Haindavam Logo - Lord Ganesha

హైందవం

📍
Font Size:

గోవింద నామాలు

గోవిందా హరి గోవిందా । గోకులనందన గోవిందా । శ్రీ శ్రీనివాసా గోవిందా । శ్రీ వేంకటేశా గోవిందా । భక్తవత్సలా గోవిందా । భాగవతప్రియ గోవిందా ॥ 1 నిత్యనిర్మలా గోవిందా । నీలమేఘశ్యామ గోవిందా । పురాణపురుషా గోవిందా । పుండరీకాక్ష గోవిందా ॥ 2 నందనందనా గోవిందా । నవనీతచోర గోవిందా । పశుపాలక శ్రీ గోవిందా । పాపవిమోచన గోవిందా ॥ 3 దుష్టసంహార గోవిందా । దురితనివారణ గోవిందా । శిష్టపరిపాలక గోవిందా । కష్టనివారణ గోవిందా ॥ 4 వజ్రమకుటధర గోవిందా । వరాహమూర్తి గోవిందా । గోపీజనలోల గోవిందా । గోవర్ధనోద్ధార గోవిందా ॥ 5 దశరథనందన గోవిందా । దశముఖమర్దన గోవిందా । పక్షివాహన గోవిందా । పాండవప్రియ గోవిందా ॥ 6 మత్స్య కూర్మ గోవిందా । మధుసూదన హరి గోవిందా । వరాహ నరసింహ గోవిందా । వామన భృగురామ గోవిందా ॥ 7 బలరామానుజ గోవిందా । బౌద్ధకల్కిధర గోవిందా । వేణుగానప్రియ గోవిందా । వేంకటరమణా గోవిందా ॥ 8 సీతానాయక గోవిందా । శ్రితపరిపాలక గోవిందా । దరిద్రజనపోషక గోవిందా । ధర్మసంస్థాపక గోవిందా ॥ 9 అనాథరక్షక గోవిందా । ఆపద్బాంధవ గోవిందా । శరణాగతవత్సల గోవిందా । కరుణాసాగర గోవిందా ॥ 10 కమలదళాక్ష గోవిందా । కామితఫలదా గోవిందా । పాపవినాశక గోవిందా । పాహి మురారే గోవిందా ॥ 11 శ్రీముద్రాంకిత గోవిందా । శ్రీవత్సాంకిత గోవిందా । ధరణీనాయక గోవిందా । దినకరతేజా గోవిందా ॥ 12 పద్మావతిప్రియ గోవిందా । ప్రసన్నమూర్తీ గోవిందా । అభయహస్త గోవిందా । అక్షయవరద గోవిందా ॥ 13 శంఖచక్రధర గోవిందా । శార్ఙ్గగదాధర గోవిందా । విరజాతీర్థస్థ గోవిందా । విరోధిమర్దన గోవిందా ॥ 14 సాలగ్రామధర గోవిందా । సహస్రనామా గోవిందా । లక్ష్మీవల్లభ గోవిందా । లక్ష్మణాగ్రజ గోవిందా ॥ 15 కస్తూరితిలక గోవిందా । కాంచనాంబరధర గోవిందా । గరుడవాహన గోవిందా । గజరాజరక్షక గోవిందా ॥ 16 వానరసేవిత గోవిందా । వారధిబంధన గోవిందా । సప్తగిరీశా గోవిందా । ఏకస్వరూపా గోవిందా ॥ 17 శ్రీరామకృష్ణా గోవిందా । రఘుకులనందన గోవిందా । ప్రత్యక్షదేవా గోవిందా । పరమదయాకర గోవిందా ॥ 18 వజ్రకవచధర గోవిందా । వైజయంతిమాల గోవిందా । వడ్డికాసులవాడ గోవిందా । వసుదేవతనయా గోవిందా ॥ 19 బిల్వపత్రార్చిత గోవిందా । భిక్షుకసంస్తుత గోవిందా । స్త్రీపుంరూపా గోవిందా । శివకేశవమూర్తి గోవిందా ॥ 20 బ్రహ్మాండరూపా గోవిందా । భక్తరక్షక గోవిందా । నిత్యకళ్యాణ గోవిందా । నీరజనాభ గోవిందా ॥ 21 హథీరామప్రియ గోవిందా । హరిసర్వోత్తమ గోవిందా । జనార్దనమూర్తి గోవిందా । జగత్సాక్షిరూప గోవిందా ॥ 22 అభిషేకప్రియ గోవిందా । ఆపన్నివారణ గోవిందా । రత్నకిరీటా గోవిందా । రామానుజనుత గోవిందా ॥ 23 స్వయంప్రకాశా గోవిందా । ఆశ్రితపక్ష గోవిందా । నిత్యశుభప్రద గోవిందా । నిఖిలలోకేశ గోవిందా ॥ 24 ఆనందరూపా గోవిందా । ఆద్యంతరహితా గోవిందా । ఇహపరదాయక గోవిందా । ఇభరాజరక్షక గోవిందా ॥ 25 పరమదయాళో గోవిందా । పద్మనాభహరి గోవిందా । తిరుమలవాసా గోవిందా । తులసీవనమాల గోవిందా ॥ 26 శేషసాయినే గోవిందా । శేషాద్రినిలయా గోవిందా । శ్రీనివాస శ్రీ గోవిందా । శ్రీ వేంకటేశా గోవిందా ॥ 27 గోవిందా హరి గోవిందా । గోకులనందన గోవిందా ।

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits