Haindavam Logo - Lord Ganesha

హైందవం

📍
Font Size:

దత్త షోదశి

పల్లవి సచ్చిదానంద సద్గురు దత్తం భజ భజ భక్త షోడశావతార రూప దత్తం భజరే భక్త చరణం మహిషపురవాస శ్రీ కాలాగ్నిశమన దత్తం ప్రొద్దుటూరు గ్రామవాస యోగిరాజవల్లభం బెంగళూరు నగరస్థిత దత్తయోగిరాజం అనంతపురే స్థితం జ్ఞానసాగరం భజ దత్తమ్ 1 విజయవాడ విలసితం శ్యామకమలలోచనం మచిలీపట్టణ సంస్థితం అత్రివరదరాజం జయలక్ష్మీపురే సంస్కారహీన శివరూపం మద్రాసు నగర సంవాసం ఆదిగురు నామకం 2 ఋషీకేశ తీర్థరాజం శ్రీ దిగంబర దత్తం ఆకివీడుస్థం విశ్వాంబరావధూత దత్తం నూజివీడు పట్టణే దేవదేవ అవతారం భాగ్యనగర స్థితం దత్తావధూతం భజ 3 గండిగుంట జనపదే దత్తదిగంబర దేవం కొచ్చిన్ నగరే స్థితం సిద్ధరాజ నామకం మాయాముక్తావధూత మచ్చరపాకే లీలావిశ్వంభరం సూరన్నగరే భజ 4 సచ్చిదానంద జన్మస్థలే దత్తకాశీశ్వరం పూర్వసముద్ర తీరే దత్త రామేశ్వరం సచ్చిదానంద సద్గురు దత్తం భజ భజ భక్త షోడశావతార రూప దత్తం భజరే భక్త 5

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits