం శ్రీ ఆంజనేయాయ నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి ।
(గంధాన్ని సమర్పిస్తున్నట్లు భావన చేస్తూ, గంధాన్ని నీటితో తడిపి, ఒక పుష్పంతో స్వామివారి మీద చల్లి, ఆ పుష్పాన్ని స్వామి వారి సమర్పించండి)
ఆభరణం –
భూషణాని మహార్హాణి కిరీటప్రముఖాన్యహం ।
తుభ్యం దాస్యామి సర్వేశ గృహాణ కపినాయక ॥
ఓం శ్రీ ఆంజనేయాయ నమః సర్వాభరణాని సమర్పయామి ।
(స్వామివారికి ఆభరణాలు సమర్పిస్తున్నట్లు భావన చేస్తూ, కొద్దిగా పుష్పాక్షతలు స్వామి వారి సమర్పించండి)
పుష్పాణి –
సుగంధీని సురూపాణి వన్యాని వివిధాని చ ।
చంపకాదీని పుష్పాణి కమలాన్యుత్పలాని చ ॥
తులసీదల బిల్వాని మనసా కల్పితాని చ ।
గృహాణ హనుమద్దేవ ప్రణతోఽస్మి పదాంబుజే ॥
ఓం శ్రీ ఆంజనేయాయ నమః నానావిధ పరిమల పత్ర పుష్పాణి సమర్పయామి ।
(కొద్దిగా పుష్పాలు స్వామి వారి పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
ధూపం –
దివ్యం సగుగ్గులం రమ్యం దశాంగేన సమన్వితం ।
గృహాణ మారుతే ధూపం సుప్రియం ఘ్రాణతత్పరం ॥
ఓం శ్రీ ఆంజనేయాయ నమః ధూపం సమర్పయామి ।
(గంటానాధం చేస్తూ స్వామివారికి వెలిగించిన అగరబత్తి చూపించండి)
దీపం –
సాజ్యం త్రివర్తి సమ్యుక్తం వహ్నినా యోజితం మయా ।
గృహాణ మంగలం దీపం త్రైలోక్య తిమిరాపహం ॥
సుప్రకాశో మహాదీపః సర్వతస్తిమిరాపహః ।
సబాహ్యాభ్యంతరం జ్యోతిర్దీపోఽయం ప్రతిగృహ్యతాం ॥
ఓం శ్రీ ఆంజనేయాయ నమః దీపం సమర్పయామి ।
(గంటానాధం చేస్తూ స్వామివారికి వెలిగించిన దీపాన్ని చూపించండి)
ధూప దీపానంతరం ఆచమనీయం సమర్పయామి ।
(దేవుని పంచపాత్రలోని నీరు ఉద్దరిణెతో స్వామికి చూపి, వేరొక పాత్ర లో విడిచిపెట్టి, స్వామివారు ముఖం కడుక్కుని నీరు తాగినట్లు భావన చేయండి)
నైవేద్యం –
మణిపాత్ర సహస్రాఢ్యం దివ్యాన్నం ఘృతపాయసం
ఆపూపలడ్డూకోపేతం మధురామ్రఫలైర్యుతం ।
హింగూ జీరక సమ్యుక్తం షడ్రసోపేతముత్తమం
నైవేద్యమర్పయామ్యద్య గృహాణేదం కపీశ్వర ॥
ఓం శ్రీ ఆంజనేయాయ నమః నైవేద్యం సమర్పయామి ।
(గంటానాధం చేస్తూ, క్రింది మంత్రం చెపుతూ పుష్పంతో నీటిని నైవేద్యం చుట్టూ 3సార్లు సవ్య దిశలో చల్లాలి)
ఓం భూర్భువ॑స్సువ॑: । తత్స॑వితు॒ర్వరే᳚ణ్యం॒ । భ॒ర్గో॑ దే॒వస్య॑ ధీ॒మహి ।
ధియో॒ యోన॑: ప్రచో॒దయా᳚త్ ॥
సత్యం త్వా ఋతేన పరిషించామి (పుష్పంతో నైవేద్యంపై నీటిని చల్లండి)
(సాయంకాలే) – ఋతం త్వా సత్యేన పరిషించామి (పుష్పంతో నైవేద్యంపై నీటిని చల్లండి)
అమృతమస్తు । అమృతోపస్తరణమసి । (ఆ పుష్పాన్ని స్వామి వారి పాదాల వద్ద విడిచిపెట్టండి)
ఓం ప్రాణాయ స్వాహా । (స్వామివారికి నైవేద్యం చూపించండి)
ఓం అపానాయ స్వాహా । (స్వామివారికి నైవేద్యం చూపించండి)
ఓం వ్యానాయ స్వాహా । (స్వామివారికి నైవేద్యం చూపించండి)
ఓం ఉదానాయ స్వాహా । (స్వామివారికి నైవేద్యం చూపించండి)
ఓం సమానాయ స్వాహా । (స్వామివారికి నైవేద్యం చూపించండి)
(క్రింది మంత్రాలు చెపుతూ పుష్పంతో నీటిని దేవుడి పైన 5 సార్లు చల్లండి)
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి ।
అ॒మృ॒తా॒పి॒ధా॒నమ॑సి ।
ఉత్తరాపోశనం సమర్పయామి ।
హస్తౌ ప్రక్షాలయామి ।
పాదౌ ప్రక్షాలయామి ।
శుద్ధాచమనీయం సమర్పయామి ।
తాంబూలం –
నాగవల్లీదలోపేతం క్రముకైర్మధురైర్యుతం ।
తాంబూలమర్పయామ్యద్య కర్పూరాది సువాసితం ॥
ఓం శ్రీ ఆంజనేయాయ నమః తాంబూలం సమర్పయామి ।
(స్వామివారికి తాంబూలం సమర్పిస్తున్నట్లు భావన చేస్తూ, కొద్దిగా పుష్పాక్షతలు స్వామి వారి పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
నీరాజనం –
ఆరార్తికం తమోహారి శతసూర్య సమప్రభం ।
అర్పయామి తవ ప్రీత్యై అంధకార నిషూదనం ॥
ఓం శ్రీ ఆంజనేయాయ నమః కర్పూర నీరాజనం సమర్పయామి ।
(గంటానాధం చేస్తూ స్వామివారికి కర్పూర హారతి ఇవ్వండి)
నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి । నమస్కరోమి ।
(దేవుని పంచపాత్రలోని నీరు ఉద్దరిణెతో స్వామికి చూపి, వేరొక పాత్ర లో విడిచిపెట్టి, స్వామివారు ముఖం కడుక్కుని నీరు తాగినట్లు భావన చేయండి)
మంత్రపుష్పం –
ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ
ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్ ॥
ఓం శ్రీ ఆంజనేయాయ నమః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి ।
(కొద్దిగా పుష్పాక్షతలు స్వామి వారి పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
ఆత్మప్రదక్షిణ –
యానికాని చ పాపాని జన్మాంతరకృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ।
పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవ ।
త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సలా ।
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ ।
తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దనా ।
ఓం శ్రీ ఆంజనేయాయ నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ।
(అక్షతలు, పుష్పం తీసుకొని, ఆత్మ ప్రదక్షిణాన్ని మూడు సార్లు చేసి, స్వామి వారి పాదాల వద్ద విడిచి పెట్టండి)
సాష్టాంగ నమస్కారం –
ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా ।
పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే ॥
ఓం శ్రీ ఆంజనేయాయ నమః సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి ।
(పురుషులు సాష్టాంగ, మహిళలు పంచాంగ నమస్కారం చేయండి)
సర్వోపచారాః –
ఓం శ్రీ ఆంజనేయాయ నమః ఛత్రం ఆచ్ఛాదయామి ।
ఓం శ్రీ ఆంజనేయాయ నమః చామరైర్వీజయామి ।
ఓం శ్రీ ఆంజనేయాయ నమః నృత్యం దర్శయామి ।
ఓం శ్రీ ఆంజనేయాయ నమః గీతం శ్రావయామి ।
ఓం శ్రీ ఆంజనేయాయ నమః ఆందోలికాన్నారోహయామి ।
ఓం శ్రీ ఆంజనేయాయ నమః అశ్వానారోహయామి ।
ఓం శ్రీ ఆంజనేయాయ నమః గజానారోహయామి ।
సమస్త రాజోపచారాన్ దేవోపచారాన్ సమర్పయామి ।
క్షమాప్రార్థనా –
అపరాధ సహస్రాణి క్రియంతేఽహర్నిశం మయా ।
దాసోఽయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వర ।
ఆవాహనం న జానామి న జానామి విసర్జనం ।
పూజావిధిం న జానామి క్షమస్వ పరమేశ్వర ।
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన ।
యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే ।
(పుష్పాక్షతలు, ఒక చుక్క నీరు కుడి చేతిలోకి తీసుకొని పై శ్లోకం చదివి, స్వామి వారి పాదాల వద్ద విడిచిపెట్టండి)
అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః శ్రీ ఆంజనేయ సుప్రీతా సుప్రసన్నా వరదా భవంతు ॥
(కొద్దిగా పుష్పాక్షతలు స్వామి వారి పాదాల వద్ద విడిచి నమస్కారం చేసుకోండి)
తీర్థప్రసాద స్వీకరణ –
అకాలమృత్యహరణం సర్వవ్యాధినివారణం ॥
సమస్తపాపక్షయకరం శ్రీ ఆంజనేయ పాదోదకం పావనం శుభం ॥
శ్రీ ఆంజనేయాయ నమః ప్రసాదం శీరసా గృహ్ణామి ।
(కుడి చేతిలో నీరు పోసుకొని, పై శ్లోకం చదివి మూడు సార్లు తీర్థం తాగండి)
ఓం శాంతిః శాంతిః శాంతిః ।

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits